Breaking News

Month: July 2020

సీబీఎస్‌ఈ టెన్త్​ ఫలితాలు విడుదల

న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ పదోతరగతి రిజల్ట్స్‌ విడుదలయ్యాయి. బుధవారం ఉదయం ఫలితాలను వెబ్‌సైట్‌లో ఉంచారు. ఉమాంగ్‌ యాప్‌, టోల్‌ఫ్రీ నంబర్‌‌ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చని అధికారులు చెప్పారు. ఈ ఏడాది 91.46 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు అధికారులు వెల్లడించారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఉత్తీర్ణతశాతం పెరిగింది. దాదాపు 41,804 మంది విద్యార్థులు 95 శాతం మార్కులు స్కోర్‌‌ చేశారు. సీబీఎస్‌ఈ ఇప్పటికే పన్నెండోతరగతి ఫలితాలు విడుదల చేసింది. కరోనా కారణంగా టెన్త్‌, పన్నెండోతరగతి పరీక్షలను […]

Read More

బీజేపీవి శవరాజకీయాలు

కోల్‌కతా: బీజేపీ ఎమ్మెల్యే ఆత్మహత్యను ఆ పార్టీ నేతలు రాజకీయం చేయాలని చూస్తున్నారని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ విషయమై ఆమె రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు బుధవారం లేఖ‌‌ రాశారు. బీజేపీ ప్రతినిధుల బృందం మిమ్మల్ని కలిసి వాస్తవాలను వక్రీకరించి చెప్పారని, ఆ విషయమై మీకు క్లారిటీ ఇచ్చేందుకే ఈ విషయంపై రాస్తున్నాను అని మమతా బెనర్జీ అన్నారు. ‘ఎమ్మెల్యే తరచూ ప్రజలను కలిసే మొబైల్‌ షాప్‌ దగ్గర ఉరి వేసుకుని కనిపించారు. పోస్ట్‌మార్టం […]

Read More

సచిన్​ పైలట్​కు మరో షాక్​

న్యూఢిల్లీ: సొంతపార్టీపైనే తిరుగుబాటు చేసి రెండుసార్లు సీఎల్పీ సమావేశానికి డుమ్మా కొట్టడంతో సచిన్‌పైలెట్‌పై చర్యలు తీసుకుని పదవి నుంచి తొలగించిన కాంగ్రెస్‌ బుధవారం ఉదయం తాజాగా నోటీసులు జారీ చేసింది. సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని లేదంటే అనర్హతను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ నోటీసుల్లో చెప్పింది. సచిన్‌ పైలెట్‌తో పాటు ఆయన తరఫు 18 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. రెండు రోజుల తర్వాత వాళ్లు ఇచ్చే వివరణను బట్టి సీఎల్పీ […]

Read More

నిర్లక్ష్యం వహిస్తే అంతేమరి

సారథిన్యూస్​, వంగూర్​: విధుల్లో నిర్లక్ష్యం వహించిన పంచాయతీ కార్యదర్శి సస్పెండ్​ అయ్యారు. నాగర్​కర్నూల్​ జిల్లా వంగూర్​ గ్రామపంచాయతీ కార్యదర్శి రాజుగౌడ్ విధుల్లో నిర్లక్ష్యం వహించారు. విధులకు సరిగ్గా హాజరుకావడం లేదని.. ప్రజలను పట్టించుకోవడం లేదని అతడిపై ఫిర్యాదులు అందాయి. దీంతో విచారణ చేపట్టిన కలెక్టర్​ షేక్​ యాస్మిన్​ బాషా.. కార్యదర్శిని సస్పెండ్​ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. వీరితోపాటు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో అలసత్వం వహిస్తే […]

Read More

కేసీఆర్​ సార్​ మీరే పట్టించుకోవాలే

సారథిన్యూస్​, హైదరాబాద్​: విప్లవకవి వరవరరావును విడుదల చేసేందుకు సీఎం కేసీఆర్​ జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్​ నేత పొన్నాల లక్ష్మయ్య కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం సీఎం కేసీఆర్​కు లేఖ రాశారు. తెలంగాణ వాది అయిన వరవరరావు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం చేసిన ప్రతి పోరాటంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. బీమాకోరేగావ్​ కేసులో అరెస్టయిన వరవరరావు ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉన్నదని చెప్పారు. ఈ కేసు కేంద్రప్రభుత్వం […]

Read More
రైతు వేదికలు, కల్లాలు పూర్తికావాలె

రైతు వేదికలు, కల్లాలు పూర్తికావాలె

సారథి న్యూస్​, వనపర్తి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులు, రైతు వేదికల నిర్మాణం, పల్లె, పట్టణ ప్రగతి పనులను విజయవంతంగా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. జాబ్​కార్డులు ఉన్న కూలీలకు ఉపాధి పనులు కల్పించాలన్నారు. కొత్తవారికి జాబ్​కార్డులు మంజూరు చేయాలని కోరారు. బుధవారం ఆయన హైదరాబాద్​నుంచి వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు. రైతు వేదికల పనులను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాకు కేటాయించిన నిధులతో వచ్చిన దరఖాస్తులను అనుసరించి […]

Read More
బిత్తిరి సత్తి స్ర్కిప్ట్​రెడీ

బిత్తిరి సత్తి స్ర్కిప్ట్​ ​రెడీ

విలక్షణమైన నటన, వస్త్రధారణ, తెలంగాణ యాస‌, తనదైన మార్క్​హావాభావాలతో వార్తలు చెప్పే బిత్తిరి సత్తికి ‘సాక్షి’ స్ర్కిప్ట్​ ​రెడీ అయింది. త్వరలో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘సాక్షి’ ప్రోమో వీడియో ఒకటి సోషల్​ మీడియాలో హల్​చల్​ చేస్తోంది. ‘నా మనస్సాక్షిగా చెబుతున్న బిడ్డా.. ఇది తండ్రిని గౌరవించుకునే జాగా.. నీవు యాడికి పోయేది లేదు. ఇదే నీ అడ్డా.. అర్థమైందా బిడ్డా..’ అని తండ్రి పాత్రధారి సత్తి అనగా.. ఇగ సత్తిగాని సత్తా ఏందో చూపిస్త.. […]

Read More

23 నుంచి వనమహోత్సవ్​

సారథిన్యూస్​, గోదావరిఖని: సింగరేణి పరిధిలోని అన్ని కార్యాలయాల్లో, స్థలాల్లో ఈ నెల 23 నుంచి వనమహోత్సవ్​ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సంస్థ సీఎండీ శ్రీధర్​ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెత్తం 35 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. బుధవారం కేంద్ర బొగ్గుశాఖ ప్రత్యేకకార్యదర్శి అనిల్​ కుమార్​ వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్​ పాల్గొని మాట్లాడారు. బొగ్గు పరిశ్రమలన్నీ ఈ ఏడాది ‘వనమహోత్సవ్​’ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కేంద్ర […]

Read More