అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి పెరుగుతోంది. కేసులు నాలుగు లక్షలు దాటేశాయి. శనివారం (24 గంటల్లో )10,548 మందికి కరోనా ప్రబలింది. ఇలా ఇప్పటివరకు రాష్ట్రంలో 4,14,164 కేసులు నిర్ధారణ అయినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. రోజురోజుకూ పెరుగుతున్న కేసుల సంఖ్యను చూస్తే అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. మహమ్మారి బారినపడి తాజాగా 82 మంది మృతిచెందగా.. ఇప్పటివరకు మృతుల సంఖ్య 3,796కు చేరింది. 24 గంటల వ్యవధిలో 62,024 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఒకరోజులో రోగం […]
సారథి న్యూస్, దేవరకద్ర: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. అందుకోసం సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తంచేశారని వెల్లడించారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టులో మత్స్య శాఖ ఆధ్వర్యంలో దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్.రాజేందర్ రెడ్డితో కలసి శనివారం 7.7లక్షల చేపపిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కోయిల్ సాగర్ తో పాటు కోయిలకొండ, రామగిరిగుట్ట, రాంకొండ ప్రాంతాలు పర్యాటక కేంద్రాల […]
‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ పథకానికి శ్రీకారం ‘అంగన్‌వాడీ పిలుస్తోంది’కి విశేష స్పందన సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలోని బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాన్న సంకల్పంతో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ పథకాన్ని సెప్టెంబర్ 1న ప్రారంభించనున్నారు. గతంలో గిరిజనులకు మాత్రమే వర్తించే ఈ పథకం ఇక నుంచి అందరికీ వర్తించనుంది. పథకంలో భాగంగా రాగిపిండి కేజీ, బెల్లం 250 గ్రాములు, చిక్కి 250 గ్రాములు, ఎండు ఖర్జూరం 250 గ్రాములు, సజ్జ లేదా […]
సారథి న్యూస్, కర్నూలు: ప్రఖ్యాత భారత హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ ను ప్రతి క్రీడాకారుడు ఆదర్శంగా తీసుకోవాలని కర్నూలు కార్పొరేషన్ కమిషనర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. శనివారం జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక అవుట్డోర్ స్టేడియం వద్ద జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అసాధారణ నైపుణ్యం, అద్భుత క్రీడాశక్తి కలిగి ఉంటే సాధారణ కుటుంబంలో జన్మించినా అత్యున్నత శిఖరాలకు సునాయాసంగా చేరుకోవచ్చని […]
100 మందికి మించకుండా సభలు, సమావేశాలు సెప్టెంబర్ 7 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో సేవలు చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు ఇళ్లకే పరిమితం కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు జారీ న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వైరస్ కారణంగా విధించిన లాన్‌డౌన్ నిబంధనలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు శనివారం అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. సెప్టెంబర్ 30 వరకు స్కూళ్లు, మాల్స్ తెరవకూడదని కేంద్రప్రభుత్వం పేర్కొంది. అలాగే పలు […]
సారథి న్యూస్, కర్నూలు: హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ గొప్పక్రీడాకారుడని, ఆయన ఎందరికో స్ఫూర్తిదాయకుడిగా నిలిచారని సెట్కూరు సీఈవో టి.నాగరాజ నాయుడు కొనియాడారు. ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని శనివారం నగరంలోని ఔట్ డోర్ మైదానంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంతకుముందు సెట్కూరు సీఈవో టి. నాగరాజ నాయుడు, చీఫ్ కోచ్ నటరాజ్ రావు, అసోసియేన్, వ్యాయామ ఉపాధ్యాయు, అధ్యాపకులు, క్రీడాభిమానులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి హాకీ క్రీడాకారుడు […]
సారథి న్యూస్, కర్నూలు: ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నగర శివారులోని వెంకాయపల్లె సమీపంలో తమకు పంపిణీ చేసిన ఇంటిస్థలాన్ని కొందరు కబ్జాచేశారని, మీరే తమకు న్యాయం చేయాలని బాధితులు స్థానిక ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ ఎదుట మొరపెట్టుకున్నారు. శనివారం ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిసి ఆవేదన వ్యక్తంచేశారు. పేదల ఇళ్లస్థలాలను కబ్జాచేసిన వారు ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదని, న్యాయం జరిగేలా చూస్తానని బాధితుకు హామీ ఇచ్చారు. గిడుగు రామ్మూర్తి ఆశయ సాధనకు కృషిగిడుగు రామ్మూర్తి […]
సారథి న్యూస్, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ, నేతలను విమర్శించే స్థాయి కరీంనగర్ మేయర్ సునీల్ రావుకు లేదని, ఆ పార్టీ బీసీసెల్ జిల్లా చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ విమర్శించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వసుపత్రుల పనితీరు మెరుగుపడాలని, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క యాత్ర చేపడితే టీఆర్ఎస్ నేతలు అర్థంలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే కరోనా ఉధృతితో […]