చిన్న హీరోయినే అయినా పెద్ద మనసు ఉంది ప్రణీత శుభాష్ కు. లాక్ డౌన్ మొదలైన నుంచి సమీపంలో ఉన్న పేదలకు తనవంతు సాయం చేస్తూనే ఉంది. కొద్దిరోజుల క్రితం ఆహారాన్ని స్వయంగా తానే వండి దగ్గరలో ఉన్న పేదవారందరికీ పంచింది. దాదాపు లాక్ డౌన్ పూర్తవుతున్న సందర్భంగా అందరూ ఎవరి పనుల్లో వారు చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ సమయంలో ముఖ్యంగా స్పందించాల్సింది ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ. అధికసంఖ్యలో ఆటోలకే ప్రయారిటీ ఉన్న దేశం కనుక ఆటో […]
అనుష్క ప్రధానపాత్రలో హేమంత్ మధుకర్ రూపొందించిన ‘నిశ్శబ్దం’ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ కలిసి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ తొలివారంలో విడుదల కావాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. దీంతో రెండు నెలలుగా ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా రిలీజ్ కానుందని వార్తలొస్తూనే ఉన్నాయి. అయితే థియేట్రికల్ గానే […]
సారథి న్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా హనుమంతుని పేట, ముత్తారం గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ.10లక్షల వ్యయంతో రెండు కి.మీ. మేర ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ను శుభ్రం చేసే కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్, ఎంపీడీవో రాజు, సర్పంచ్ ఎద్దు కుమార్, సదయ్య పాల్గొన్నారు.
పెరుగుతున్న కరోనా కేసులే కారణం న్యూఢిల్లీ: కరోనా ఉధృతి నేపథ్యంలో జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు మళ్లీ లాక్ డౌన్ విధించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ఈ గడువును పొడిగించే యోచనలో ఉంది. నాలుగో దశ లాక్ డౌన్ లో భాగంగా కొన్నింటికి సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇప్పటికే 1.4లక్షల కేసులకు చేరుకున్నాయి. దీనితోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. మహారాష్ట్రలో […]
46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు సారథి న్యూస్, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండం కోల్ బెల్డ్ ఏరియాలో భానుడు భగభగ మండిపోతున్నాడు.. రోజురోజుకూ ఎండ, వడగాలుల తీవ్రత భరించలేక జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. అసలే వేసవి.. ఆపై రోహిణి కార్తె తోవడంతో సూరీడు తన ప్రతాపం మరింత చూపడంతో ఇల్లు దాటి కాలు బయటపెట్టేందుకు పారిశ్రామికవాడలో జనం జంకుతున్నారు. జిల్లాలో వారం 46 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రామగుండం కోల్ బెల్ట్ ప్రాంతమైన రామగుండం, ఎన్టీపీసీ, […]
సారథి న్యూస్, హుస్నాబాద్ : ‘ నా కుమారులు నన్ను పట్టించుకోవడం లేదని హుస్నాబాద్ మండలంలోని పందిల్ల గ్రామానికి చెందిన తాడూరి దుర్గయ్య’ అనే వృద్ధుడు మంగళవారం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు.. సందర్భంగా ఎస్సై సుధాకర్ మాట్లాడుతూ కనిపెంచిన తల్లిదండ్రులను సంరక్షించాల్సిన బాధ్యతను పిల్లలు విస్మరించరాదని సూచించారు. కన్నవారు వృద్ధాప్యంలో ఉంటే వారి బాగోగులు కుమారులే చూసుకోవాలన్నారు. తల్లిదండ్రుల ఇబ్బందులకు గురి చేస్తే వారిచ్చే ఫిర్యాదు మేరకు కుమారులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వృద్ధుడి […]
–ఎమ్మెల్యే రవిశంకర్ సారథి న్యూస్, రామడుగు : సమగ్ర వ్యవసాయ విధానం ద్వారానే సత్పలితాలు వస్తాయని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మంగళవారం మండలంలోని షానగర్ లో ‘సమగ్ర వ్యవసాయ విధానం.. వానాకాలం పంటసాగు ప్రణాళిక’ పై రైతులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల మొక్క జొన్న నిల్వలు ఉన్నాయని, ఏ రైతు కూడా మొక్కజొన్న పంట వేయకూడదని సూచించారు. 40 శాతం సన్నరకాలు, 60 శాతం దొడ్డు […]
సారథి న్యూస్, హుస్నాబాద్ : కరోనా సమయంలో కరెంట్ బిల్లుల షాక్ తో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి అన్నారు. మంగళవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మహమ్మారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే విద్యుత్ శాఖ ఆఫీసర్లు ఇళ్లల్లోకి రాకుండా బిల్లులు వేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కరోనా ఉధృతి తగ్గే వరకు బిల్లులను విధించకుండా చర్యలు తీసుకుని హుస్నాబాద్ విద్యుత్ డీఈకి […]