Breaking News

డబ్బుకొట్టు..ఇల్లు పట్టు

డబ్బుకొట్టు..ఇల్లు పట్టు
  • డబుల్​ బెడ్​రూం ఇళ్లంటూ ఘరానా మోసం
  • జనాల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు
  •  మాదాపూర్, కూకట్​పల్లి ఎస్.ఓ.టీ పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో బట్టబయలు

సారథి న్యూస్​, హైదరాబాద్​ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రుమ్ పథకాన్ని అడ్డు పెట్టుకొని కొందరు వ్యక్తులు పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరానికి చెందిన గూతుల. ప్రశాంత్(విజన్-1టీవీ ఛానెల్ చైర్మన్ తండ్రి లక్ష్మీనారాయణ) అనే వ్యక్తి కూకట్​పల్లి హౌసింగ్ బోర్డ్  9వ ఫేస్,  సెంకడ్​ ఫ్లోర్ లో నివాసం ఉంటున్నాడు. నిరుపేదలకు, ఇండ్లు లేనివారికి ఉద్దేశించిన డబుల్ బెడ్ రూమ్స్ పథకానికి ఉన్న డిమాండ్ ని క్యాష్ చేసుకోవాలని పథకం పన్నాడు. నగరంలోని నిజాంపేట, కైతలాపూర్ లో మీడియా సంబంధిత వ్యక్తులకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్స్ అందించనుందని, తాను ఆ విషయంలో సమర్ధుడినని అందరిని నమ్మించాడు. దాదాపు 40 మంది వ్యక్తుల దగ్గర నుండి వారి డాకుమెంట్స్ సహా రూ. 150000-170000 వరకు వసూలు చేశాడు. పది రోజుల తర్వాత వారికి ‘గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హౌసింగ్ డిపార్ట్మెంట్ ’ పేరు మీద డబుల్ బెడ్ రూమ్ మంజూరు అయినట్టు ఫేక్ లెటర్స్ అందించాడు.  విశ్వసనీయ సమాచారంతో… మాదాపూర్, కూకట్​పల్లి ఎస్.ఓ.టీ పోలీసులు దాడి చేసి అతడిని అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. జూన్​లో విజయవాడ హైవే టోల్ గేట్ దగ్గర ఎస్సైనంటూ ప్రశాంత్ ఐడీ కార్డును చూపెట్టడంతో భవానీపురం పోలీసులు అది నకిలీగా గుర్తించి అరెస్ట్ చేసినా… వక్రబుద్ధి చూపెడుతూ అమాయకుల నుండి వసూళ్లకు తెగబడ్డాడు. బాధితుల సంఖ్య పెరగ వచ్చునని, ఇప్పటికే రూ. 70 లక్షలకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతడిని రిమాండ్​కి తరలించారు. అతడి దగ్గర నుండి 8లక్షల నగదు, మహేంద్ర వెహికల్, లెనోవో లాప్టాప్, ఫేక్ లెటర్స్, సహా నకిలీ ఎస్సై ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంయుక్త ఆపరేషన్ లో పాల్గొన్న పోలీసులను సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ అభినందించారు.