Breaking News

Day: June 7, 2020

జీహెచ్​ఎంసీలో కరోనా పంజా

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో ఆదివారం 154 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్​ఎంసీ పరిధి నుంచే 132 కేసులు పాజిటివ్​గా నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 12, మేడ్చల్​లో 3, యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు, సిద్దిపేట, మహబూబాబాద్​, సంగారెడ్డి, నాగర్​కర్నూల్​, కరీంనగర్​ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇలా ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య 3,650 కు చేరింది. ఆదివారం ఒకే రోజు 14 మంది […]

Read More

ప్రతి ఇల్లూ శుభ్రంగా ఉండాలె

సారథి న్యూస్​, హైదరాబాద్: వానాకాలంలో సీజనల్​ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ప్రతి ఇల్లూ శుభ్రంగా ఉండాలని మంత్రి కేటీఆర్​ సూచించారు. ఆదివారం ఆయన హైదరాబాద్​లోని తన నివాసం ప్రగతి భవన్ ఆవరణలోని పూలకుండీల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముందుజాగ్రత్తలు తీసుకోవడమే మేలని మంత్రి కేటీఆర్​ సూచించారు.

Read More

ఢిల్లీ హాస్పిటల్స్‌లో స్థానికులకే ట్రీట్‌మెంట్‌

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ ను కేవలం స్థానికులకు మాత్రమే రిజర్వ్‌ చేశామని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీగా లేవనే విషయంపై గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ఆయన క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా ఢిల్లీ బోర్డర్లను తెరుస్తున్నందున బయటి రాష్ట్రాల వారు వచ్చే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సెంట్రల్‌ గవర్నమెంట్‌ పరిధిలోకి వచ్చే హాస్పిటల్స్‌లో ఇతర రాష్ట్రాల […]

Read More

తక్కువేమీ కాదు..

నటించినవి తక్కువ సినిమాలే అయినా బోల్డ్ యాక్టింగ్​తో అటు తమిళంలోనూ తెలుగులోనూ మంచి గుర్తింపు పొందింది అమలాపాల్. తెలుగులో రామచరణ్ ‘నాయక్’ , అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో’ మంచి క్రేజ్ వచ్చినా గ్లామర్, యాక్షన్ కలగలిసిన ఈ సుందరికి టాలీవుడ్ కంటే కోలీవుడ్​లోనే ఎక్కువ అభిమానులు ఉన్నారు. అందుకే ఎక్కువగా తమిళ సినిమాల్లోనే కనిపిస్తుంటుంది. గతేడాది రిలీజైన ‘ఆమె’ సినిమా కలెక్షన్ల పరంగా విజయం సాధించలేకపోయినా అమలా బోల్డ్ యాక్టింగ్​కు అమ్మాయిలంతా ఫిదా అయిపోయారు. కొద్దిరోజులు పెళ్లి […]

Read More

సేఫ్​ జోన్​కు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో త్వరలో రాజ్యసభ ఎన్నికల ఉన్నందున కాంగ్రెస్‌ పార్టీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు రిజైన్‌ చేయడంతో రెండు సీట్లు రావాల్సిన చోట ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, ఇప్పుడు మరికొంతమంది కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉండడంతో వాళ్లందరినీ సేఫ్​ జోన్​గా భావించిన రాజస్థాన్‌లోని ఓ రిసార్టుకు తరలించినట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లో తమ పార్టీ అధికారంలో ఉన్నందున అక్కడ అయితే సేఫ్‌ అని వాళ్లను అక్కడికి […]

Read More

ఉద్యోగాలు భర్తీ చేయాలి

సారథి న్యూస్, రామడుగు: నీళ్లు ,నిధులు, నియామకాలు, స్వపరిపాలన కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు ఎటుపోయాయని తెలుగు యువత కరీంనగర్​ పార్లమెంట్​ అధ్యక్షుడు జెల్లోజి శ్రీనివాస్ ప్రశ్నించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని, జీవితాలు బాగుపడుతాయని ఆశపడ్డామని అదేమీ జరగలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఖాళీపోస్టులను భర్తీచేయాలని డిమాండ్​ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రగతిభవన్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

Read More

వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండండి

సారథి న్యూస్​, గోదావరిఖని: పారిశుద్ధ్య నిర్వహణ అందరి బాధ్యత అని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి కేటీఆర్​ పిలుపు మేరకు పరిసరాలను శుభ్రంచేశారు. గార్డెన్ లో చెత్తను తీసివేయడంతో పాటు నిలువ ఉన్న నీటిని పారబోశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే వ్యాధులు దరిచేరవన్నారు. వర్షాకాలంలో సీజన్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Read More

ఏ ఒక్కరూ ఆకలితో బాధపడొద్దు

సారథి న్యూస్​, వరంగల్​: కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో ఆకలితో ఏ ఒక్కరూ బాధపడకూదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్​విప్​ దాస్యం వినయ్​ భాస్కర్​ అన్నారు. ఆదివారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 44వ డివిజన్ లో చాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ చేశారు. కార్మికుల కష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్​ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. లాక్​ డౌన్​ కారణంగా అసంఘటిత రంగ కార్మికులు కొందరు ఉపాధి లేక ఇబ్బంది […]

Read More