Breaking News

Day: June 15, 2020

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా

సారథిన్యూస్​, గోదావరిఖని: సెల్ఫీ సరదా ఓ విద్యార్థి ప్రాణం తీసింది. గోదావరిఖనికి చెందిన యశ్వంత్(22) ఓ కళాశాలలో పాల్​టెక్నిక్​ డిప్లమో చదువుతున్నాడు. సోమవారం సరదాగా పెద్దపల్లి జిల్లాలోని సబ్బితం జలపాతం వద్దకు వెళ్లాడు. అక్కడ సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.

Read More

మోదీపాలన.. జనరంజకం

సారథిన్యూస్​, రంగారెడ్డి: కేంద్రంలో నరేంద్రమోదీ పాలన జనరంజకంగా కొనసాగుతున్నదని బీజేపీ నేతలు పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటికీ మోదీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. నరేంద్రమోదీ పాలనను ప్రపంచవ్యాప్తంగా నేతలు ప్రశంసిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు, బోసు పల్లి ప్రతాప్, తుల నరసింహ గౌడ్, బచ్చిగళ్ళ రమేశ్​, నోముల కార్తీక్, మల్లెల ప్రేమ్ సాయి, నల్లవెల్లి నిరంజన్ రెడ్డి, విశాల్ గౌడ్, […]

Read More

ఆ విగ్రహాలు తీర్థంకరులవే

సారథి న్యూస్, గంగాధర: ఇటీవల కరీంనగర్​ జిల్లా, గంగాధర మండలం కోట్ల నర్సింహునిపల్లి గ్రామంలోని ఓ రైతు పొలంలో బయటపడ్డ విగ్రహాలు.. క్రీ.పూర్వం 8​​​-9 వ శతాబ్ధం కాలం నాటి ఒకటో తీర్థంకరుడు పార్శనాథుడు , 24 వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడివని పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. సోమవారం పురావస్తుశాఖ అధికారులు విగ్రహాలను పరిశీలించారు. ఈ ప్రాంతాన్ని రాష్ట్రకూటులు, వేములవాడ చాళక్యులు, కాకతీయులు పరిపాలించారని చెప్పారు. ఈ ప్రాంతంలో మరిన్ని పరిశోధనలు జరగవలిసి ఉన్నదని వారు అభిప్రాయపడ్డారు. […]

Read More
పెరిగిన విద్యుత్​ బిల్లులకు నిరసనగా ధర్నా చేస్తున్న బీజేపీ నేతలు

గుదిబండలా విద్యుత్​ బిల్లులు

సారథి న్యూస్​, భద్రాద్రి కొత్తగూడెం: పెరిగిన విద్యుత్​చార్జీలు ప్రజలకు గుదిబండలా మారాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ విమర్శించారు. సోమవారం కొత్తగూడెం పట్టణంలోని టీఎస్​ఎన్పీడీసీఎల్​ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కోనేరు మాట్లాడుతూ.. లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఆదాయం తగ్గి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు విద్యుత్​ బిల్లులు మరింత భారంగా మారాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిలుకూరి […]

Read More

ఇమ్యూనిటీ మాత్రల పంపిణీ

సారథిన్యూస్, చొప్పదండి: రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న వేళ కరీంనగర్​ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ మున్సిపల్​ సిబ్బందికి రోగనిరోధక శక్తి పెంపొందించే హోమియోపతి మాత్రలను పంపిణీ చేశారు. ఈ మందులతో రోగనిరోధక శక్తి పెరిగి.. కరోనా వచ్చే అవకాశం తగ్గుతుందని ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో హోమియోపతి డాక్టర్ అశోక్, సైకాలజిస్ట్​ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్​ వైస్ చైర్ పర్సన్ విజయ లక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి , మాజీ జెడ్పీటీసీ సంబన్న, ఎండీ జహీర్ […]

Read More

గండ్రజ్యోతి ఆకస్మిక తనిఖీ

సారథిన్యూస్​, వరంగల్​ రూరల్​: వరంగల్​ రూరల్​ జిల్లా జడ్పీచైర్​పర్సన్ గండ్ర జ్యోతి సోమవారం దామెర మండలంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె అధికారులతో మాట్లాడి.. మండలం లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యపనులను చేపట్టాలని కోరారు.

Read More

మరో ఎమ్మెల్యేకు కరోనా

సారథిన్యూస్​, నిజామాబాద్​ రూరల్​: కరోనా మహమ్మారి సామాన్య ప్రజానికంతోపాటు ప్రజాప్రతినిధులను వణికిస్తున్నది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి పాజిటివ్ రాగా తాజాగా నిజామాబాద్​ అర్బన్​ ఎమ్మెల్యే బిగాల గణేశ్​గుప్తాకు కరోనా వచ్చింది. గత రెండు రోజులుగా కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో ఎమ్మెల్యే పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది. బాజిరెడ్డి గోవర్ధన్‌తో ఎమ్మెల్యే బిగాల కాంటాక్ట్ అయినట్టు ప్రచారం సాగుతోంది. మరోవైపు ఇటీవల […]

Read More

అరకపట్టిన ఎమ్మెల్యే

సారథిన్యూస్, చొప్పదండి: ఆయనో ఎమ్మెల్యే.. కానీ వ్యవసాయం మీద మక్కువతో స్వయంగా తన పొలంలో దుక్కిదున్నారు. చొప్పదండి మండలం మంగలిపల్లి లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ స్వయంగా దుక్కి దున్ని ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతు ప్రభుత్వం కొనసాగుతున్నదని చెప్పారు.

Read More