సారథి న్యూస్, రామడుగు: వానకాలం పంట సాగు ప్రణాళిక, నియంత్రిత వ్యవసాయ విధానంపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి యాస్మిన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశాలు క్లస్టర్ల వారీగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 26న రామడుగు, శానగర్, 27న గోపాల్ రావుపేట్, రుద్రారం, 28న వెలిచాల, దేశరజ్ పల్లి గ్రామాల్లో నిర్వహిస్తామని చెప్పారు. రైతులు తప్పకుండా హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సారథి న్యూస్, హుస్నాబాద్: ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండగ రంజాన్ అని ఎమ్మెల్యే సతీష్ కుమార్ కుమార్ అన్నారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మైనార్టీ సంక్షేమానికి ప్రత్యేకమైన నిధులను కేటాయించి వారి అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రజిత, వైస్ చైర్ పర్సన్ అనిత, డైరెక్టర్ ఆఫ్ లేబర్ కోపరేటివ్ ఆఫ్ ఇండియా […]
–కలెక్టర్ వెంకట్రావు సారథి న్యూస్, మహబూబ్ నగర్ : నూతన వ్యవసాయ విధానం ప్రకారం పంటలు సాగు చేసి అధిక దిగుబడులు పొందాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు రైతులకు సూచించారు. సోమవారం ఆయన మహబూబ్ నగర్ మండలం ఏనుగొండలో వానాకాలం వ్యవసాయ సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తప్పని సరిగా పంట మార్పిడి చేయాలని, మొక్క జొన్న వేయవద్దని కోరారు. రైతు వేదిక నిర్మాణానికి స్థలం గుర్తించామని, త్వరలోనే నిర్మాణం […]
సారథి న్యూస్, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన రూ.5 అన్నపూర్ణ భోజనం క్యాంటీన్ ను మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా భోజనం వడ్డించే వారు, వచ్చిన వారు తప్పకుండా మాస్క్ లు ధరించాలని మంత్రి సూచించారు.
– మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారథి న్యూస్, ఖమ్మం : ప్రభుత్వ సూచనల మేరకు గ్రామా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. సోమవారం ఖమ్మం టీటీడీసీ భవన్ లో నిర్వహించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో వానాకాలం 2020 సాగు ప్రణాళిక, నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో వ్యవసాయ, మార్కెటింగ్, ఎన్ఎస్పీ, ఇరిగేషన్, సివిల్ సప్లయీస్ అధికారులు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా […]
వీడిన గొర్రెకుంట మర్డర్ మిస్టరీ పప్పన్నంలో నిద్ర మాత్రలు కలిపి.. ప్రియురాలి కోసం 9 మంది దారుణ హత్య వెల్లడించిన వరంగల్ సీపీ రవీందర్ సారథి న్యూస్, వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట హత్యల వెనక మిస్టరీని పోలీసులు ఛేదించారు. పప్పన్నంలో నిద్రమాత్రలు కలిపి 9 మందిని హత్య చేశాడు నిందితుడు. ఈ కేసుకు సంబంధించి నిందితుడు బీహార్‌కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్‌ను సోమవారం మీడియా ఎదుట […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: మొదటి ఏడాదిలోనే మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను 90 శాతం వరకు పూర్తి చేశామని, ప్రజలకు ఇంకా ఏమి చేయాలనే ఆలోచనతో ఈ సదస్సులను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. సోమవారం ‘మన పాలన, మీ సూచన’ మేధోమదన సదస్సులో భాగంగా తొలిరోజు ‘ప్రజా పాలన – సంక్షేమం’పై వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గతేడాది నుంచి […]
సారథి న్యూస్, రంగారెడ్డి: గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన సంఘటన తలకొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలకొండపల్లి మండలం పరిధిలోని వెల్జాల్ గ్రామంలోని గోవిందరాజుల గుట్ట దేవాలయంలో మాడుగుల మండలానికి చెందిన ముగ్గురు యువకులు గుప్త నిధుల కోసం తవ్వకాలు ప్రయత్నించారు. పక్క సమాచారం మేరకు గ్రామస్తులు, వారిని ట్టుకొని దేహశుద్ధి చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. ఇందులో ఒకరు సస్పెండ్ అయిన కానిస్టేబుల్ ఉన్నాడు. ఆలయ […]