Breaking News

Day: August 15, 2020

ఆఫీసుల్లో కాగిత రహిత సేవలు

ఆఫీసుల్లో కాగిత రహిత సేవలు

సారథి న్యూస్, మెదక్: మెదక్ ​జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాయాలను కాగిత రహిత(ఈ ఆఫీస్​) ఆఫీసులుగా మార్చాలని జిల్లా అడిషనల్ ​కలెక్టర్ నగేష్ ​సూచించారు. శనివారం కలెక్టరేట్ లో ఈఆఫీస్​ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని పనులకు పేపర్లను వినియోగిస్తున్నామని చెప్పారు. మెదక్ ​కలెక్టరేట్​ను ఈఆఫీస్ గా మార్చామన్నారు. ఈసేవ, మీ సేవ తరహాలోనే వీటిని నిర్వహించాలన్నారు. అధికారులు సంతకాలను సైతం డిజిటల్ సిగ్నేచర్ ​కీ (డీఎస్​కీ) తయారు చేయించాలని, ఏదైనా […]

Read More
మహనీయుల త్యాగాలు మరువలేనివి

మహనీయుల త్యాగాలు మరువలేనివి

సారథి న్యూస్, కర్నూలు: దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయుల స్ఫూర్తితో ముందుకెళ్లాలని కర్నూలు నగర పాలకసంస్థ కమిషనర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక నగర పాలకసంస్థ ఆఫీసులో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. మొదట సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన కమిషనర్ బాలాజీ అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి సెల్యూట్ చేశారు. క్విట్ ఇండియా పోరాటం తరహాలో నేడు ప్రస్తుత కరోనా విపత్తు సమయంలోనూ పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు […]

Read More
కోవిడ్​ వారియర్స్​కు సన్మానం

కోవిడ్​ వారియర్స్​కు సన్మానం

సారథి న్యూస్, కర్నూలు: దేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కర్నూలు మెడికల్ ​కాలేజీలో ఘనంగా నిర్వహించారు. కోవిడ్ విపత్తు సమయంలో డాక్టర్లు మరియు స్టాఫ్ నర్సు, పారామెడికల్ సిబ్బంది చేస్తున్న సేవలకు కొనియాడారు. డాక్టర్​శైలజ, డాక్టర్ ​సురేఖ, డాక్టర్ ​లక్ష్మీబాయి, డాక్టర్​ ఇందిర, డాక్టర్ ​రంగనాథ్, డాక్టర్​ రోజారాణి సన్మానించారు. కార్యక్రమంలో మెడికల్ ​కాలేజీ ప్రిన్సిపల్ ​డాక్టర్​ పి.చంద్రశేఖర్, ఆస్పత్రి సూపరింటెండెంట్, డాక్టర్​నరేంద్రనాథ్ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ​భగవాన్, మెడికల్​కాలేజీ వైస్ ప్రిన్సిపల్​డాక్టర్​చంద్రశేఖర్ రెడ్డి, […]

Read More
కోయిల్ సాగర్​లో 31 ఫీట్ల నీటిమట్టం

కోయిల్ సాగర్​లో 31 ఫీట్ల నీటిమట్టం

సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్​నగర్ జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు కోయిల్ సాగర్ కు శనివారం పెద్దఎత్తున వరద నీరు వచ్చిచేరింది. ప్రాజెక్టు మొత్తం నీటినిల్వ సామర్థ్యం 32.5 ఫీట్లు. అయితే ప్రాజెక్టులో 31 ఫీట్లకు నీటి నిల్వ చేరింది. దీంతో ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. జూరాల నుంచి కోయిల్ సాగర్ కు ఒక మోటారు ద్వారా కృష్ణాజలాలను తరలిస్తున్నారు. అలాగే ఎగువ ప్రాంతాల్లో భారీవర్షాలు కురవడంతో కోయిలకొండ, అంకిళ్ల వాగుల నుంచి పెద్దఎత్తున వర్షపునీరు ప్రాజెక్టులోకి […]

Read More
లిక్కర్ ఫ్యాక్టరీలో మంటలు

ఏబీడీ లిక్కర్ ఫ్యాక్టరీలో మంటలు

వనపర్తి: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం గ్రామ సమీపంలో ఉన్న ఏబీడీ లిక్కర్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో ఉన్న బాయిలర్ ఉన్న చోట పైపులు పగిలిపోవడంతో మంటలు చెలరేగి మంటలు అంటుకున్నాయి. సమీపంలో ఉన్న ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు. మిగతా నలుగురిని వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

Read More
ఊరూరా జెండా పండుగ

ఊరురా జెండా పండుగ

సారథి న్యూస్​, నెట్​వర్క్​: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 74వ స్వాతంత్ర్య వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో కేవలం కొద్దిమంది అతిథులు మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పరిమిత సంఖ్యలో అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రమే వేడుకలకు హాజరయ్యారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో స్వేరోస్​ ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలు జరుపుకున్నినారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో పోలీస్ కమిషనరేట్​లో కమిషనర్​ వి.సత్యనారాయణ జెండాను ఎగురవేశారు. కరీంనగర్​ జిల్లా రామడుగు గ్రామ పంచాయతీలో సర్పంచ్ పంజాల […]

Read More
డ్యూటీలో చేరిన కల్నల్​సంతోష్ బాబు సతీమణి

డ్యూటీలో చేరిన కల్నల్​ సంతోష్ బాబు సతీమణి

సారథి న్యూస్, హైదరాబాద్: ఇండో- చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో చైనా సైనికుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్​ సంతోష్​బాబు సతీమణి సంతోషి రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. శనివారం ఆమె బీఆర్ కే భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​ను కలిసి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. సంతోషికి రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ గా పోస్టింగ్ ఇస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కొన్నిరోజుల క్రితమే ఆమెకు నియామక పత్రాన్ని […]

Read More
క్రికెట్​కు రైనా గుడ్‌బై

క్రికెట్​కు రైనా గుడ్‌ బై

ఢిల్లీ: టీమిండియా స్టార్​ క్రికెటర్‌ సురేశ్‌ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ ప్రకటించిన కాసేపటికే రైనా కూడా రిటైర్మెంట్‌ ప్రకటించడం గమనార్హం.

Read More