Breaking News

Month: July 2020

మావోయిస్టుల దుశ్చర్యలను అడ్డుకుంటాం

మావోయిస్టుల దుశ్చర్యలను అడ్డుకుంటాం

సారథి న్యూస్​, ములుగు: మావోయిస్టుల బంద్ నేపథ్యంలో ములుగు జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్వయంగా  ఆ జిల్లా ఓఎస్​డీ కె. సురేష్ కుమార్ ఆయుధాన్ని చేతబట్టి స్పెషల్ పార్టీ సీఆర్పీఎఫ్​ బలగాలతో అర్ధరాత్రిలో ములుగు జిల్లాలో కూంబింగ్​ నిర్వహించారు. మావోయిస్టుల వారోత్సవాల  నేపథ్యంలో వారి కదలికలపై నిఘావర్గాల సమాచారాన్ని సేకరిస్తూ వ్యూహాత్మకంగా వారిని నిరోధించడంలో పోలీస్ బలగాలకు మార్గనిర్దేశం చేశారు.

Read More
సిక్కింలో తొలి కరోనా మృతి

సిక్కింలో కరోనా తొలి మరణం

సిక్కిం: ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో తొలి కరోనా మరణం సంభవించింది. హిమాలయ పర్వతశ్రేణుల్లో ఒదిగి ఉన్న చిన్నరాష్ట్రమైన సిక్కింలో కరోనా కేసులు కూడా చాలా తక్కువగానే నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో కేవలం 500 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అందులో 140 మంది కోలుకొని డిశ్చార్జ్​ అయ్యారు. కాగా సిక్కింలో శనివారం ఓ వ్యక్తి కరోనాతో చికిత్స పొంది మృతిచెందాడు. అతడికి మధుమేహం, హైబీపీ ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

Read More
ఆరుబయటే అసెంబ్లీ

కరోనా ఎఫెక్ట్​.. ఆరుబయటే అసెంబ్లీ

పుదుచ్చేరి: కరోనా వైరస్ దెబ్బతో చరిత్రలో తొలిసారిగా పుదుచ్చేరి సమావేశాలను ఆరుబయట చెట్ల కింద నిర్వహించింది. ఆలిండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎన్‌ఎస్‌జె జయబాల్‌‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయను హాస్పిటల్‌కు తరలించి.. అసెంబ్లీ సమావేశాన్ని ఆరు బయటకు షిఫ్ట్ చేశారు. రూ.9 వేల కోట్ల బడ్జెట్‌ను ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించిన తర్వాత సభను వాయిదా వేశారు. జులై 20న పుదుచ్చేరి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, తొలి రెండు రోజులు […]

Read More
జీహెచ్​ఎంసీ మేయర్​ రామ్మోహన్​కు కరోనా

మేయర్​ బొంతు రామ్మోహన్​కు కరోనా

సారథి న్యూస్​, హైదరాబాద్​: జీహెచ్​ఎంసీ మేయర్​ బొంతు రామ్మోహన్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. లక్షణాలు ఏవీ లేకపోయినా ఆయనకు కరోనా పాజిటివ్​ వచ్చింది. ఇటీవల ఆయన సిబ్బందిలో ఒకరికి కరోనా రావడంతో మేయర్ హోం క్వారంటైన్​లో ఉంటున్నారు. తాజాగా ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా నిర్ధారణ అయ్యింది. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. త్వరలోనే కోలుకుంటానని మేయర్​ ట్వీట్​ చేశారు.

Read More
నాకు కరోనా తగ్గింది

నాకు కరోనా తగ్గింది

తాను కరోనా నుంచి కోలుకున్నానని బుల్లితెర స్టార్​ హీరోయిన్​, ‘నా పేరు మీనాక్షి’ ఫేమ్​ నవ్య స్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఓ వీడియోను విడుదల చేశారు. కొంతకాలం క్రితం నవ్యకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆమె ఇంట్లోనే ఐసోలేషన్​లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ‘ నా క్వారంటైన్​ లైఫ్​ పూర్తయింది. ఇంతకుముందుకంటే బాగున్నాను. అందరూ ఇచ్చిన ధైర్యంతోనే కోలుకున్నాను. దాదాపు 3 వారాలపాటు ఇంట్లోనే ట్రీట్​మెంట్​ తీసుకున్నాను. […]

Read More
కనికరించని కన్నకొడుకు

కనికరించని కన్నకొడుకు

సారథి న్యూస్​, హైదరాబాద్​ : కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డాక్టర్లు డిశ్చార్జ్​ చేశారు. ఆమె సంతోషంతో తిరిగి ఇంటికొచ్చింది.. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఇంటికి వస్తే కొడుకు షాకిచ్చాడు.. ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నాడు. హైదరాబాద్‌ ఫిలింనగర్‌ బీజేఆర్‌ నగర్‌లో ఓ మహిళకు కరోనా వైరస్ నిర్ధారణ అయింది. ఆమె గాంధీ ఆసుపత్రిలో చేరింది.. కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డాక్టర్లు డిశ్ఛార్జ్‌ చేశారు. […]

Read More
కరోనా కలకలం

కృష్ణా కలెక్టరేట్​లో కరోనా కలకలం

సారథి న్యూస్​, కృష్ణా : ఆంధ్రప్రదేశ్​ లోని కృష్ణా జిల్లా కలెక్టరేట్​లో కరోనా కలకలం సృష్టిస్తోంది. రెండు రోజుల క్రితం కలెక్టరేట్​ వంద ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేయించారు. ఈ క్రమంలో ఒక్కొక్కటిగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. నేరుగా ఉద్యోగుల ఫోన్లకు వస్తున్న ఫలితాల రిపోర్టులు చూసి సహచరులు భయపడుతున్నారు. ఇప్పటికే 15 మందికి పైగా పాజిటివ్ గా రిపోర్టులు వచ్చాయి.

Read More

కానిస్టేబుల్​ పై సస్పెన్షన్​ వేటు

సారథి న్యూస్​, నకిరేకల్​: తన సమస్యను పరిష్కరించాలని పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళతో అసభ్యంగా వ్యవహరించిన నకిరేకల్ హెడ్ కానిస్టేబుల్ రఘును నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాధ్ ఆదేశాలు ఆదివారం జారీ చేశారు. తనను వేధిస్తున్న తన భర్త నుంచి తనకు రక్షణ కల్పించాలని, తన సమస్యను పరిష్కరించాలని నకిరేకల్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఒక మహిళతో హెడ్ కానిస్టేబుల్ రఘు అసభ్యంగా ప్రవర్తించినట్లుగా వచ్చిన సమాచారం మేరకు విచారణ జరపి సస్పెండ్ చేసినట్లు […]

Read More