న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ ధరలు వరుసగా 15వ రోజు పెరిగాయి. ఆదివారం డీజిల్‌పై 0.60 పైసలు, డీజిల్‌పై 0.35 పైసలు పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. దీంతో వారం రోజుల్లో పెట్రోల్‌పై రూ.8.88, డీజిల్‌పై రూ.7.97 మేర పెరిగింది. చమురు మార్కెటింగ్ సంస్థల ధర నోటిఫికేషన్ ప్రకారం ఢిల్లీలో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.79.23కి చేరగా.. డీజిల్ ధర రూ.78.27కి చేరింది. ఢిల్లీలో 2018లో ఇంత స్థాయిలో ధరలు పెరగిగాయని విశ్లేషకులు చెప్పారు. 2018 అక్టోబర్‌లో […]
న్యూఢిల్లీ: గాల్వాన్ గొడవ జరిగినప్పుడు మన వాళ్లు 100 మంది ఉంటే చైనావాళ్లు మాత్రం 300 నుంచి 350 మంది ఉన్నారట. అయినా కూడా మనవాళ్లు ఎక్కడా ధైర్యాన్ని కోల్పోలేదు. చైనా వాళ్లను ధీటుగా ఎదుర్కొన్నారు. అసలు ఏం జరిగిందో ఒక వ్యక్తి ఏఎన్‌ఐ వార్తా సంస్థకు ఈ విధంగా వివరించారు. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత భూభాగంలో పెట్రోలింగ్ పాయింట్ – 14 వద్ద చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పీఎల్‌ఏ) టెంట్ […]
న్యూఢిల్లీ: ప్రతి రోజు యోగా చేసేవారికి కరోనా వచ్చే అవకాశం చాలా తక్కువ అని ఆయుష్ మినిస్టర్ శ్రీపాద నాయక్ అన్నారు. ఆదివారం యోగాడే పురస్కరించుకుని పీటీఐ వార్త సంస్థతో మాట్లాడిన మంత్రి ఈ విషయాలు చెప్పారు. ‘మోడీ నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా యోగాకు ప్రాచుర్యం లభించిందని, అది కరోనాతో పోరాడేందుకు బాగా ఉపయోగపడిందని నేను కచ్చితంగా చెప్పగలను. యోగా చేసే వాళ్లు కరోనా బారిన పడటటం చాలా తక్కువ’ అని మంత్రి చెప్పారు. యోగా ఇమ్యూనిటీని పెంచుతుందని, […]
సారథిన్యూస్, చొప్పదండి / ఖమ్మం: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరువలేనివని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగించాలని కోరారు. ఖమ్మం జిల్లాకేంద్రంలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు తదితరులు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి నివాళి […]
సారథిన్యూస్, హైదరాబాద్: కరోనా రోగులకు ఉపశమనం కలిగించేందుకు హెటిరో ఔషధ సంస్థ మరో మందును అందుబాటులోకి తెచ్చింది. శనివారం గ్లెన్మార్క్ ఫార్మా కంపెనీ ఫాబిఫ్లూ పేరుతో ఓ మందును విడుదల చేసింది. తక్కువ రోగ లక్షణాలు ఉన్నవారికి ఈ మెడిసిన్ పనిచేస్తుందని వెల్లడించింది. కాగా తాజాగా హైదరాబాద్‌కు చెందిన హెటిరో ఫార్మా కంపెనీ కరోనా వైరస్‌కు జనరిక్ మందును కనిపెట్టినట్టు ప్రకటించింది. ‘కోవిఫర్’ పేరుతో ఈ మందును తయారు చేసినట్టు తెలిపింది. దీనికి డీసీజీఐ అనుమతి కూడా […]
సారథిన్యూస్, హైదరాబాద్: ఇండియా, చైనా సరిహద్దులో కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గాల్వాన్‌లోయలో ఇరుదేశాల సైన్యాలు ఘర్షణకు దిగడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. కాగా గాల్వాన్ ప్రాంతంలో చైనాకు చెక్‌పెట్టేందుకు భారత్ కీలక అడుగు వేసింది. గల్వాన్ నదిపై భారత సైనిక ఇంజినీర్లు వంతెన నిర్మాణం పూర్తి చేశారు. 60 మీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జిపై నుంచి ఆర్మీ వాహనాలు ఈజీగా నదిని దాటుతాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. గల్వాన్ నదిపై […]
ఢిల్లీ: కుటుంబ సమస్యలతో ఓ స్పెషల్ బ్రాంచ్ పోలీస్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాను మంచి భర్తగా, మంచి కుటుంబసభ్యుడిగా ఉండలేకపోతున్నానని చనిపోయేముందు ఓ సెల్ఫీ వీడియోను తీసుకున్నాడు. హర్యానాలోని జాజర్‌కు చెందిన సందీప్ కుమార్ వసంత విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కుటుంబ సమస్యలతో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. తోటి సిబ్బంది గమనించి ఆస్పత్రికి తరలించే లోపే తుదిశ్వాస విడిచాడు. సందీప్ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ […]
సారథిన్యూస్, హైదరాబాద్; ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో మొదలైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వారు పేర్కొన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, […]