Breaking News

Day: May 21, 2020

కల్తీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్​

మంత్రి ఎస్​.నిరంజన్​రెడ్డి సారథి న్యూస్​, హైదరాబాద్: రైతులకు కల్తీ విత్తనాలు అంటగడితే పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి ఎస్​.నిరంజన్​రెడ్డి హెచ్చరించారు. గురువారం హైదరాబాద్​లోని రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఆఫీసులో వివిధ జిల్లాల అధ్యక్షులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సమగ్ర వ్యవసాయ ప్రణాళిక అమలులో రైతు సమన్వయ సమితులు కీలకంగా పనిచేయాలని సూచించారు. డిమాండ్​ ఉన్న పంటలను మాత్రమే సాగుచేసేలా రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర […]

Read More

కరోనాతో కానిస్టేబుల్ మృతి

డీజీపీ మహేందర్‌ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో కరోనా తొలి మరణం నమోదైంది. పోలీసు కానిస్టేబుల్‌ దయాకర్‌ రెడ్డి కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు డీజీపీ మహేందర్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. బుధవారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దయాకర్‌ రెడ్డి కుటుంబ సభ్యులకు డీజీపీ మహేందర్‌ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని డీజీపీ భరోసా ఇచ్చారు. మన్సూరాబాద్‌కు చెందిన దయాకర్‌ రెడ్డి […]

Read More

ఫస్ట్ లెవెల్ ఫ్లై ఓవర్ ప్రారంభం

ప్రారంభించిన మంత్రి కేటీఆర్​ సారథి న్యూస్​, హైదరాబాద్​: నగరంలోని బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద నిర్మించిన ఫస్ట్ లెవెల్ ఫ్లై ఓవర్​ బ్రిడ్జిని మున్సిపల్​శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్​ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపునకు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తీరనున్నాయి. ఈ ఫ్లైఓవర్​ బ్రిడ్జి నిర్మాణానికి రూ.30.26 కోట్లు వ్యయం అయినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ […]

Read More

పేదల కష్టాలు సీఎంకు తెలుసు

నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సారథి న్యూస్​, నారాయణఖేడ్: సీఎం కేసీఆర్ బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి అని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి కొనియాడారు. పేదల కష్టాలు ఆయనకు తెలుసునన్నారు. అందుకోసమే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. గురువారం ఆయన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ కల్హేర్, సిర్గాపూర్ మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన 75 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులు అందజేశారు. ఖేడ్​ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు.

Read More

రుణమాఫీ చేయండి

బీజేపీ నాయకుల డిమాండ్​ సారథి న్యూస్, హుస్నాబాద్: రైతుబంధు నిబంధనలు తొలగించి రూ.లక్ష పంట రుణమాఫీ చేయాలని బీజేపీ అక్కన్నపేట మండల అధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి గురువారం ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. రైతులు ప్రభుత్వం నిర్దేశించిన పంటలను మాత్రమే పండించాలని, లేనిపక్షంలో రైతుబంధు ఇవ్వబోమనడం సీఎం కేసీఆర్ నియంతృత్వ పాలనకు అద్దం పడుతోందన్నారు. అనంతరం తహసీల్దార్ వేణుగోపాల్ రావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నునావత్ మోహన్, రాజ్ కుమార్, కృష్ణ, సంపత్, వంశీ తదితరులు […]

Read More

ఘోర ప్రమాదం.. తెగిపడ్డ తల

నాందేడ్ – ఆకొలా హైవేపై ఘటన సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో గురువారం నాందేడ్ – ఆకొలా హైవేపై అల్లాదుర్గం మండలం రాంపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్​ లో ఓ వ్యక్తి తల మొండెం నుంచి వేరుపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను చూసి స్థానికులు షాక్​కు గురయ్యారు. పెద్దశంకరంపేట మండలం ఉత్తులూర్ గ్రామానికి చెందిన దుర్గయ్య అల్లాదుర్గం మండలం రాంపూర్ లోని ఓ రైస్ మిల్లులో పనిచేస్తున్నాడు. రోజు […]

Read More

ఓర్వలేకే అసత్య ప్రచారాలు

కాంగ్రెస్​ లీడర్లపై టీఆర్​ఎస్​ నేతల ఫైర్​ సారథి న్యూస్, హుస్నాబాద్: రైతులపై కాంగ్రెస్ లీడర్లు ముసలి కన్నీరు కారుస్తున్నారని హుస్నాబాద్​ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా గురువారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయం విస్తీర్ణం పెంచడమే కాకుండా బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిందన్నారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు చెరువులు కుంటలు నింపితే కాంగ్రెస్ నాయకులు ఓర్వలేక అసత్య ప్రచారాలు […]

Read More

మాస్ రాజా సందడి

రమేష్ వర్మ డైరెక్షన్​లో సినిమా

Read More