సారథిన్యూస్, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా హైదరాబాద్ సహా ఏడు చోట్ల ఈనెల 25న నిర్వహించాల్సిన జాతీయ ఫార్మా విద్య, పరిశోధన సంస్థ (నైపర్) జేఈఈని వాయిదా వేశారు. ఈ పరీక్షను సెప్టెంబర్ 28న నిర్వహించనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ పరిశోధన సంస్థలు ఫార్మసీ విద్యలో పీజీ కోర్సులను అందిస్తున్నాయి.
సారథిన్యూస్, హైదరాబాద్: ఇంటర్మీడియట్ తెలుగు పాఠ్యప్రణాళికను తెలంగాణ ఇంటర్‌బోర్డు మార్చబోతున్నది. ఇందుకోసం నిపుణుల కమిటీని నియమించింది. తెలంగాణ పదాలు, సంస్కృతికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది(2020-21) ఫస్టియర్‌లో చేరబోయే విద్యార్థులకు ఈ కొత్త పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. 2021-22 విద్యా సంవత్సరానికి ద్వితీయ సంవత్సరంలోనూ కొత్త పాఠ్య ప్రణాళికతో పుస్తకాలు రూపొందుతాయి. తెలంగాణ రచయితలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఇంటర్‌బోర్డు వర్గాలు తెలిపాయి.
సారథి న్యూస్, హైదరాబాద్: గ్రూప్-2లో ఎంపికైన డిప్యూటీ తహసీల్దార్లకు (ప్రొబెషనరీ డిప్యూటీ తహసీల్దార్లు/డీటీలు) పోస్టింగ్‌లపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 259 మంది ఎంపిక కాగా 257 మంది మాత్రమే జాయినింగ్ ఆర్డర్లు సమర్పించారు. వీరిని రెండ్రోజుల్లో విధుల్లోకి తీసుకోవాలంటూ ఉమ్మడి జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం ఆదేశించారు. 2016లో ఎంపికైన వీరికి గతేడాది నవంబరులో ప్రభుత్వం అపాయింటుమెంట్లు కల్పించింది. పోస్టింగ్‌ల కోసం వీరంతా ఎదురుచూస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ ప్రధాన […]
టాలీవుడ్లో హీరో సత్య దేవ్ కి అభిమానులు ఎక్కువే. చేసిన సినిమాలు తక్కువే అయినా తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు హీరో సత్యదేవ్. అయితే రీసెంట్గా గోపీ గణేష్ దర్శకత్వంలో వచ్చిన ‘బ్లఫ్ మాస్టర్’ సినిమాను మెగాస్టార్ చిరంజీవి చూశారట. సినిమా నచ్చడంతో గోపీని, సత్యదేవుడిని ప్రత్యేకంగా ఇంటికి పిలిచి మాట్లాడారట. చిరంజీవిని కలిసి ముచ్చటించిన గోల్డెన్ మూమెంట్స్‌ను తను ఎప్పటికీ మరిచిపోలేనని, తన సంతోషాన్ని ట్విటర్ ద్వారా తెలుపుతూ.. ‘చిరంజీవి అంటే నాకు చిన్నప్పటి నుంచీ […]
మహిళామణుల వ్యాపారాలు కుదేలు ఎందరో మగువల ఆశయాలను చిదిమేసిన మహమ్మారి హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం సమాజంతో మనిషి చేసే పోరాటం కంటే గుర్తింపు కోసం అదే మనుషులతో మగువ చేసే పోరాటం చాలా గొప్పది. దానికి మనోధైర్యం మాత్రమే చాలదు. సమాజం సమ్మతించాలి. కుటుంబం సహకరించాలి. అప్పుడు ఆ మగువ అడుగు ముందుకు వేయగలదు. తనను తాను ఓ శక్తిగా నిరూపించుకోగలదు. తీరా ఏ కారణం చేతైనా తాను వేసిన అడుగుల్లో తడబాటో, పొరబాటో, గ్రహపాటో […]
సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వెంకటాపురం(నుగూరు) మండలంలోని సూరవీడు కాలనీ వద్ద బుధవారం మధ్యాహ్నం సమయంలో వెంకటాపురం నుంచి భద్రాచలం వెళ్లే రహదారిపై మావోయిస్టుల కరపత్రాలు వెలిశాయి. దీనితో వచ్చిపోయే ప్రయాణికులు పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ‘కరోనాతో ప్రాణాపాయస్థితిలో ఉన్న వరవరరావు, వికలాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు 12 మందిని ప్రభుత్వం బేషరతుగా విడుదల చేయాలని, ఉఫా, ఎన్ఐఏ కేసులను ఎత్తివేయాలని, అడవుల నుంచి గ్రేహౌండ్స్ బలగాలను ఉపసంహరించాలని, జులై 25న తెలంగాణ […]