సారథి న్యూస్, రామగుండం: ఏఐటీయూసీ నాయకుడు గట్టయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సింగరేణి రామగుండం జీఎంపై చర్యలు తీసుకోవాలని కార్మికసంఘాల నాయకులు మిట్టపల్లి వెంకటస్వామి తదితరులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కొందరు అధికారుల తీరుతో కార్మికులతో యాజమాన్యానికి సత్సంబంధాలు లేకుండా పోతాయని.. అంతిమంగా సింగరేణి యాజమాన్యానికి ఎంతో నష్టం చేకూరుతుందని చెప్పారు. కార్మికులతో స్నేహపూర్వకమైన వాతావరణంలో చర్చలు జరపాలని వారు పేర్కొన్నారు.
సారథి న్యూస్, కర్నూలు: పొలం తగాదా విషయంలో ఇద్దరు సోదరులు, వారి వర్గం మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కత్తులు, కర్రలతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటన శుక్రవారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని పెద్దకడుబూరు మండలం హనుమాపురం గ్రామంలో సంచలనం రేపింది. గ్రామంలోని పెద్ద అయిలప్ప, పెద్దయ్య మధ్య భూ వివాదం నెలకొంది. ఓ వర్గం వారు పొలం దున్నడానికి వెళ్లగా, మరో వర్గం వారు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదంతో మొదలై […]
గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ సీఆర్డీఏ రద్దు బిల్లుకు పచ్చజెండా సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులకు ఇక అడుగులు పడినట్టే.. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఓకే చెప్పారు. అలాగే, సీఆర్డీఏ రద్దు బిల్లుకు కూడా ఆమోదం తెలిపారు. ఈ రెండు బిల్లులకు రాజ్ భవన్ నుంచి ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టింది. దీన్ని […]
అగర్తలా: బాలికలు, యువతులపై అకృత్యాలు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా త్రిపుర రాష్ట్రంలో ఓ యువతి (17)పై ఐదుగురు యువకులు సామూహికంగా లైంగికదాడి పాల్పడ్డారు. ఖోవాయి జిల్లాలోని ఖాసియమంగల్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని ముగ్గురు యువకులు బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకొని అడవుల్లోకి లాక్కెల్లారు. అనంతరం ఆమెపై పాశవికంగా లైంగికదాడి చేశారు. దీంతో యువతి ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అయినా ఆ నరరూప రాక్షసుల కసి చల్లారలేదు. తమ స్నేహితులైన మరో ఇద్దరు యువకులను అక్కడికి పిలిపించి […]
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. తాజాగా సుశాంత్ సింగ్ బ్యాంక్ఖాతాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. సుశాంత్ బ్యాంక్ ఖాతాలను పరిశీలించిన ఈడీ అధికారులు మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బిహార్ పోలీసుల నివేదిక ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. సుశాంత్ ఖాతానుంచి సుమారు 15 కోట్ల రూపాయలను నటి రియా చక్రవర్తి వాడుకుందని సుశాంత్ తండ్రి ఫిర్యాదు నేపథ్యంలో తాజా […]
చెన్నై: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం బాగున్నదని సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్భూ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. అయితే కుష్బూపై సొంతపార్టీ నేతలే ఫైర్ అవుతున్నారు. కేంద్ర నూతన విద్యావిధానంపై కాంగ్రెస్ యువ నేత రాహుల్ సహా ఆ పార్టీ నేతలంతా విమర్శించారు. ఈ నేపథ్యంలో కుష్బూ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. కుష్బూ పార్టీ లైన్‌ను దాటి మాట్లాడిందని నేతలు ఆరోపించారు. అది కేవలం […]
ముంబై: ఓ వైపు కరోనా మహమ్మారితో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతుంటే.. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ చేయడం అవసరమా? అంటూ నవనిర్మాణ సేన అధినేత రాజ్‌థాక్రే వ్యాఖ్యానించారు. శుక్రవారం ముంబైలోని ఓ ప్రాంతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రజలు పండగలు, ఉత్సవాలు చేసుకొనే మూడ్‌లో లేరని వ్యాఖ్యానించారు. కరోనా కేసులు పూర్తిగా తగ్గాక అయోధ్యలో భూమిపూజ చేస్తే ప్రజలు ఈ వేడుకలో ఉత్సాహంగా పాలుపంచుకొనేవారని చెప్పారు.
సారథి న్యూస్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా నాచారుపల్లిలో నూతనంగా నిర్మించిన 36 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రవేశాలు శుక్రవారం చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ఆశీస్సులతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇచ్చామన్నారు. పేదలకు ఒక్క రూపాయి ఖర్చులేకుండా సకల వసతులతో ఇళ్లు ఇచ్చామన్నారు. ‘గుడిసె తప్ప గూడు ఎరుగని మాకు దేవుడిలా సీఎం కేసీఆర్ వరం ఇచ్చారని’ లబ్ధిదారులు కొనియాడారు. కార్యక్రమంలో సుడా […]