Breaking News

Month: July 2020

షార్ట్ న్యూస్

మంటగలిసిన మానవత్వం

బెంగళూరు: కరోనాభయంతో మనుషుల్లో మానవత్వం మంటగలుస్తుంది. సాటి మనిషిపై కనీసం కనికరం లేకుండా పోతున్నది. తాజాగా బెంగళూరులో ఓ దారుణ ఘటన చోటుచేసుకున్నది. కరోనా భయంతో ఓ గర్భిణిని చేర్చుకోవడానికి మూడు ఆస్పత్రులు నిరాకరించాయి. దీంతో ఆ మహిళ ఆటోలోనే ప్రసవించింది. గర్భిణి ప్రాణాలతో భయపడగా.. బిడ్డ మాత్రం మృతిచెందింది. ఆసుపత్రులు కనికరం చూపించి ఉంటే ఆ పసికందు బతికేది. ‘కర్ణాటకలో కరోనా చావులు తక్కువగానే ఉన్నాయి. కానీ కరోనా భయంతో ఆస్పత్రులు వైద్యం నిరాకరించడం వల్ల […]

Read More
దాశరథి చైతన్య స్ఫూర్తిని కొనసాగిస్తాం

దాశరథి చైతన్య స్ఫూర్తిని కొనసాగిస్తాం

సారథి న్యూస్, హైదరాబాద్: దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ సాహితీ యోధుడని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు అన్నారు. ఆయన అందించిన ఉద్యమ చైతన్య స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. దాశరథి కృష్ణమాచార్యుల 96వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులు అర్పించారు. దాశరథి రగిలించిన చైతన్య స్ఫూర్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించేందుకు కావాల్సిన సంకల్ప బలాన్ని ఇచ్చిందని కొనియాడారు. సాహిత్యరంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా అధికారికంగా ఆయన జయంతి వేడుకలను నిర్వహిస్తూ.. అవార్డులను […]

Read More
కాంగ్రెస్​ఎమ్మెల్యేలు మావెంటే

కాంగ్రెస్ ​ఎమ్మెల్యేలు మా వెంటే

జైపూర్‌‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సపోర్ట్‌తోనే తాను ధైర్యంగా ఉన్నానని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు. మంగళవారం ఉదయం జరిగిన మూడో సీఎల్పీ సమావేశంలో ఆయన ఈ విషయ చెప్పారు. సచిన్‌ పైలెట్‌ ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా ఎమ్మెల్యేలంతా తనతో ఉండి నమ్మకంతో సపోర్ట్‌ చేశారని అన్నారు. తమకు 115 మంది ఎమ్మెల్యేల సపోర్ట్‌ ఉందన్నారు. ఆ తర్వాత రాజస్థాన్‌ కేబినెట్‌ మీటింగ్‌ కూడా నిర్వహించారు. రాజస్థాన్‌ అనిశ్చితి తర్వాత గెహ్లాట్‌ రెండుసార్లు సీఎల్పీ సమావేశం […]

Read More
నేను గొప్ప దేశభక్తుడిని..

నేనే గొప్ప దేశభక్తుడిని..

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఎట్టకేలకు మాస్క్‌ పెట్టుకోవడం విషయంలో పాజిటివ్‌గా మాట్లాడారు. ప్రెసిడెంట్‌ మార్క్‌ ఉన్న నల్లటి మాస్క్‌ను పెట్టుకున్న తన ఫొటోను ట్వీట్‌ చేశారు. ‘ నా కంటే గొప్ప దేశభక్తుడు లేడు..సోషల్‌ డిస్టెంసింగ్ పాటించడం దేశభక్తి అంటున్నారు. నాకన్నా ఎక్కువ ఎవరూ పెద్ద దేశ భక్తుడు కాదు’ అంటూ ట్వీట్‌ చేశారు. యూఎస్‌లో కరోనాను కంట్రోల్‌ చేయడంలో ట్రంప్‌ ఫెయిల్‌ అయ్యాడనే ఆరోపణలు ఉన్నాయి. అయితే మరికొన్ని రోజుల్లో అమెరికాలో ఎన్నికలు […]

Read More
ప్రాజెక్టులు కంప్లీట్​కావాలె

ప్రాజెక్టులు కంప్లీట్ ​కావాలె

గోదావరి నుంచి 4, కృష్ణా నుంచి 3 టీఎంసీల నీటిని తరలించాలి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు సారథి న్యూస్, హైదరాబాద్: నిధుల సమీకరణకు సంబంధించిన ప్రక్రియను వెంటనే పూర్తిచేసి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూడో టీఎంసీని తరలించే పనులతో పాటు, పాలమూరు- రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ‘రాష్ట్రంలోని ప్రాజెక్టులు.. వాటికి నిధుల సమీకరణ’పై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో […]

Read More
కరోనాతో ఏడుగురు మృతి

కరోనాతో ఏడుగురు మృతి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం 1,430 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 47,705కు చేరిన పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి ఒకేరోజు ఏడుగురు మృతిచెందారు. ఇప్పటివరకు మరణాల సంఖ్య 422 కు చేరింది. ఇప్పటిదాకా 2,93, 077 శాంపిళ్ల టెస్టింగ్ చేశారు. తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​ను వెల్లడించింది. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా జీహెచ్​ఎంసీ పరిధిలో 703 కరోనా పాజిటివ్​కేసులు తేలాయి. రంగారెడ్డి 117, మేడ్చల్​105, సంగారెడ్డి 50, ఖమ్మం 14, […]

Read More

గోల్డ్​మాస్క్​​ ధర ఎంతంటే

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరుకు చెందిన ఓ స్వర్ణకారుడు వినూత్నంగా ఆలోచించి బంగారం, వెండితో మాస్కును తయారుచేశాడు. బంగారుమాస్కును 2.75 లక్షలకు, వెండి మాస్కును రూ.15,000 లకు విక్రయిస్తున్నట్టు ఆ స్వర్ణకారుడు తెలిపారు. ఇప్పటికే వీటికి 9 ఆర్డర్లు వచ్చాయని చెప్పారు. ధనవంతులు తమ హోదాకు చిహ్నంగా ఓ మాస్కులను కొనుగోలు చేస్తున్నారని ఆయన చెప్పారు.

Read More

మధ్యప్రదేశ్​ గవర్నర్​ కన్నుమూత

లక్నో: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్​జీ టాండన్​ (85) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ మేరకు ఆయన కుమారుడు అశుతోష్​ ట్వీట్​చేశారు. ఆయన కొంతకాలంగా జ్వరం, మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. నెల క్రితం లక్నోలోని ఓ ఆస్పత్రిలో చేరారు. టాండన్​ మాజీ ప్రధాని వాజపేయికి సన్నిహితుడు. ఉత్తర్​ప్రదేశ్​ మంత్రిగా కొంతకాలం పనిచేశారు. చిన్నప్పటినుంచే టాండన్​ ఆరెస్సెస్​లో క్రియాశీలకంగా ఉండేవారు. తర్వాత జనసంఘ్​లో చేరారు. టాండన్​ మృతికి ప్రధాని మోదీ, కేంద్రమత్రి స్మృతి ఇరానీ సంతాపం తెలిపారు.

Read More