న్యూఢిల్లీ: లాక్ డౌన్‌తో ఇంకా ఔట్‌డోర్ ప్రాక్టీస్ మొదలుపెట్టని టీమిండియా ఫిట్నెస్ కాపాడుకోవడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తోంది. కొంత మంది ఇంట్లో ఉన్న పెరట్లో ప్రాక్టీస్ చేస్తుంటే.. పేసర్ మహ్మద్ షమీ మాత్రం కాస్త భిన్నంగా ప్రయత్నించాడు. తన వేగాన్ని పెంచుకోవడం కోసం పెంపుడు శునకంతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఈ పరుగులో శునకం కంటే షమీని ఎక్కువగా పరుగెత్తినట్లు కనిపించింది.
లివర్‌పూల్: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మూడు దశాబ్దాల తర్వాత లివర్‌పూల్ తమ కల నెరవేర్చుకుంది. ప్రతిష్టాత్మక ఇంగ్లిష్ ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ సీజన్లో 31 మ్యాచ్‌ల్లో 28 విజయాలు, 2 డ్రాలతో 86 పాయింట్లు సాధించిన ఆ జట్టు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఉన్న మాంచెస్టర్ టీమ్.. తాజాగా జరిగిన మ్యాచ్‌లో 1–2 తేడాతో చెల్సీ చేతిలో ఓడిపోవడంతో లివర్‌పూల్‌కు టైటిల్ ఖాయమైంది. మరో ఏడు మ్యాచ్‌లు […]
న్యూఢిల్లీ: 2008 ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తనను చెంప దెబ్బ కొట్టిన ఘటనలో హర్భజన్‌పై నిషేధం వద్దని వేడుకున్నానని మాజీ స్టార్ పేసర్ శ్రీశాంత్ అన్నాడు. ఆ వివాదానికి అంతటితో ముగింపు పలకాలని భావించినట్లు చెప్పాడు. ‘ఆ మ్యాచ్‌లో సచిన్ ఉన్న జట్టులోనే హర్భజన్ ఉన్నాడు. నా చెంపపై కొట్టిన తర్వాత మాస్టర్ సీరియస్ అవుతూ వివాదాన్ని సద్దుమణిగేలా చేశాడు. అందుకు మాస్టర్‌కు థ్యాంక్స్ చెప్పాలి. ఆ రోజు రాత్రి మేమంతా కలిసి డిన్నర్ చేశాం. కానీ […]
బెల్గ్రేడ్: ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ నిర్వహించిన అడ్రియన్ టూర్ ఎగ్జిబిషన్ టోర్నీలో ఆడిన ఆటగాళ్లలో కరోనా బాధితులు పెరిగిపోతున్నారు. తాజాగా క్రొయేషియా టెన్నిస్ స్టార్ గ్రేట్ గొరాన్ ఇవాని సెవిచ్కు కూడా కరోనా సోకింది. పదిరోజుల క్రితం రెండుసార్లు పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. కానీ మూడోసారి నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందని ఇవానిసెవిచ్ వెల్లడించాడు. లక్షణాలు లేకపోయినా తాను వైరస్ బారినపడ్డానని చెప్పాడు. తనతో సన్నిహితంగా ఉన్న వారంతా ముందు జాగ్రత్త చర్యగా పరీక్షలు చేయించుకోవాలని […]
టోక్యో: కరోనా విజృంభిస్తున్న తరుణంలో మాస్క్ లేనిది అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో జపాన్‌కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ వినూత్నంగా ఆలోచించి ‘స్మార్ట్ మాస్కు’ తయారుచేసింది. ఇంటర్నెట్కు, మనం వాడే స్మార్ట్ ఫోన్‌కు ఈ మాస్క్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. ఈ మాస్కును బ్లూటూత్ ద్వారా మొబైల్ యాప్‌తో కనెక్ట్ చేసుకోవచ్చని డోనట్ రోబోటిక్స్ సీఈవో తైసుకే ఓనో తెలిపారు. ఈ సీ-మాస్క్ ద్వారా కాల్స్ చేయొచ్చని, మెసేజ్‌లను కూడా పంపించుకోవచ్చన్నారు. జపాన్ భాష […]
న్యూఢిల్లీ: వన్డేల్లో ఫలితం తేల్చడానికి సూపర్ ఓవర్ ఎందుకు వేయించాలని న్యూజిలాండ్ సీనియర్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ అభిప్రాయపడ్డాడు. ఫైనల్ మ్యాచ్ టై అయితే ట్రోఫీని ఇరుజట్లకు పంచండని సూచించాడు. వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకుని టేలర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో సూపర్ ఓవర్ ఎందుకో నాకు అర్థం కావడం లేదు. మ్యాచ్ టై అయితే దానిని టైగానే పరిగణించాలి. వేగంగా పరిస్థితులు మారే టీ20ల్లో ఇది కుదరకపోవచ్చు. […]
కరాచీ: తొలిసారి చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలాడు.. తాను స్వయంగా వెళ్లి చేయించుకున్న టెస్టుల్లోనూ నెగెటివ్‌గా వచ్చిందన్నాడు.. మూడోసారి జరిపిన పరీక్షలో మళ్లీ పాజిటివ్ అంటున్నారు పాక్ బ్యాట్స్‌మెన్ హఫీజ్. కరోనా వ్యవహారంలో ఎక్కడా స్పష్టత రావడం లేదు. పీసీబీ తొలిసారి నిర్వహించిన టెస్టుల్లో మొత్తం పది మంది క్రికెటర్లకు కరోనా సోకినట్లు వైద్య బృందాలు వెల్లడించాయి. అందులో హఫీజ్ కూడా ఉన్నాడు. అయితే ఈ ఫలితాన్ని మరోసారి ధ్రువీకరించుకోవాలనే ఉద్దేశంతో హఫీజ్ స్వయంగా టెస్టు […]
న్యూఢిల్లీ: ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఆడడమే తన కెరీర్లో పెద్దమలుపు అని టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ అన్నాడు. డెత్ ఓవర్లలో ఒత్తిడిని జయించడం నేర్చుకున్నానని చెప్పాడు. ‘యార్కర్లు సంధించే నైపుణ్యం నాకు ఎప్పుడూ ఉంది. మధ్యలో కాస్త తగ్గినా మళ్లీ నేర్చుకున్నా. సన్ రైజర్స్ హైదరాబాద్ కు మారిన తర్వాత ఇన్నింగ్స్ మొదట, చివర బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది. 2014లో ఆ ఫ్రాంచైజీ తరఫున 14 మ్యాచ్‌లు ఆడాను. దీంతో స్లాగ్ ఓవర్లలో […]