Breaking News

Day: August 25, 2020

తెలంగాణ పథకాలు.. దేశానికే ఆదర్శం

సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ రాష్ట్రంలో పేదల ప్రభుత్వం కొనసాగుతున్నదని మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. మంగళవారం మెదక్​ జిల్లా నిజాంపేట, రామాయంపేట మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు టీఆర్​ఎస్​ నేతలు పాల్గొన్నారు.

Read More

సంక్షేమంలో మనమే టాప్​

సారథి న్యూస్​, దేవరకద్ర: పేద ప్రజలకు సంక్షేమపథకాలను అమలుచేయడంలో తెలంగాణ రాష్ట్రం.. దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన కొత్తకోటలో గ్రీన్​ ఆగ్రో స్టోర్​ను ప్రారంభించారు. అనంతరం భూత్పూరు మండలం అన్నసాగర్​, మూసాపేట మండలకేంద్రంలో పలువరు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్​ఫండ్​ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు టీఆర్​ఎస్​ నాయకులు పాల్గొన్నారు.

Read More

బెల్ట్​షాపులను నియంత్రిద్దాం

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలో బెల్ట్​షాపులు విచ్చల విడిగా నడుస్తున్నాయని ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు పేర్కొన్నారు. వీటి నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహిస్తున్న బెల్ట్​షాప్​లపై ఎక్సైజ్​ అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. మంగళవారం నిజాంపేట మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సిద్ధరాములు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కరోనా సహా పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో డీ ధర్మారం పీహెచ్ సీ డాక్టర్ ఎలిజిబెత్ రాణి మాట్లాడుతూ.. […]

Read More

బసంత్​నగర్​లో ఎయిర్​పోర్ట్​

సారథి న్యూస్​, రామగుండం: బసంత్​నగర్​లో ఎయిర్ట్​పోర్టు నిర్మాణం పూర్తయితే.. రామగుండం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. రామగుండం ప్రాంతంలో టీఆర్​ఎస్​ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. మంగళవారం ఆయన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని బసంత్​నగర్​లో ఎయిర్​పోర్ట్​ నిర్మించబోయే స్థలాన్ని పరిశీలించారు. రాష్ట్రంలో ఆరుచోట్ల ఎయిర్​పోర్టులను నిర్మిస్తున్నారని అందులో బసంత్​నగర్​ ఒకటని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ వాల్వ అనసూయ, సర్పంచ్ కొల లత, ఎంపీటీసీ దుర్గం […]

Read More
విద్యకు ఆన్ లైన్.. లైఫ్ లైన్

విద్యకు ఆన్ లైన్.. లైఫ్ లైన్

సారథి న్యూస్, హైదరాబాద్: ప్రస్తుతం కోవిడ్ సంక్షోభ సమయంలో ఆన్​లైన్ ​విద్య లైఫ్ లైన్ గా మారిందని గవర్నర్ డాక్టర్ ​తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. కరోనా విద్యాభ్యాసాన్ని ఆటంక పరిచినప్పటికీ, ఆన్ లైన్ పద్ధతులు, టెక్నాలజీతో చదువును కొనసాగించవచ్చని అన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వరంగల్ ఆధ్వర్యంలో ‘ఆన్ లైన్ విద్యావకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై గవర్నర్ మంగళవారం ప్రారంభోపన్యాసం చేశారు. టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలు అట్టడుగు వర్గాలకు చేరాలన్నారు. ఆన్ లైన్ విద్యతో […]

Read More
ఎమ్మెల్యే కోరుకంటి పల్లెనిద్ర

ఎమ్మెల్యే కోరుకంటి పల్లెనిద్ర

సారథి న్యూస్, రామగుండం: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లిలో మంగళవారం రాత్రి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పల్లెనిద్ర చేపట్టారు. అక్కడే బసచేసి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యాప్తిచెందుతున్న వేళ ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని స్థానికులను కోరారు.

Read More
సింగరేణిలో కరోనా కలకలం

సింగరేణిలో కరోనా కలకలం

సారథి న్యూస్, రామగుండం: సింగరేణి ఉద్యోగులు ఎక్కువగా నివసించే పెద్దపల్లి జిల్లా రామగుండంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కొంతమంది కరోనా పేషేంట్లు విచ్చలవిడిగా జనాల మధ్య తిరుగుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సింగరేణి యాజమాన్యం పాజిటివ్​ వచ్చినవారి వివరాలు వెల్లడించకపోవడంతో వారు యథేచ్ఛగా తిరుగుతున్నారని స్థానికులు వాపోతున్నారు. కరోనా పాజిటివ్​ వచ్చినవారు క్వారంటైన్​లో ఉండేలా సింగరేణి యాజమాన్యం, వైద్యులు చొరవ తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Read More
పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే భూములు వెనక్కి

పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే భూములు వెనక్కి

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు భూములను తీసుకుని నిరుపయోగంగా ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలని మంత్రి కె.తారక రామారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశంతో రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొస్తున్నామని వెల్లడించారు. కంపెనీలు కూడా ఇచ్చిన హామీల మేరకు కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. ఈ మేరకు నిర్ణీత గడువులోగా కార్యకలాపాలు ప్రారంభించని వారికి షోకాజ్ నోటీసులు జారీచేయాలని […]

Read More