Breaking News

Month: July 2020

సుశాంత్​ గర్ల్​ఫ్రెండ్​కు బెదిరింపులు

ఇటీవల ఆత్మహత్యకు చేసుకున్న సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ మాజీ ప్రేయసీ రియా చక్రవర్తిని కొందరు ఇన్​స్టాగ్రామ్​లో బెదిరించారు. ‘సుశాంత్​ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఇద్దరు వ్యక్తులు నాకు అసభ్యకరంగా మెసేజ్​లు పెట్టారు. నన్ను రేప్​ చేస్తానని బెదిరిస్తూ ఒకడు మెసేజ్​ పంపించగా.. మరోకడు చంపేస్తానని బెదిరించాడు’ అంటూ రియా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సైబర్​క్రైం టీంతో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

Read More
రేణిగుంట విమానాశ్రయంలో తప్పిన ప్రమాదం

రేణిగుంట విమానాశ్రయంలో తప్పిన ప్రమాదం

తిరుపతి: తిరుపతి రేణిగుంట విమానాశ్రయం రన్‌ వేపై తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం విమానం ల్యాండింగ్‌కు ముందు రన్‌ వే పరిశీలనకు వెళ్లిన ఫైర్ ఇంజిన్ వెహికిల్​ బోల్తాపడింది. బెంగళూరు – తిరుపతి విమానం పైలట్ ఈ ప్రమాదాన్ని ముందుగా గుర్తించారు. విమానం రన్‌ వేపై ల్యాండ్ కాకుండానే బెంగళూరుకు తిరుగు పయనమైంది. హుటాహుటిన అక్కడి చేరుకున్న ఎయిర్​పోర్టు అధికారులు, సిబ్బంది ఫైర్​ ఇంజిన్​ వాహనాన్ని తొలగించారు. దీంతో స్థానిక రేణిగుంట విమానాశ్రయంలో పలు ఫ్లైట్లు […]

Read More
తమిళనాడులో బీజేపీ కొత్త ఎత్తులు

తమిళనాడులో బీజేపీ కొత్తఎత్తులు

చెన్నై: త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ కొత్త ఎత్తులు వేస్తోంది. అందులో భాగంగానే గంధపు చెక్కల స్మగ్లర్​ వీరప్పన్​ కూతురు విద్యావీరప్పన్​కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించింది. తమిళనాడు యువమోర్చా విభాగం ఉపాధ్యక్షురాలిగా ఆదివారం ఆమెను నియమించింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆమె గత ఫిబ్రవరిలో బీజేపీలో చేరారు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో వీరప్పన్ వర్గాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని […]

Read More
ఊరూరా మొక్కలు నాటాలె

ఊరూరా మొక్కలు నాటాలె

సారథి న్యూస్​, మహబూబాబాద్​: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ భవనం ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ఆదివారం మొక్క నాటి నీళ్లు పోశారు. ఊరూరా హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిట్యాల జనార్దన్, కెఎస్ఎన్ […]

Read More
కొల్లాపూర్​ అభివృద్ధి చెందాలి

కొల్లాపూర్​ అభివృద్ధి చెందాలి

సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​: కొల్లాపూర్​ మరింత అభివృద్ధి చెందాలని నాగర్​కర్నూల్​ జిల్లా కలెక్టర్​ ఎల్​.శర్మన్​ ఆకాంక్షించారు. ఆదివారం ఆయన మార్నింగ్​ వాక్​లో భాగంగా కొల్లాపూర్ లో పర్యటించారు. పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ఆ మేరకు ప్రణాళికలతో అధికారులు ముందుకు సాగాలని సూచించారు. మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పట్టణాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని సూచించారు. కరెంట్​ బిల్లులు నెలనెలా చెల్లించాలని, విద్యుత్​ను పొదుపుగా వాడాలని సూచించారు. పట్టణంలో డంపింగ్ ​యార్డ్​ పనులను కంప్లీట్​ చేయాలన్నారు. […]

Read More

కరోనాతో చెదిరిన చేనేత పరిశ్రమ

ఉపాధి కోసం కూలి పనులకు వెళ్తున్న కార్మికులు చేతులు మొద్దు బారి నేత పని చేయలేకపోతున్నామని ఆవేదన ప్రభుత్వమే గిట్టుబాటు ధరలు కల్పించాలని వేడుకోలు సారథి న్యూస్​, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి గ్రామం పేరు చెబితేనే చేనేత గుర్తుకొస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో నేత పనికి గుర్తింపు తెచ్చిన వాటిలో ఈ గ్రామం కూడా ఒకటి. అలాంటి ఊరులో చేనేత వృత్తే కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వృత్తినే నమ్ముకుని కొన్నేళ్లుగా జీవనం […]

Read More
నితిన్​ పెళ్లి డేట్​ ఫిక్స్​

నితిన్​ పెళ్లి డేట్ ఫిక్స్​

కరోనాతో వాయిదా పడ్డ టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ – షాలిని వివాహానికి ముహూర్తం కుదిరింది. ఏప్రిల్ 16ననే వీరి పెళ్లి జరగాల్సిఉండగా లాక్​డౌన్​తో వాయిదా పడింది. దీంతో జూలై 26న రాత్రి 8.30 నిమిషాలకు వీరి పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలు ముహూర్తం పెట్టించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిరాడంబరంగా వివాహ వేడక జరుగనున్నది. ఇరుకుటుంబాల వారు మాత్రమే ఈ వేడుకకు హాజరుకానున్నారు. హైదరాబాద్​లోని ఫలక్ నుమా ప్యాలస్​లో పెళ్లి జరుగనున్నట్టు సమాచారం. భీష్మ సినిమాతో సూపర్హిట్‌ను […]

Read More

38 వేల కొత్తకేసులు

ఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 38,902 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో.. మొత్తం కేసుల సంఖ్య 10,77,618 కి చేరింది. ఒక్కరోజులో 38 వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. కొత్తగా 543 మంది వైరస్‌ బాధితులు మృతి చెందడటంతో మొత్తం మరణాల సంఖ్య 26,816 కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం బులెటిన్‌లో పేర్కొంది. ఇప్పటి వరకు భారత్‌లోని మొత్తం కరోనా రోగుల్లో 6.77 లక్షల మంది కోలుకున్నారు. […]

Read More