Breaking News

Day: June 12, 2020

నాణ్యమైన బంతి అయితే ఓకే

న్యూఢిల్లీ: బంతి నాణ్యంగా ఉంటే బౌలర్లు స్వింగ్ రాబట్టొచ్చని డ్యూక్స్ బంతుల తయారీ సంస్థ యజమాని దిలీప్ జజోడియా చెప్పాడు. అప్పుడు బంతి రంగు కోసం ఉమ్మి వాడాల్సిన పనిలేదన్నాడు. ‘బంతి ఆకారం దెబ్బతిన్నంత వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తొందరగా ఆకారం కోల్పోయే కుకా బుర్రా, ఎస్జీ బంతులు వాడే భారత్, ఆస్ట్రేలియా మాత్రమే ఉమ్మికి ప్రత్యామ్నాయం కోరుతున్నాయి. స్వింగ్ రాబట్టాలంటే బంతికి మెరుపు మాత్రమే సరిపోదు. గట్టిదనం, ఆకారం, తగిన సీమ్ ఉండాలి. బంతిని […]

Read More
RAMAYAMPETA1

రామాయంపేటలో ఒకరికి కరోనా!

సారథి న్యూస్, రామాయంపేట: హైదరాబాద్​కే పరిమితమైందనుకున్న కరోనా క్రమంగా మారుమూల పట్టణాలకు విస్తరిస్తున్నది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మెదక్​ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన ఓ వ్యాపారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో పట్టణంలో ఆంక్షలు విధించారు. కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తి ఇటీవల హైదరాబాద్​లో ఓ విందుకు హాజరైనట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

Read More

కొత్త మేనేజ్​మెంట్​తో లాభమే

కరాచీ: కొత్త మేనేజ్​మెంట్​ రాకతో పాక్ జట్టు కొత్తగా కనిపిస్తోందని స్పిన్ కన్సల్టెంట్ ముస్తాక్ అహ్మద్ అన్నాడు. తనతో పాటు చీఫ్ కోచ్ మిస్బా, బ్యాటింగ్ కోచ్ యూనిస్ ఖాన్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ రాక టీమ్​కు మరింత బలం చేకూరుస్తుందన్నాడు. అయితే కొత్త ప్లేయింగ్ కండీషన్స్​లో ఆడడానికి ఆటగాళ్లకు కొంత సమయం పడుతుందన్నాడు. ‘కొత్త అలవాట్లను క్రమంగా అలవర్చుకోవాలి. ఒక్కసారే మార్పు రాదు. సిరీస్​కు చాలా ముందే మేం ఇంగ్లండ్ వెళ్తాం. కాబట్టి అక్కడే […]

Read More

అది మా బాధ్యత

లండన్‌: కరోనా పరిస్థితులు ఎలా ఉన్నా.. క్రికెట్​ను సాధారణ స్థితికి తీసుకు రావాల్సిన బాధ్యత తమపై కూడా ఉందని వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ అన్నాడు. కేవలం డబ్బులు, ప్రజాదరణ కోసం తాము ఇక్కడికి రాలేదని స్పష్టం చేశాడు. ‘లాక్​డౌన్​తో ఎక్కడి వాళ్లు అక్కడే నిలిచిపోయారు. క్రికెట్​ లేకపోవడంతో చాలా మంది అభిమానులు బాధపడుతున్నారు. కరోనా తగ్గుతుందని ఎదురుచూసే పరిస్థితి ఇప్పుడు లేదు. వైరస్ ఎప్పుడు అదుపులోకి వస్తుందో తెలియదు. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే క్రికెట్​ను […]

Read More

శ్రీలంక టూర్​ క్యాన్సిల్​

న్యూఢిల్లీ: శ్రీలంకలో టీమిండియా పర్యటన రద్దయింది. జూన్–జులైలో జరగాల్సిన ఈ పర్యటనలో ఇరుజట్లు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మ్యాచ్​లు ఆడడం సాధ్యం కాదని ఇరుదేశాల బోర్డులు ప్రకటించాయి. అయితే ఎఫ్టీపీ ప్రకారం ఆడాల్సిన సిరీస్​లను భవిష్యత్​లో అవకాశం వస్తే ఆడతామని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అన్నాడు. ‘జూన్‌, జులైలో జరగాల్సిన లంక టూర్​ సాధ్యం కాదు. ఈ విషయాన్ని లంక బోర్డుకు కూడా చెప్పాం. ప్రస్తుతం […]

Read More

క్రీడలు ఎడ్యుకేషన్​లో భాగమే

ముంబై: ఇక నుంచి క్రీడలు కూడా చదువులో భాగంగా ఉంటాయని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. వీటిని అదనపు పాఠ్యాంశాలుగా భావించకూడదన్నారు. ‘దేశంలో తీసుకొస్తున్న కొత్త విద్యాచట్టంలో ఈ విధానమే ఉంటుంది. చదువు, క్రీడలు వేర్వేరు కావన్నది నా అభిప్రాయం. క్రీడలను అప్షనల్ సబ్జెక్ట్​గా పరిగణించవద్దు. అది కూడా చదువులో భాగమే. మా విద్య విధానాన్ని ఇంకా అమల్లోకి తీసుకురాలేదు. వీలైనంత త్వరగా దానిని తీసుకొస్తాం’ అని రిజిజు పేర్కొన్నారు. జాతీయ క్రీడా విద్యా […]

Read More

ఐపీఎల్​కు మేం రెడీ

ముంబై: ఓవైపు కరోనా మహమ్మారి భయపెడుతున్నా.. ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించడానికి బీసీసీఐ సిద్ధమవుతోంది. టీ20 ప్రపంచకప్ వాయిదా పడుతుందని వస్తున్న వార్తల నేపథ్యంలో.. తాము ఐపీఎల్​కు రెడీగా ఉన్నామని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సంకేతాలు ఇచ్చాడు. ఈ మేరకు రాష్ట్ర సంఘాలకు లేఖ రాశాడు. అభిమానులను అనుమతించకుండా, ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్​లను నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నాడు. త్వరలోనే దీనిపై పూర్తిస్థాయి నిర్ణయం తీసుకుంటామని దాదా తెలిపాడు. ‘ఈ ఏడాది ఐపీఎల్ కోసం బీసీసీఐ అన్ని […]

Read More

అచ్చెన్నాయుడు అరెస్ట్

సారథి న్యూస్​, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్​ మాజీమంత్రి, శాసనసభ ప్రతిపక్ష ఉపనేత, టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో శుక్రవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వేకువజామునే గ్రామానికి విజయవాడ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చారు. ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకుని ప్రత్యేక బస్సులో విజయవాడకు తరలించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయనపై ఈఎస్​ఐ నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు ఉన్నాయి. అచ్చెన్నాయుడి అరెస్ట్​ నేపథ్యంలో […]

Read More