సారథి న్యూస్, హుస్నాబాద్: బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధానిపాములపర్తి వెంకట నరసింహారావు (పీవీ నరసింహారావు) జన్మించి జూన్ 28వ తేదీ నాటికి వందేళ్లు పూర్తి కావడంతో కుటుంబసభ్యులు శతజయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి వంగర గ్రామంలో 1921 జూన్28న ఆయన జన్మించారు. ఆయన తప్పటడుగుల వేసిన నుంచి యవ్వనం వరకు ఉన్న తన ఇంటినే మ్యూజియంగా చేయాలని పీవీ తనయుడు ప్రభాకర్ రావు సంకల్పించారు. తాను 1952లో నిర్మించిన ఇంట్లో […]
న్యూఢిల్లీ: కరోనా పేషంట్లకు ట్రీట్‌మెంట్ చేసేందుకు లోకాస్ట్ స్టిరాయిడ్ డ్రగ్ డెక్సామెథసోన్ ను వాడేందుకు కేంద్రం అనుమతిచ్చింది. ఈ మేరకు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ రివైజ్‌డ్ వర్షన్ ఆఫ్ ‘క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రొటోకాల్: కోవిడ్ –19’ డాక్యుమెంట్‌ను పబ్లిష్ చేసింది. వ్యాధి, తీవ్ర లక్షణాలతో బాధపడేవారికి ప్రాణవాయువు అవసరం, అధికా ఇన్‌ఫ్లమేటరీ (మంట) ఉన్నవారికి డెక్సామెథసోన్ వాడొచ్చని తెలిపింది. డెక్సామెథసోన్ స్టెరాయిడ్‌ను 1960 నుంచి ఉపయోగిస్తున్నారు. ఇన్‌ఫ్లమేషన్ లక్షణాలను తగ్గించేందుకు, ఇన్‌ఫ్లమేషన్ వల్ల వచ్చే వ్యాధులు, కొన్ని […]
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలతో పోలిస్తే మనం కరోనా మహమ్మారిని నియంత్రణలో ముందున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కరోనా వైరస్ కట్టడి కోసం మనం గట్టిగా పోరాడుతున్నామని అన్నారు. శనివారం రెవరండ్. జోసెఫ్ మార్‌తోనా 90వ జయంతిని పురస్కరించుకుని వీడియో కాన్పరెన్స్ ద్వారా మోడీ మట్లాడారు. మన దేశంలో రికవరీ రేటు రోజు రోజుకు పెరుగుతోందని, ఇటలీ కంటే మన దేశంలో మరణాల రేటు చాలా తక్కువ అని చెప్పారు. భారత్ లాంటి దేశాల్లో కరోనా ఇంపాక్ట్ […]
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేట్‌ను మనీలాండరింగ్ కేసులో విచారించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఈడీ బృందం శనివారం ఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లింది. సందేశారా సోదరుల రూ.వేలకోట్ల కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆయన ప్రశ్నించనున్నామని ఈడీ అధికారులు చెప్పారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నట్లు చెప్పారు. విచారణకు హాజరు కావాలని ఈడీ ఇప్పటికే రెండు సార్లు సమన్లు జారీ చేశారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో వృద్ధుడైన తాను […]
జైపూర్: కరోనాకు మందు కనిపెట్టామని, దాని ద్వారా వంద శాతం రోగం నమయమవుతుందని చెబుతూ యోగా గరువు రామ్‌దేవ్ బాబా, పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ, మరో ముగ్గురిపై రాజస్థాన్‌లో కేసు నమోదైంది. వాళ్లంతా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాజస్థాన్ జైపూర్‌లోని జ్యోగినగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. యోగా గురువు రామ్‌దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ, నిమ్స్ చైర్మన్ డాక్టర్ బల్బీర్ సింగ్ తొమార్, డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ తొమార్, సైంటిస్ట్ అనురాగ్ వర్షణేపై […]
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద కాస్మొటిక్స్ కంపెనీల్లో ఒకటైన లోరియల్ తన ప్రొడక్ట్స్నుంచి ‘వైట్’, ‘ఫెయిర్’, ‘లైట్’ పదాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మరో అతిపెద్ద కాస్మొటిక్స్ కంపెనీ యునీలివర్ ఇప్పటికే ఆ విషయాన్ని ప్రకటించింది. కాగా ఇప్పుడు లోరియల్ కూడా ఈ నిర్ణయం తీసుకుందని కంపెనీ అధికార ప్రతినిధి ప్రకటించారు. యునీలివర్, లోరియల్ రెండు అనేక ఆసియా, ఆఫ్రికన్, కరేబియన్ దేశాల్లో ఉపయోగించే వైటనింగ్ క్రీమ్స్‌లో టాప్ కంపెనీలు. ప్రంపచ వ్యాప్తంగా రేషియల్ డిస్క్రిమినేషన్‌పై జరుగుతున్న చర్చ నేపథ్యంలో […]
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. 24 గంటల్లో దాదాపు 18,552 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్రం హెల్త్ బులెటెన్ రిలీజ్ చేసింది. ఒక రోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే మొదటిసారి అని అధికారులు చెప్పారు. దీంతో ఇప్పుడు మొత్తం కేసుల సంఖ్య 5,08,953కి చేరింది. 24 గంటల్లో 384 మంది చనిపోయారు. చనిపోయిన వారి సంఖ్య 15,985కు చేరింది. మన దేశంలో జనవరిలో మొదటి కేసు నమోదుకాగా, 149 రోజుల్లో ఐదులక్షల కేసులు […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 796 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు శనివారం హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. 24 గంటల్లో 24,458 టెస్టులు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 12,285కి చేరింది. కాగా ఈ రోజు నమోదైన కేసుల్లో విదేశాల నుంచి వచ్చిన ఐదుగురికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 51 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. 24 గంటల్లో కృష్ణా […]