సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండల తీర్మాలపూర్ కు చెందిన యువ రైతు శ్రీనివాస్ అంజీర్ పంటను సాగుచేసి లాభాలను పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న తెలంగాణ వ్యవసాయ, ఉద్యానవనశాఖ రైతుకు ప్రశంసాపత్రం అందజేసింది. బుధవారం రైతు శ్రీనివాస్‌కు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రశంసాపత్రం అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ కలిగేటి కవిత, డీఏవో శ్రీధర్, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమశాఖ అధికారి శ్రీనివాస్, ఏడీఏ రామారావు పాల్గొన్నారు.
సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఖతల్ ఖాన్ చెరువు, ఊరచెరువులో బుధవారం చేపపిల్లలను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వదిలారు. అనంతరం చెత్తసేకరణ వాహనాలను ప్రారంభించారు. ఆయన వెంట పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: యూనివర్సిటీ వైస్ చాన్సలర్ల(వీసీ) నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వీసీల నియామకానికి సంబంధించి ఇప్పటికే సెర్చ్ కమిటీల నియామకం పూర్తయిందని, తుది కసరత్తు జరుగుతోందని వివరించారు. సెప్టెంబర్ 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, చర్చించాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో బుధవారం ప్రగతి భవన్ లో చర్చించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నియామకంలో జాప్యం జరిగిందన్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం […]
వరంగల్: జగిత్యాల అడిషనల్ ఎస్పీ దక్షిణమూర్తి కరోనాతో మృతిచెందారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో అత్యధిక కాలం పాటు సేవలు అందించిన పోలీస్ ఆఫీసర్‌గా గుర్తింపు ఉంది. వారం రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చనిపోయారు. మేడారం స్పెషల్ఆఫీసర్గా మంచి అనుభవం ఉంది. 1989 బ్యాచ్ ఎస్సై ద్వారా పోలీస్ శాఖలోకి వచ్చిన దక్షిణమూర్తి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పలు […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం(24 గంటల్లో) 10,830 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 3,82,469కు చేరింది. తాజాగా కోవిడ్‌నుంచి కోలుకుని 8,473 మంది డిశ్చార్జ్అయ్యారు. తాజాగా మహమ్మారి బారినపడి 81 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 3,541కు చేరింది. రాష్ట్రంలో 34,18,690 శాంపిళ్లను పరీక్షించారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 728, చిత్తూరు 913, ఈస్ట్‌గోదావరి 1,528, గుంటూరు 532, కడప 728, కృష్ణా 299, కర్నూలు […]
సారథి న్యూస్, కర్నూలు: మాతృమూర్తి మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా బుధవారం కర్నూలు నగరంలోని ప్రకాష్ నగర్ లో బీఆర్కే ఫౌండేషన్, లయన్స్‌క్లబ్ వారి ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో బీఆర్ కే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొల్లెద్దుల రామకృష్ణ, ఆనంద్ రావు, అడ్వకేట్ బొల్లెద్దుల సాయిపవన్ కాంత్, మాజీ కార్పొరేటర్ నాగన్న, సత్యం, రాజశేఖర్ పాల్గొన్నారు.
పవర్‌హౌస్ ప్రమాదంపై సీబీఐ ఎంక్వైరీ చేయించండి నిర్లక్ష్యం, అవినీతి కారణంగానే శ్రీశైలం దుర్ఘటన సీఎం కేసీఆర్‌కు రేవంత్, మల్లు రవి, వంశీకృష్ణ లేఖ సారథి న్యూస్, హైదరాబాద్: శ్రీశైలం పాతాళగంగ పవర్‌హౌస్ ఘటనపై అన్ని వేళ్లూ ప్రభుత్వం వైపే చూపిస్తున్నాయని, సీఐడీ విచారణలో విశ్వసనీయత లేదని కాంగ్రెస్ నేతలు, ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సి.వంశీకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు బుధవారం లేఖ రాశారు. నిర్లక్ష్యం, అవినీతి […]
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ చిత్రంలో హీరోయిన్ పాత్ర ఎంపిక చిత్రబృందం కసరత్తు చేస్తున్నది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ క్రేజ్ పెరిగిపోయింది. ఆయన చేసే ప్రతిసినిమాను పాన్ఇండియా లెవల్లోనే తెరకెక్కిస్తున్నారు. ‘సాహో’ దక్షిణాదిన ఆశించిన ఫలితం సాధించకపోయినప్పటికీ.. బాలీవుడ్లో భారీగా వసూళ్లు రాబట్టింది. కాగా, ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ చిత్రంలో ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ […]