Breaking News

Day: July 27, 2020

నితిన్ కు ‘రంగ్​దే’ కానుక

నితిన్ కు ‘రంగ్​దే’ కానుక

యంగ్ హీరో నితిన్ పెళ్లి సాదాసీదాగా ఆదివారం బంధుమిత్రుల సమక్షంలో జరిగిపోయింది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు నితిన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో నితిన్ కు ‘రంగ్ దే’ టీమ్ క్యూట్ మ్యారేజ్ గిఫ్ట్ అంటూ ప్రత్యేకంగా కట్ చేసిన టీజర్ తో స్పెషల్ విషెస్ తెలియజేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నిజజీవితంలో ఎంతో […]

Read More

శ్రీశైలానికి పోటెత్తుతున్న వరద

సారథి న్యూస్​, కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 85,230 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 40,259 క్యూసెక్కులుగా ఉంది. అలాగే జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా…ప్రస్తుతం నీటి మట్టం 853.80 అడుగులకు చేరింది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను… ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 88.8820 టీఎంసీలుగా నమోదు అయ్యింది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 6 […]

Read More
హోటల్​కు భారీ జరిమాన

హోటల్​ తనిఖీ.. భారీ జరిమాన

సారథిన్యూస్​, కొత్తగూడెం: కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటించని ఓ హోటల్​కు భారీ జరిమాన విధించిన ఘటన కొత్తగూడెం జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. సోమవారం ఉదయం కలెక్టర్​ ఎంవీ రెడ్డి జిలా కేంద్రంలోని హోటళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో ‘గుడ్​మార్నింగ్​’ అనే హోటల్​లో సిబ్బంది కనీసం మాస్కులు కూడా ధరించకుండా తినుబండారాలు సప్లై చేస్తున్నారు. ఆగ్రహం వ్యక్తంచేసిన కలెక్టర్​ హోటల్​ యజమానికి రూ. 25వేలు జరిమానా విధించారు. నిబంధనలు పాటించకపోతే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

Read More
జర్నలిస్టులను అన్ని విధాల ఆదుకుంటున్నాం

337 మంది జర్నలిస్టులకు సాయం

సారథిన్యూస్​, హైదరాబాద్​: రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారినపడ్డ 337 మంది జర్నలిస్టులకు రూ. 59 లక్షల 30 వేల రూపాయలు ఆర్థికసాయం అందించామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్​ అల్లం నారాయణ వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన 256 మందికి 20 వేల రూపాయల చొప్పున, 51 లక్షల 20 వేల రూపాయలు, హోం క్వారంటైన్ లో ఉన్న 81 మంది జర్నలిస్టులకు పదివేల రూపాయల చొప్పున 8 లక్షల 10 వేల రూపాయలను అందిచామన్నారు. జర్నలిస్టులు ఎవరికైనా […]

Read More

అనుమానమే పెనుభూతమై..

సారథి న్యూస్​, చిత్తూరు : చిత్తూరు జిల్లా వి కోట మండలం పాముగానిపల్లిలో అనుమానం పెనుభూతమై పచ్చని కాపురంలో చిచ్చు రగిలింది. తాగుడుకు బానిసైన భర్త ప్రభాకర్​ రెడ్డి (32)  భార్య రేణుక (22)పై అనుమానం పెంచుకుని సోమవారం ఉదయం భార్యభర్తలిద్దరూ గొడవ పడ్డారు. పాముగానిపల్లె సమీపంలోని పొలం వద్ద ఇరువురు ఘర్షణ పడి కోపంతో వెంట తెచ్చుకున్న కత్తితో భార్య మెడపై నరికాడు. ఆమె స్పాట్​లోనే చనిపోయింది. అనంతరం అతను గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. […]

Read More
జగదీష్ రెడీ అయిపోతున్నాడు..

జగదీష్ రెడీ అయిపోతున్నాడు..

షూటింగ్స్ బంద్ అయి నాలుగు నెలలు గడిచింది. అన్ని సినిమాలు కూడా వాయిదా పడిపోయాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం పరిస్థితులు చక్కబడిన వెంటనే రిలీజ్ అయిపోనున్నాయట. దానికోసం కొంతమంది తెలివైన నిర్మాతలు మాత్రం ఈ సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కానిచ్చేస్తున్నారు. ఈ క్రమంలో నాని నటిస్తున్న ‘టక్ జగదీష్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. శివ నిర్వహణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు సగం పూర్తయింది. తమిళనాడు […]

Read More
వైభవంగా నితిన్​, షాలినీ పెండ్లి

వైభవంగా నితిన్​, షాలినీ పెండ్లి

హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో జులై 26 ఆదివారం రాత్రి 8:30 గంటలకు నితిన్, షాలినీ ల పెళ్లి వైభవంగా జరిగింది. కరోనా నిబంధనలను పాటిస్తూ అతికొద్దిమంది ఆత్మీయులు సన్నిహితుల సమక్షంలో పెద్దలు అంగరంగవైభవంగా జరిపించారు ఈ వేడుకను. ఈ పెళ్లి కి సినీ ఇండస్ట్రీ నుంచి నితిన్ బెస్ట్ ఫ్రెండ్స్ వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, హీరో కార్తికేయ హాజరయ్యారు. ఈ అలాగే ఈ వేడుకలో సినీ రాజకీయ ప్రముఖులు కూడా […]

Read More
తెలంగాణలో కరోనాతో 8 మంది మృతి

తెలంగాణలో కరోనాతో 8 మంది మృతి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం కొత్తగా 1,473 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 55,532 పాజిటివ్ కేసుల నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 8 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 471 మంది మృత్యువాతపడ్డారు. చికిత్స అనంతరం 42,106 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 12,955కు చేరింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 506 నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి 168, వరంగల్​ అర్బన్​111, […]

Read More