తిరువనంతపురం: కరోనాను కట్టడి చేసేందుకు కేరళలో విధించిన రూల్స్ మరో ఏడాది పాటు కొనసాగనున్నాయి. మాస్కులు వాడడం, సోషల్ డిస్టెంసింగ్ ఏడాది పాటు కచ్చితంగా పాటించాలని కేరళ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు పెళ్లిలు, ఫంక్షన్లకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పింది. సమావేశాలు, ధర్నాలు, ఊరేగింపులు లాంటి వాటిపై సంవత్సరం పాటు నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. షాపులు, మాల్స్‌లో ఒక్కసారి కేవలం 20 మందిని మాత్రమే అనుమతించాలని, షాపు […]
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో 8 మంది పోలీసులపై కాల్పులు జరిపిన కేసుకు సంబంధించి పోలీసులు వికాస్ దుబే అనుచరుడు దయాశంకర్ అగ్నిహోత్రిని అరెస్టు చేసి విచారించారు. అతడిని విచారించిన పోలీసులకు కేసుకు సంబంధించి కీలక విషయాలు తెలిశాయి. వికాస్ దుబేను అరెస్టు చేసేందుకు పోలీసులు వస్తున్నారని చౌబేపూర్ పోలీస్‌స్టేషన్ నుంచి ఒక పోలీసు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని అతను చెప్పాడు. దీంతో అప్రమత్తమైన దుబే తన అనుచరుల్లో దాదాపు 25మందికి సమాచారమిచ్చి కాల్పులకు పాల్పడేలా చేశారని అన్నారు. ఘటన జరిగిన […]
జెనీవా: కరోనా పేషంట్ల ట్రీట్‌మెంట్‌కు ఉపయోగిస్తున్న యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోర్వోకిన్ ట్యాబ్లెట్స్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్రయల్స్‌ను నిలిపేసింది. ఆ డ్రగ్ కరోనాను పూర్తిగా నయం చేయడంలో విఫలమైందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో ఒక స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పాటు లోపినవిర్, రిటోనవిర్ డ్రగ్స్ క్లినికల్ ట్రయల్స్‌ను కూడా ఆపివేసినట్లు సంస్థల వెల్లడించింది. ఈ డ్రగ్స్ మరణాలు తగ్గించడంలో ఎలాంటి ప్రభావం చూపలేదని చెప్పింది.
కోల్‌కతా: ‘ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఓ కాలనాగు. ఆమె ఆర్థికవ్యవస్థను నాశనం చేశారు’ అంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇలాంటి పనికిరాని ఆర్థికమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. పాము కాటుకు మనునుషులు చనిపోయినట్లుగా, నిర్మల ఆర్థిక వ్యవహారాల కారణంగా సామాన్య జనం చనిపోతున్నారని మండిపడ్డారు. పెంట్రోల్ ధరల పెంపుకు నిరసనగా ఆదివారం బంకురా జిల్లాలో ఏర్పాటుచేసిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థికమంత్రి పదవికి నిర్మల వెంటనే […]
సారథి న్యూస్, హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గాయకుడు దినకర్ ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించిన తబలా విద్వాంసుడు జైపాల్ రాజ్ ఆదివారం జూబ్లీహిల్స్ లో తన కుమారుడు ఎబినేజర్ పాల్ తో కలిసి మొక్కలు నాటారు. అందరం ఆరోగ్యంగా ఉండాలంటేనే మొక్కలను నాటాలన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్, గ్రీన్ ఇండియా చాలెంజ్ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా […]
సారథి న్యూస్, నర్సాపూర్: అడపాదడపా చినుకులు, అప్పుడప్పుడు భారీవర్షాలు కురవడంతో ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులు చేలల్లో కలుపుతీత పనులతో పాటు వరి నాట్లలో నిమగ్నమయ్యారు. నర్సాపూర్మండలంలో భౌగోళిక విస్తీర్ణం 22,496 ఎకరాలు ఉండగా, ఇందులో వ్యవసాయ భూమి 11,576 ఎకరాలు, సాగుకు వీలులేని భూమి 10,920 ఎకరాలు ఉంది. అందులో భాగంగానే సన్న చిన్న కారు రైతులు కౌడిపల్లి లో1700 , కొల్చారంలో 11057మంది ఉన్నారు. గతేడాది వరి 7,426 ఎకరాలు సాగు […]
వ్యక్తి జన్మించే సమయంలో సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరలో ఉన్నాడో దాన్నే జన్మ నక్షత్రంగా జ్యోతిష్యశాస్త్రంగా చెబుతుంటారు. జీవన గమనంలో వచ్చే అన్ని మలుపులను దీని ఆధారంగా చెబుతారు. ఈ శాస్త్రంలో జీవితంలో సంభవించే సమస్యలు ఎలా వస్తాయో, వాటికి ఏ గ్రహాలకు శాంతులు చేయాలో ఈ శాస్త్రంలో పరిహారాలు సూచించారు. దానికనుగుణంగా మనం నక్షత్రశాంతులు, గ్రహశాంతులు జరిపించుకోవాల్సి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలోని 27 నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు, అధిదేవతలు ఉన్నట్లుగానే వాటికి సంబంధించిన వృక్షాలు కూడా […]
దమిళ అగ్రనటుడు, తళపతి విజయ్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. తాజాగా ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతి ఇచ్చినప్పటికీ కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో నటులెవరూ షూటింగ్లలో పాల్గొనడం లేదు. విజయ్ ప్రస్తుతం మాస్టర్ సినిమా చేస్తున్నాడు. లాక్‌డౌన్‌తో ఈ చిత్ర షూటింగ్ నిలిపివేశారు. ఇదిలా ఉండగా హీరో విజయ్ ఇంటికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. బాంబులతో ఇంటిని పేల్చేస్తామంటూ కొందరు ఫోన్ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన ఇంటికి […]