ఢిల్లీ: ఏపీ రాజధాని అంశంపై కేంద్రం మరోసారి స్పష్టత నిచ్చింది. రాజధాని విషయంలో తాము జోక్యం చేసుకొనే ప్రసక్తే లేదని.. అది కేంద్రం పరిధిలోకి రాదని తేల్చిచెప్పింది. రాజధాని ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని పేర్కొన్నది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దుపై ఏపీ హైకోర్టులో కేంద్రం మరోసారి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చట్టం రద్దు నిర్ణయాల నేపథ్యంలో దోనే సాంబశివరావు అనే […]
సారథిన్యూస్, హైదరాబాద్: కరోనా మహమ్మారిని తగ్గించేందుకు రెమిడిసివిర్, ఫావిపిరవర్ మందులు కొంతమేర ప్రభావవంతంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ఔషధకంపెనీలు ఈ మందులను మార్కెట్లో విక్రయిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఔషధకంపెనీ రెడ్డీ ల్యాబ్స్కరోనా టాబ్లెట్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. అవిగాన్ బ్రాండ్ పేరుతో ఫావిపిరవిర్ 200 ఎంజీ టాబ్లెట్లను విడుదల చేస్తున్నట్లు బుధవారం డాక్టర్ రెడ్డీస్ బ్రాండెడ్ మార్కెట్స్ సీఈవో ఎంవీ రమణ తెలిపారు. వ్యాధి తీవ్రంగా లేనివారికి ఈ మందు మెరుగ్గా […]
ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ కురువృద్ధుడు ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత విషమించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రణబ్ ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉన్నదని.. ఆయన ప్రస్తుతం ఉపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స కొనసాగిస్తున్నట్టు తెలిపాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణుల బృందం నిశితంగా పరిశీలిస్తుందని వెల్లడించారు. ఈ నెల 10న ప్రణబ్‌ముఖర్జీ అత్యవసర చికిత్స కోసం ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో […]
ఇంటర్‌నెట్ డెస్క్: టీమ్‌ఇండియా పరుగులు వీరుడు రోహిత్‌శర్మ మరో ఘనత సాధించాడు. ప్రతిష్ఠాత్మక రాజీవ్ ఖేల్‌రత్న పురస్కారానికి ఎంపికైన నాలుగో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, హాకీ దిగ్గజం సర్ధార్ సింగ్‌తో కూడిన 12 మంది సభ్యుల బృందం హిట్‌మ్యాన్ సహా మరో ముగ్గురి పేర్లను ఖేల్‌రత్నకు ప్రతిపాదించింది. రెజ్లర్ వినీశ్ ఫొగాట్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బాత్రా, దివ్యాంగ హైజంపర్ మరియప్పన్ తంగవేలు పేర్లను కమిటీ ప్రభుత్వానికి సిఫార్సుచేసింది. కమిటీ […]
సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 1,763 కొత్తకేసులు నమోదయ్యాయి. కాగా ఇప్పటివరకు 95,700 మంది కరోనా బారిన పడ్డారు. మంగళవారం ఒక్కరోజే 8 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాబారిన పడి 719 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే 1789 మంది కోలుకోగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 73,991కి చేరుకున్నది. రాష్ట్రంలో 20,990 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. 7,97,470 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు […]
ప్రకృతి మనకు ఎంతో ఇచ్చింది.. ప్రతీది అపురూపంగానే కనిపిస్తోంది.. ప్రతి దృశ్యం ఆహ్లాదం కలిగిస్తుంది.. తియ్యటి జ్ఞాపకాలు.. మరిచిపోలేని అనుభూతులు.. మధుర ఘట్టాలు.. గొప్ప సన్నివేశాలు.. వెలకట్టలేని దృశ్యాలను పదికాలాల పాటు మన కళ్లముందు పదిలంగా ఉంచేదే ఫొటో. ఫొటోగ్రఫీ అనేది సృజనాత్మక కళ. వంద మాటల్లో చెప్పలేనిది ఒక్కఫొటోతో చెప్పొచ్చు. మనసు దోచే రమణీయ దృశ్యాలు.. ఆలోచింపజేసే రూపాల సమాహారమే ఫొటోగ్రఫీ. ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆకట్టుకునే చిత్రాలు కొన్ని మీ […]
సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): సరుకుల కోసం పుట్టిలో కృష్ణానదిని దాటుతూ గల్లంతైన నలుగురు మహిళల్లో ఇద్దరి డెడ్బాడీస్మంగళవారం దొరికాయి. కర్ణాటకలోని రాయిచూర్జిల్లా యాపలదిన్నె మండలం కుర్వపురం గ్రామం నుంచి నిత్యం సరుకుల కోసం తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పంచదేవ్ పహాడ్ గ్రామానికి పుట్టిల్లో వస్తుంటారు. ఎప్పటిలాగే వారు ఆదివారం వచ్చారు. ఈ సమయంలో కృష్ణానదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో పుట్టిలో ఉన్న 14మందిలో నలుగురు మహిళలు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి డెడ్బాడీస్జూరాల […]
కర్నూలు: ఆన్‌లైన్ క్లాసెస్ వింటున్న విద్యార్థినులు ఉన్నట్టుండి ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఓ స్కూలుకు సంబంధించిన బాలికల వాట్సప్ గ్రూపులో అశ్లీల వీడియో ప్రత్యక్షమవడంతో కంగుతిన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ బాలికల హైస్కూలు విద్యార్థినులకు ఆన్‌లైన్ తరగతుల కోసం ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటుచేశారు. 8వ తరగతి విద్యార్థినులకు చెందిన ఆ గ్రూపులో ఇటీవల గుర్తుతెలియని ఓ వ్యక్తి అశ్లీల వీడియోను పోస్టుచేశాడు. ఆ గ్రూపులో ఆ వీడియో రెండు రోజుల పాటు అలాగే ఉంది. […]