Breaking News

Day: August 11, 2020

దేశంలో వైద్యసదుపాయాలు పెరగాలి

వైద్యసదుపాయాలు మెరుగుపడాలె

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, దేశంలో వైద్య సదుపాయాలను పెంచే విషయంపై దృష్టిపెట్టాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులతో మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనాపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కరోనా పరిస్థితిని వివరించారు. దేశంలో వైద్య సదుపాయాలను పెంచాలని గుర్తుచేశారు.కరోనా […]

Read More
మొహర్రంపై మంత్రుల సమీక్ష

మొహర్రంపై మంత్రుల సమీక్ష

సారథి న్యూస్, హైదరాబాద్: ఈ నెలాఖరులో వస్తున్న మొహర్రంపై వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్రహోంశాఖ మంత్రి మహమూద్ అలీ డీఎస్ఎస్ భవన్ లోని సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. కరోనా మహమ్మారి తీవ్రత నేపథ్యంలో కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పండగ జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యే అహ్మద్ బాషాఖాద్రి, మైనారిటీ శాఖ సలహాదారు ఏకే ఖాన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ […]

Read More
అలంపూర్​లో సీసీ కెమెరాలు ఏర్పాటు

అలంపూర్​లో సీసీ కెమెరాల ఏర్పాటు

సారథి న్యూస్​, అలంపూర్​: నేరాలను అరికట్టేందుకు పటిష్ఠమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్​ రతన్​ కుమార్​ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ‘నేనుసైతం’ కార్యక్రమంలో భాగంగా అలంపూర్​ చౌరస్తాలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు నారాయణ గౌడ్ ఆర్థికసాయం చేశారని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ కృష్ణ, డీఎస్పీ యాదగిరి, సీఐ వెంకట్రామయ్య, ఎస్సై మధుసూదన రెడ్డి, ఏఎస్సై అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.

Read More
గణేశ్​ మండపాలకు అనుమతి లేదు

గణేశ్​ మండపాలకు నో పర్మిషన్​

సారథి న్యూస్​, నల్లగొండ: ప్రస్తుత పరిస్థితుల్లో గణేశ్​ మండపాలు, నవరాత్రి ఉత్సవాలకు అనుమతి ఇవ్వలేమని నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్​ స్పష్టం చేశారు. కరోనా విపత్తువేళ హిందూ సోదరులంతా పోలీస్​శాఖకు సహకరించాలని ఆయన కోరారు. గణేశ్​ మండపాల నిర్వాహకులకు త్వరలోనే కౌన్సెలింగ్​​ నిర్వహిస్తామన్నారు. ప్రజలంతా ఇండ్లల్లోనే పూజలు చేసుకోవాలని కోరారు. తయారీదారులు విగ్రహాలను తయారు చేసి ఇబ్బందులు తెచ్చుకోవద్దని.. కరోనా పోయేంత వరకు ఇతర ఉపాధి మార్గాలను వెతుక్కోవాలని సూచించారు.

Read More
మత్స్యకారులను ఆదుకుంటాం

మత్స్యకారులను ఆదుకుంటాం

సారథి న్యూస్, రామాయంపేట: మత్స్యకారులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఎంతో కృషిచేస్తోందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మెదక్​ జిల్లా రామాపంపేట మండలం డీ. ధర్మారంలోని ఊరచెరువులో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద 1.76కోట్ల చేపపిల్లలను వదిలారు. మత్స్యకారులు దళారులను నమ్మకుండా చేపలను సొంతంగా మార్కెటింగ్​ చేసుకునేలా అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం గ్రామంలో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనంతో పాటు డంప్​యార్డు, వైకుంఠధామాలను […]

Read More
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం విషమం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం విషమం

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్​ నేత ప్రణబ్‌ ముఖర్జీ(84) ఆరోగ్యం విషమంగా మారింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నట్లు ఏఎన్ఐ తెలిపింది. ఢిల్లీలోని ఆర్మీకి చెందిన రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్‌లో ప్రస్తుతం ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. ఆయన మెదడులో రక్తం గడ్డకట్టడంతో శస్త్రచికిత్స చేశారని వార్తాసంస్థలు వెల్లడించాయి. తనకు కరోనా సోకిందని ప్రణబ్ ముఖర్జీ సోమవారం ట్వీట్ చేశారు. వేరే చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లినప్పుడు అక్కడ కోవిడ్ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, […]

Read More
కరోనాను జయించేందుకు తొలి అడుగు

కరోనాను జయించేందుకు తొలి అడుగు

సారథి న్యూస్, హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను జయించడంలో ఓ అడుగు ముందుకుపడినట్టే.. ప్రపంచమంతా ఎదురుచూస్తున్న వ్యాక్సిన్​అందుబాటులోకి రానుంది. రష్యా ముందుగా ప్రకటించిన విధంగానే ఆగస్టు 12న కరోనా టీకా విడుదలచేస్తున్నట్టు ప్రకటించింది. గ్వామ్‌ కోవిడ్‌ వ్యాక్‌ లయో పేరుతో తయారుచేసిన టీకాను విడుదల చేస్తున్నట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ కూడా ప్రకటించింది. దేశంలో అందరికీ ఈ టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయని, ఈ వారంలోనే అది పూర్తవుతుందని పేర్కొంది. రష్యాలోని గమలేయా రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్, ఆ […]

Read More

గోకులకృష్ణ గోపాలకృష్ణ

పిల్లనగ్రోవిని చేతబట్టారు.. వెన్న ముద్దలను దొంగిలించారు. చిన్నారి సత్యభామలను ఆటపట్టించారు. ముద్దు వేషధారణ, ముచ్చటగొలిపే మాటలతో చిన్నికృష్ణులు సందడి చేశారు. గోకులంలో ఆడిపాడారు. మంగళవారం శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా పలువురు చిన్నారులు రాధాశ్రీకృష్ణుల వేషధారణలో ఒదిగిపోయారు.– సారథి న్యూస్​టీం

Read More