Breaking News

Month: July 2020

పంజాబ్​ మంత్రికి కరోనా

చంఢీగర్​: కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తున్నది. రాజకీయ, సినీప్రముఖులను వదలడం లేదు. ఎవరైతే నాకేంటి అన్నట్టుగా వైరస్​ విజృంభిస్తున్నది. తాజగా పంజాబ్​ మంత్రి రాజిందర్​ సింగ్​ బజ్వాకు కరోనా పాజిటివ్​గా నిర్ధరాణ అయ్యింది. ఆయన కార్యాలయంలోని కొందరికి కరోనా రావడంతో శనివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు కరోనా నెగిటివ్​గా వచ్చింది. అయినప్పటికి ఆయనకు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో మంగళవారం మరోసారి కరోనా పరీక్షచేయగా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. మంత్రికి పాజిటివ్​ రావడంతో ఆయన కుటుంబసభ్యుల […]

Read More

9 లక్షలు దాటిన కరోనా కేసులు

ఢిల్లీ: భారత్​లో కరోనా కేసులో సంఖ్య భయంకర స్థాయిలో పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లో 29,429 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 9,36,181 కి చేరింది. ఈ కాగా ఒకే రోజు ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు కరోనాతో 24,309 మంది మృత్యువాత పడ్డారు. 5,92,031 మంది కోలుకున్నారు. వివిధ ఆసుపత్రుల్లో 3,19,840 మంది చికిత్స పొందుతున్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని.. వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చేవరకు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Read More

రాష్ట్రంలో టీఆర్​ఎస్​కు తిరుగులేదు

సారథిన్యూస్​, రామగుండం: రాష్ట్రంలో టీఆర్ఎస్​ పార్టీకి తిరుగులేదని.. కేసీఆర్​ నాయకత్వానికి ప్రజలు మద్దతిస్తున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. ఎన్నికలేవైనా టీఆర్​ఎస్​ విజయం సాధించి తీరుతుందని చెప్పారు. మంగళవారం ఆయన రామగుండం కార్పొరేషన్​ పరిధిలోని 50 డివిజన్లకు ఇంచార్జిలను నియమించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన ఇంచార్జ్​లు పార్టీని మరింత బలోపేతం చేయాలని.. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.

Read More

కిన్నెరసానికి భారీ వరద

సారథిన్యూస్​, పాల్వంచ: కిన్నెరసాని రిజర్వాయర్​లోకి భారీగా వరదనీరు వస్తున్నదని కేటీపీఎస్​ 5,6 దశల సీఈ రవీంద్రకుమార్​ తెలిపారు. మంగళవారం రాత్రి గేట్లు ఎత్తి ఐదువేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తామని చెప్పారు. కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గేట్లు తెరిచిన సమయంలో కిన్నెరసాని వాగులో ఎలాంటి రాకపోకలు చేయవద్దని హెచ్చరించారు. కిన్నెరసాని రిజర్వాయర్​ పూర్తిస్థాయి నీటిమట్టం 8.4 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.495 టీఎంసీల నీరు ఉన్నది. 10 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో […]

Read More

మొక్కలు నాటడం మన బాధ్యత

సారథిన్యూస్​, ఖమ్మం: మొక్కలు నాటడం మనందరి బాధ్యత అని ఖమ్మం పోలీస్​ కమిషనర్​ తఫ్సీర్​ ఇక్బాల్​ పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో కమిషనర్​ క్యాంప్​ కార్యలయంలో ఇక్చాల్​ కుటుంబసభ్యలు ఆరో విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్​ మాట్లాడుతూ.. మొక్కలు నాటడమే కాక వాటిని బతికించుకోవడం ఎంతో ముఖ్యమని చెప్పారు. కార్యక్రమంలో తఫ్సీర్ ఇక్బాల్ తనయుడు తైముర్ ఇక్బాల్ , కమిషనర్ సతీమణి జెబాఖానమ్ పోలీస్​ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

దైవదర్శనం విషాదాంతం

సారథిన్యూస్​, ములుగు: సమ్మక్క, సారలమ్మ దర్శనం కోసం వచ్చిన ఓ వ్యక్తి జంపన్నవాగులో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్​ సమీపంలోని ఘట్​కేసర్​ పరిధిలోని శివారెడ్డి గూడకు చెందని సుదర్శన్​రెడ్డి (50) స్నేహితులతో కలిసి అమ్మవార్లను దర్శించుకొనేందుకు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి వచ్చారు. దైవదర్శనానికి ముందు జంపన్నవాగులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయిన ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read More

రామడుగులో కరోనా కలకలం

సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని వెదిర గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. దీంతో రామడుగు మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెదిర గ్రామంలో మంగళవారం శానిటైజేషన్​ నిర్వహించారు. గ్రామంలోని విధులను శుభ్రపరిచారు. ప్రజలంతా సామాజికదూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు.

Read More
జూరాల 6 గేట్ల ఎత్తివేత

జూరాల 6 గేట్ల ఎత్తివేత

సారథి న్యూస్, జూరాల: జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ఆరుగేట్లను బుధవారం ఎత్తి 34,320 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 60వేల క్యూసెక్కుల వరద వచ్చిచేరుతోంది. ఎగువ, దిగువ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుత్​కోసం 21,240 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. జూరాల నుంచి మొత్తంగా 59,380 క్యూసెక్కులను శ్రీశైలానికి వదులుతున్నారు. దీంతో కృష్ణమ్మ పరుగులు తీస్తోంది.

Read More