Breaking News

Day: August 2, 2020

రైతన్నలు జర పైలం

రైతన్నలూ.. జరభద్రం

సారథిన్యూస్​, రామాయంపేట: పంటలకు చీడపీడలు ఆశించకుండా రైతన్నలు క్రిమిసంహారక మందులు పిచికారి చేయడం సహజమే. అయితే ఈ సమయంలో అన్నదాతలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయశాఖ నిపుణులు సూచిస్తున్నారు. పురుగుమందులు మనిషి శరీరాన్ని తాకినా పొరపాటున శరీరంలోకి వెళ్లినా ఎంతో ప్రమాదం. వ్యవసాయ అధికారుల సూచన మేరకు వారు చెప్పిన మోతాదులోనే క్రిమిసంహారక మందులు పిచికారి చేయాలి. పంట మొక్కల స్థాయిని బట్టి స్ప్రే డబ్బాలను ఉపయోగించాలి. పత్తి పంటలో హ్యాండ్​ పంపుకు బదులు తైవాన్​, పవర్​ […]

Read More
తెలంగాణలో రైతే రాజు

తెలంగాణలో రైతేరాజు

సారథి న్యూస్​, ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రైతులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం నగరం ఏడో డివిజన్​ అల్లిపురంలో రైతు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంటే విపక్ష నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మేయర్ […]

Read More
ఏపీ డిప్యూటీ స్పీకర్‌కు కరోనా

ఏపీ డిప్యూటీ స్పీకర్‌కు కరోనా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బారిన ప్రముఖులు, రాజకీయ నాయకులు పడుతున్నారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్​కోన రఘుపతికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కోన రఘువతి తెలిపారు.

Read More
చేవెళ్లలో గుట్కా సీజ్​

భారీగా గుట్కా ప్యాకెట్లు సీజ్​

సారథిన్యూస్​, చేవెళ్ల: అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను టాస్క్​ఫోర్స్​ పోలీసులు సీజ్​ చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్​స్టేషన్​ పరిధిలోని బీబీగూడెం వద్ద టాస్క్​ఫోర్స్​ పోలీసులు తనిఖీలు చేపట్టగా సుమారు రూ. 2 లక్షల 45 వేల విలువైన గుట్కాప్యాకెట్లు పట్టుబడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులు గుట్కా ప్యాకెట్లను హైదరాబాద్​ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీబీగూడెనికి తీసుకెళ్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకొని కారును సీజ్​ చేసినట్టు […]

Read More
మెతుకుసీమలో కరోనా హైరానా

మెతుకుసీమలో కరోనా హైరానా

మెదక్ ​జిల్లాలో అన్ని మండలాలకు వ్యాప్తి ప్రజల్లో తీవ్ర భయాందోళన 272 మందికి పాజిటివ్ ఇప్పటికే 12 మంది మృతి సారథి న్యూస్, మెదక్: మెతుకు సీమను కరోనా వణికిస్తోంది.. మెదక్ జిల్లాలో వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. గత జూన్ లో జిల్లాలోని కొన్ని పట్టణాల్లో మాత్రమే కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, జూలై నెలలో క్రమంగా జిల్లాలోని అన్ని మండలాలకు వ్యాపించాయి. పాజిటివ్ కేసుల సంఖ్య వందకు చేరడం, మరణాల సంఖ్య పది దాటడంతో […]

Read More
రాజధాని మార్పు అప్రజాస్వామికం

ప్రభుత్వ నిర్ణయంపై పవన్​ ఫైర్​

సారథిన్యూస్​, అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో రాజధాని వికేంద్రీకరణకు ప్రజామోదం లేదని జనసేన అధ్యక్షుడు పవన్​కల్యాణ్​ విమర్శించారు. సీఎం జగన్​ ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా సొంతంగా ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ఆదివారం జనసేన పొలిటికల్​ అఫైర్స్​ కమిటీ ప్రతినిధులతో పవన్​ కల్యాణ్​ టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. అమరావతిలో అవినీతి జరిగితే విచారణ జరిపి దోషులను శిక్షించాలి. అంతే కానీ రాజధానిని మార్చడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారగానే రాజధానులు […]

Read More
తమిళనాడు గవర్నర్​కు కరోనా

తమిళనాడు గవర్నర్‌కు కరోనా

చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్‌ విలయ తాండవం చేస్తున్నది. తాజాగా ఆ రాష్ట్ర గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌కు కరోనా సోకింది. దీంతో ఆయన చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం గవర్నర్‌ భన్వరిలాల్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇటీవల గవర్నర్​ను కలిసిన వారంతా హోం క్వారంటైన్​కు వెళ్లారు.

Read More
కరోనాను జయించిన బిగ్​బీ

కరోనాను జయించిన బిగ్​బీ

ముంబై: కరోనా మహమ్మారి నుంచి ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కోలుకున్నారు. ఇటీవల చేసిన కరోనా పరీక్షల్లో బిగ్‌బీ అమితాబ్‌కు కరోనా నెగిటివ్‌ వచ్చింది. దీంతో ఆయన జులై 11న ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి కుదుటపడడంతో ఆదివారం డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు అమితాబ్ కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. కానీ అభిషేక్‌ మాత్రం ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు.

Read More