Breaking News

Month: July 2020

లేడీ సింగం

లేడీ సింగం

ఆమె ఓ సాధారణ లేడీ కానిస్టేబుల్​. కానీ ఏకంగా మంత్రి కొడుకుకే చుక్కలు చూపించింది. నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి సుపుత్రుడికి నడి రోడ్డుమీదే వార్నింగ్​ ఇచ్చింది. ‘నేను నీకు నీ బాబుకు సర్వేంట్​ను కాను’ అంటూ హెచ్చరించింది. ఇటీవల గుజరాత్​లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మహిళా కానిస్టేబుల్​కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అయింది. ఇక ఆ కానిస్టేబుల్​ తెగువను మెచ్చుకోని వారంటూ లేరు. అయితే యధావిధిగా పోలీస్​శాఖ […]

Read More
దానం ఎక్కడ?

దానం ఎక్కడ?

సారథి న్యూస్, హైదరాబాద్: ఆయన ఒకప్పుడు గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు.. అంతకు మించి ముఖ్యమంత్రిగా డాక్టర్ ​వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో రాష్ట్ర రాజధానిలో హల్‌ చల్‌ చేసిన వ్యక్తి. ఎన్నికలైనా, పార్టీ కార్యక్రమాలైనా హడావుడి, హంగామా చేయడం ఆయనకు రివాజు. అనుకోకుండా, అనివార్యంగా ఈ మాజీ మంత్రి అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కూడా అయ్యారు. కొద్దికాలం వరకూ పరిస్థితి బాగానే ఉంది. కానీ ఉన్నట్టుండి ఏమైందో తెలియదు.. ఇప్పుడు […]

Read More
ఉస్మానియా.. బురద.. బురద

ఉస్మానియా.. బురద.. బురద

సారథి న్యూస్, హైదరాబాద్: రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు హైదరాబాద్​లోని ఉస్మానియా జనరల్​ ఆస్పత్రి పాత బిల్డింగ్​లోకి వరద నీరు వచ్చిచేరింది. వార్డుల్లోకి వర్షపు నీరంతా చేరడంతో చికిత్స పొందుతున్న రోగులంతా తీవ్ర అవస్థలు పడ్డారు. ముఖ్యంగా వృద్ధులు, ఆపరేషన్​చేయించుకున్న మహిళలు ఎక్కడికి వెళ్లలేక నానా ఇబ్బందులు పడ్డారు. అధికారులు, ఆస్పత్రి సిబ్బంది మోటార్ల సాయంతో నీటిని తోడివేయాల్సి వచ్చింది. ఈ ఘటన కాస్త సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

Read More

తెలంగాణలో 1,597 కరోనా కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో బుధవారం 1,597 కరోనా పాజిటివ్​కేసులు నమోదయ్యాయి. తాజాగా 11 మంది మహమ్మారి బారినపడి మృతిచెందారు. ఇలా రాష్ట్రంలో ఇప్పటివరకు 386 మంది మృత్యువాతపడ్డారు. మొత్తంగా పాజిటివ్​కేసుల సంఖ్య 39,342 కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 2,08,666 మందికి మెడికల్​టెస్టులు చేశారు. జిల్లాల వారీగా.. జీహెచ్ఎంసీ 796, మేడ్చల్​115, సంగారెడ్డి 73, కామారెడ్డి 33, వరంగల్​అర్బన్​44, పెద్దపల్లి 20, మెదక్​18, మహబూబ్ నగర్​21, మంచిర్యాల 26, నల్లగొండ 58, సూర్యాపేట జిల్లాలో 14 చొప్పున […]

Read More
గురుకుల కాలేజీల్లో ప్రవేశాలు

గురుకుల కాలేజీల్లో ప్రవేశాలు

సారథి న్యూస్​, హైదరాబాద్‌: మహాత్మాజ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన (బీసీ) సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధీనంలోని గురుకుల కాలేజీల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును పొడిగించినట్లు సంస్థ కార్యదర్శి మల్లయ్య భట్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 10 వరకు ఉన్న గడువును 19 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఆంగ్ల మాధ్యమం జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌మీడియట్ ఫస్టియర్​లో బాలబాలికలకు, మహిళా డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్​లో అడ్మిషన్లు ఉంటాయని వివరించారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, […]

Read More
తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ

తెలంగాణలో 15 మంది ఐఏఎస్‌ల బదిలీ

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేసింది. అడిషనల్ సీఈవోగా జ్యోతి బుద్ధప్రకాష్‌, వైద్యారోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సయ్యద్‌ అలీ ముర్తుజారజీ, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి, ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్ జనరల్‌ గా అదర్‌ సిన్హా, నాగర్‌కర్నూల్‌ కలెక్టర్​గా ఎల్‌.శర్మన్‌, పాఠశాల విద్యాడైరెక్టర్‌గా శ్రీదేవసేన, హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ గా వాకాటి కరుణ, పర్యాటక, […]

Read More
నాగర్​కర్నూల్​కలెక్టర్​గా ఎల్‌.శర్మన్‌

నాగర్​కర్నూల్ ​కలెక్టర్​గా ఎల్‌.శర్మన్‌

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: నాగర్​కర్నూల్ ​జిల్లా కలెక్టర్​గా ఎల్‌.శర్మన్‌ ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇంతకుముందు పనిచేసిన కలెక్టర్​ ఈ.శ్రీధర్​ను బదిలీచేసిన విషయం తెలిసిందే. వనపర్తి జిల్లా కలెక్టర్ ​యాష్మిన్​బాషాకు ఇన్​చార్జ్ ​బాధ్యతలు అప్పగించారు. తాజాగా శ్రీధర్​ను గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శిగా నియమించారు. అయితే నూతనంగా నియమితులైన కలెక్టర్​ ఎల్.శర్మన్​ఉమ్మడి మహబూబ్​నగర్ ​జిల్లా జాయింట్​ కలెక్టర్​గా పనిచేశారు. అంతేకాదు శర్మన్​ గతంలో నాగర్​కర్నూల్​ ఆర్డీవోగానూ పనిచేశారు.

Read More
కుండపోత వాన

కుండపోత వాన

రోజంతా విడవని వాన ఏకమైన వాగులు, వంకలు పలు పట్టణాల్లో లోతట్టుకాలనీలు జలమయం సారథి న్యూస్, మెదక్, నారాయణఖేడ్, భద్రాద్రి కొత్తగూడెం: వానాకాలం మొదలయ్యాక తొలిసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాన దంచికొట్టింది. బుధవారం దాదాపు అన్ని జిల్లాల్లో భారీవర్షం కురిసింది. మహబూబ్​నగర్​, వికారాబాద్​, జోగుళాంబ గద్వాల, హైదరాబాద్​, వరంగల్​, ఖమ్మం జిల్లాలో వాన దంచికొట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో కుండపోత వానపడింది. చిలప్‌చేడ్‌ మండలంలో అత్యధికంగా 9.3సెం.మీ., కొల్చారం […]

Read More