Breaking News

Month: July 2020

దేశంలో విజృంభిస్తున్న కరోనా

కరోనా విజృంభణ

ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ భయంకరంగా పెరుగుతున్నది. కొత్తగా 34,000 కొత్తకేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య 10,38,716 లకు చేరుకున్నది. కాగా ఇప్పటికే 26,273 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కాగా పట్టణప్రాంతాలతోపాటు గ్రామాలకు ఈ మహమ్మారి విస్తరించింది. రానున్నరోజుల్లో పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా 6,53,750 మంది కోలుకోవడం కొంత ఊరటనిచ్చే అంశమే. ప్రభుత్వాలు చేతులెత్తేసిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలే జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Read More

నాగర్​కర్నూల్​ జిల్లాలో 33 కొత్త కేసులు

సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​: జీహెచ్ఎంసీకి పరిమితమైందనుకున్న కరోనా మహమ్మారి మారుమూల పల్లెలకు పాకుతున్నది. శుక్రవారం ఒక్కరోజే నాగర్​కర్నూల్​ జిల్లాలో 33 కొత్తకేసులు నమోదయ్యాయని డీఎంహెచ్​వో సుధాకర్​లాల్​ తెలిపారు. నాగర్​కర్నూల్​ పట్టణంలో ఆరుగురికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఎస్​బీఐలో పనిచేస్తున్న ఐదుగురు సిబ్బందికి, సంతబజార్​కు చెందిన ఓ మహిళకు కరోనా సోకింది. వీరితో పాటు అచ్చంపేట పట్టణానికి చెందిన 15 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. లింగాల మండలం అంబటి పల్లిలో ముగ్గురికి కరోనా సోకింది. […]

Read More
ట్రైలర్ టాక్.. ‘లూట్ కేస్’

ట్రైలర్ టాక్.. ‘లూట్ కేస్’

బాలీవుడ్​లో మరో సినిమా ఓటీటీలో రిలీజ్​కు సిద్ధమైంది. కునాల్ ఖేము హీరోగా నటించిన ‘లూట్ కేస్’ సినిమా ఈ నెల 31న డిజిటల్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్​లో రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి రాజేష్ కృష్ణన్ దర్శకత్వం వహించగా.. ఫాక్స్ స్టూడియోస్, సోడా ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి. గురువారం రిలీజైన సినిమా ట్రైలర్ ఫన్నీ ఎంటర్ టెయిన్ మెంట్ తో ఉండి సినిమా ఆశక్తిని కలిగించేదిలా ఉంది. రెండు నిమిషాల యాభై ఆరు సెకన్లు ఉన్న ఈ […]

Read More
సెబాస్టియన్ ఫస్ట్ లుక్

సెబాస్టియన్ ఫస్ట్ లుక్

టాలీవుడ్​లో యంగ్ హీరోలు వెలువలా వస్తున్నారు. ‘రాజా వారు రాణిగారు’ వంటి నేచురల్ ప్రేమకథా చిత్రంతో హీరోగా పరిచయమైన కిరణ్ సబ్బవరం తొలిచిత్రంతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. దాంతో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ‘ఎస్ఆర్. కల్యాణ మండపం, Est. 1975’ రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇదిలా ఉండగా కిరణ్ సబ్బవరం తాజాగా మరో చిత్రానికి కమిటయ్యాడు. ‘Est. 1975’ చిత్రాన్ని నిర్మిస్తున్న ఎలైట్ ఎంటర్​టైన్​మెంట్​ సంస్థ తాజాగా కిరణ్ అబ్బవరంతో ‘సెబాస్టియన్ పీసీ […]

Read More
మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలుపండి

మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలుపండి

సారథి న్యూస్, రామడుగు: ఈనెల 22న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, 24న మంత్రి కేటీఆర్ జన్మదినం రోజున పెద్ద ఎత్తున మొక్కలు నాటలనే సందేశంతో జై తెలంగాణ ఫౌండేషన్ చైర్మన్, కేటీఆర్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు వివేకానంద రూపొందించిన పోస్టర్ ను మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు, నాయకులు విడుదల చేశారు. గిఫ్టులు కాకుండా మొక్కలు నాటి విషెస్​ చెప్పాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంట్ల వెంకట రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు […]

Read More
చెరువులపై హక్కులు బెస్తలకే కల్పించాలి

చెరువులపై హక్కులు బెస్తలకే కల్పించాలి

సారథి న్యూస్, రామాయంపేట: చెరువుల్లోని చేపలపై తొలి హక్కులు బెస్త, గంగపుత్రులకే చెందేలా రాష్ట్ర గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేయాలని చల్మేడ గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్ష కార్యదర్శులు మంగలిపల్లి శ్రీనివాస్, మంగిలిపల్లి రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. మత్స్యకారుల మెడ మీద కత్తిలా మారిన జీవోలను రద్దుచేయాలన్నారు. ఉచిత చేపపిల్లలకు బదులుగా అంతే మొత్తంలో డబ్బును సొసైటీ ఖాతాలో జమచేస్తే మంచి నాణ్యమైన చేపలను […]

Read More
కారంచేడు మృతులకు నివాళి

కారంచేడు మృతులకు నివాళి

సారథి న్యూస్, రామగుండం: ప్రకాశం జిల్లా కారంచేడు అగ్రవర్ణాల నరమేధానికి 35 ఏళ్లు గడిచిపోయిందని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంకూరి మధు అన్నారు. శుక్రవారం గోదావరిఖని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ భవన్​లో జరిగిన సమావేశంలో కారంచేడు మృతులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మాదిగ కులస్తులను ఉచకోత కోసి అగ్రవర్ణాలు నరమేధం సృష్టించాయని ఆవేదన వ్యక్తంచేశారు. అగ్రవర్ణ పార్టీల్లో కొందరు దళిత నాయకులు పాలేరులుగా పనిచేస్తున్నందున కారంచేడు బాధితులకు […]

Read More
దళిత యువకుడి దారుణ హత్య

దళిత యువకుడి దారుణ హత్య

సారథి న్యూస్, కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని మర్రిపల్లి గ్రామంలో దళిత యువకుడు ఈర్లపల్లి కిరణ్ (28)ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా గొడ్డలితో నరికిచంపారు. ఈ ఘటన శుక్రవారం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యోదంతంపై లోతైన విచారణ సాగిస్తున్నారు.

Read More