వాషింగ్టన్: హెచ్ – 1 బీ వీసాదారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. అమెరికాలో రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న నిరుద్యోగానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకున్నారు. దీంట్లో భాగంగానే ఫెడరల్ ఏజెన్సీలు ఫారెన్ వర్కర్స్‌ను నియమించకుండా నిరోధించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ఆయన సంతకం చేశారు. దీని ద్వారా ముఖ్యంగా హెచ్–1బీ వీసాలో ఉన్న వారిని కంపెనీ నియమించకోకూడదు. దీంతో యూఎస్ జాబ్ మార్కెట్‌పై ఆశలు పెట్టుకున్న మన ఐటీ నిపుణులకు పెద్దదెబ్బ కానుంది. […]
అయోధ్య: దేశంలోని హిందువులంతా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం నిర్మాణం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. దీంతో అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సిటీలోని ఆలయాను, సరయూ నదీతీరాన్ని అందంగా తీర్చిదిద్దారు. ప్రధాని మోడీ అయోధ్యలో దాదాపు 3 గంటల పాటు గడపనున్నారు. బుధవారం ఉదయం స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీ నుంచి లక్నో చేరుకుంటారు. అక్కడ నుంచి స్పెషల్ చాపర్‌లో అయోధ్యకు వెళ్తారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సరయూ నది తీరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన […]
ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైని వానలు ముంచెత్తాయి. 10 గంటల్లోనే 23 సెం.మీ వర్షపాతం నమోదైంది. ముంబై, థానే, రాయ్‌గడ్, రత్నగిరి తదితర ప్రాంతాల్లో మోక్కాళ్ల లోతు వరకు నీరు వచ్చి చేరింది. దీంతో ముంబలో అధికారులు రెడ్ అలర్డ్ ప్రకటించారు. మరో రెండు రోజుల పాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్ర తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. వర్షాలకు చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. నగరంలోని చాలా ప్రాంతాలకు బస్సులు, […]
న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరం భూమి పూజ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. రాముడు అందరివాడని ఆమె పేర్కొన్నారు. అయోధ్యలో జరిగే ఈ కార్యక్రమంతో దేశమంతా ఒకటవుతుందని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. ‘రాముడు అనే పదానికి అర్థం సరళత, ధైర్యం, నిగ్రహం, త్యాగం, నిబద్ధత, దీనబంధుడు. రాముడో అందరితో ఉన్నాడు. రాముడు, సీతాదేవి సందేశంతో, రామ్లాల ఆలయ భూమి పూజ సమాజంలో ఐక్యత, సోదరభావం కలగజేయాలని కోరుకుంటున్నాను’ అని ప్రియాంకగాంధీ ట్వీట్ చేశారు. అయోధ్యలో […]
ముంబై: అయోధ్యలో రామమందిరం నిర్మాణం శుభపరిణామమని శివసేన అభిప్రాయపడింది. ప్రధాని చేతుల మీదుగా బుధవారం భూమిపూజ చేయాల్సిన మంచి క్షణం మరొకటి లేదని, శ్రీరాముని దయ వల్ల కరోనా కనుమరుగు అవుతోందని చెప్పింది. రామమందిర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే. అద్వానీ, మురళీ మనోహర్ జోషీ వయోభారం వల్ల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారని చెప్పింది. అయోధ్యలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారని, హోం మంత్రిత్వ శాఖ దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తోందని […]
సారథి న్యూస్, వరంగల్: తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం (ఆగస్టు 5న) ఎలాంటి వేడుకలు, ఉత్సవాలు చేయవద్దని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కార్యకర్తలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వీలైతే ఎవరి ఇండ్ల వద్ద వారు మొక్కలు నాటాలని సూచించారు. భారీగా గుమిగూడడం, కేక్‌కట్ చేయడం లాంటి కార్యక్రమాలను చేపట్టవద్దని కోరారు.
సారథి న్యూస్, నిజాంపేట: ప్రజలకు కొంతకాలం నీళ్ల కష్టాలు తప్పవని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సింగూర్ జలాశయానికి నీళ్లు వస్తే ప్రజలకు నీళ్లకష్టాలు పోతాయని చెప్పారు. మంగళవారం ఆమె మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఆడబిడ్డలకు నీటికష్టాలు ఉండరాదని సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ప్రాజెక్టును ప్రారంభించారని చెప్పారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ సిద్దరాములు, జెడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్, తహసీల్దార్ […]
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగులో మంగళవారం రామాంజనేయ ఆటో యూనియన్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కుమార్, ఉపాధ్యక్షుడిగా చందా అనిల్, ప్రధానకార్యదర్శిగా ఉత్తెం దేవరాజ్, సహాయకార్యదర్శిగా అనంతరెడ్డి, కోశాధికారిగా మామిడి శ్రీను, రైటర్‌గా మల్లేశం, కార్యవర్గ సభ్యులుగా మల్లేశం, రాగం కనకయ్య, ములుగురి రాజు, మామిడి రాజు, ముఖ్య సలహాదారులుగా పంజాల శ్రీను, కర్ణ శ్రీను తదితరులు ఎన్నికయ్యారు.