సారథిన్యూస్, రామడుగు: వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని అలాగైతేనే అధికదిగుబడి సాధ్యమవుతుందని ఆత్మ పీడీ ప్రియదర్శిని పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కొరటిపల్లిలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన లో భాగంగా సాగునీటి విధానం, నీటి పొదుపు తదితర అంశాలపై రైతులకు శిక్షణాకార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ మన్నే దర్శన్ రావు, శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి, ఆత్మ పీడీ […]
ఇండస్ట్రీకి వచ్చి పన్నెండేండ్లయినా కాజల్ అగర్వాల్ స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. మూడు పదుల వయసులో కుర్ర హీరోయిన్స్‌కు గట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ భామ ఓ భారీ చాన్స్ కొట్టేసిందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘క్వాంటికో’ వెబ్ సిరీస్ ఇండియన్ రీమేక్ లో కాజల్ అగర్వాల్ నటించబోతోందట. ఈ వెబ్ సిరీస్ ని నెట్ ఫ్లిక్స్ వారు తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. పాన్ఇండియాలో ఫేమస్ అవ్వొచ్చనే ఆలోచనతో కాజల్ ఈ […]
బాలీవుడ్లో భారీ విజయాన్ని అందుకున్న ‘క్వీన్’ చిత్రాన్ని దక్షిణాదిన నాలుగు భాషల్లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కంగనాకు ఎంతో పేరుతెచ్చి పెట్టింది. ఆమె జాతీయ అవార్డును అందుకున్నది. కాగా తెలుగు రీమేక్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా.. తమిళంలో కాజల్ నటించింది. కాగా ఆర్థికసమస్యతో ఈ చిత్రం విడుదల ఆగిపోయింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలో చిత్రీకరణ పూర్తిచేసుకున్నప్పటికీ విడుదలకు నోచుకోలేదు. అయితే ప్రస్తుతం ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాతలు […]
సంచలన దర్శకుడు ఆర్జీవీ పవన్‌కల్యాణ్‌పై ‘పవర్‌స్టార్’ పేరుతో ఓ వ్యంగ్య చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి బుధవారం ఓ ట్రైలర్‌ను విడుదల చేశాడు. ఈ ట్రైలర్ ఓ రేంజ్లో వైరల్ అవుతుంది. దీంతో పవన్‌ఫ్యాన్స్ రాంగోపాల్‌వర్మపై పిచ్చికోపంతో ఉన్నారు. కానీ తమ కోపాన్ని ఎలా ప్రకటించాలో తెలియడం లేదు. వారు ఎంత రెచ్చిపోతే ఆర్జీవీకి అంత లాభం. అతడికి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చిన వారవుతారు. దీంతో కొంతకాలంగా వారు మింగలేక కక్కలేక తెగ ఆయాస […]
సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ప్రముఖ కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్య సేవలు మరువలేనివని రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కొనియాడారు. బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో కృష్ణమాచార్య జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. నిజాం నవాబుకు వ్యతిరేకంగా గళమెత్తిన గొప్ప యోధుడు దాశరథి అని కొనియాడారు.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం తెలంగాణ సాహితీ సౌరభం దాశరథి కృష్ణమాచార్యులు జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆశయాలను కొనస్తామన్నారు.
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రాంగోపాల్‌వర్మ.. తాజాగా విడుదల చేసిన ‘పవర్‌స్టార్ ’ యూట్యూబ్‌లో ఓ రేంజ్లో వైరల్ అవుతోంది. దీనిపై అతడు ఊహించినట్టుగానే వివాదం రాజుకున్నది. కొంతకాలంగా కామ్‌గా ఉన్న పవన్‌కల్యాణ్ అభిమానులు ట్రైలర్ రిలీజ్కాగానే రెచ్చిపోయారు. సోషల్‌మీడియాలో ఆర్జీవీపై కామెంట్లు మెదలు పెట్టారు. మరోవైపు పవన్‌కల్యాన్‌ను అభిమానించే యువనటుడు నిఖిల్ ‘శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ మహాశిఖరం తలతిప్పి చూడదు. మీకు అర్థమైందిగా’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ […]
ఆర్జీవీకి కౌంటర్‌గా పవన్‌కల్యాణ్ అభిమాని, బిగ్‌బాస్ ఫేం నూతన్‌నాయుడు పరాన్నజీవి అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ పాత్ర కోసం అతడు వివాదస్పద నటి శ్రీరెడ్డిని అప్రోచ్ అయ్యాడట. అందుకు ఆమె నో చెప్పినట్టు సమాచారం. శ్రీరెడ్డి అంతకుముందే పలుమార్లు పవన్‌కల్యాణ్‌పై నోరుపారేసుకున్న విషయం తెలిసిందే. దీంతో పవన్‌కల్యాన్ అభిమానులు ఆమెపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పరాన్నజీవి చిత్రంలోనూ తన పాత్ర నిడివి చాలా తక్కువగా ఉండటంతోనే ఆమె నటించేందుకు ఒప్పుకోలేదని టాక్. కాగా […]