సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో మేడ్చల్–మల్కాజ్ గిరి జిల్లాలోని కాప్రామండలం కుషాయిగూడ, మల్కాజ్గిరి మండలం నేరెడ్ మెట్, ఉప్పల్ మండలంలోని రామాంతాపూర్ ప్రాంతాలను కంటైన్ మెంట్ జోన్లుగా ప్రకటించారు. జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు బుధవారం ఈ ప్రాంతంలో పర్యటించి పరిస్థితిని ఆరాతీశారు. పాజిటివ్ వచ్చిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ప్రజలు బయటికి రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మెడికల్, పోలీస్, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని […]
సారథి న్యూస్, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడ గ్రామ రెవెన్యూ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా ఫ్రూట్ మార్కెట్ ను ఏర్పాటుచేసింది. కరోనా నివారణకు ఏర్పాట్లు, రక్షణ చర్యలను పరిశీలించేందుకు బుధవారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వచ్చారు. మార్కెట్ లోకి వెళ్లే సమయంలో మామిడి కాయలను రాసులుగా పోసి ఉన్నాయి. వాటిని తొక్కుకుంటూ మిగతా అధికారులు, సిబ్బంది ముందుకెళ్తున్నారు. అయితే అలా వెళ్లడం ఇష్టం లేని కమిషనర్ మాత్రం […]
సారథి న్యూస్, యాదాద్రి భువనగిరి: ఆస్ట్రేలియా ప్రభుత్వపు హెల్త్ డిపార్ట్మెంట్(టీజీఏ) వారు జారీచేసే జీఎంపీ సర్టిఫికెట్, యాదాద్రి భువనగిరి ఇండస్ట్రీయల్ ఏరియాలోని రీచ్ ఇండియా ఫార్మా లిమిటెడ్ కంపెనీకి రావడం ప్రత్యేకతను చాటుకుంది. తెలంగాణలోని ఎంఎస్ఎంఈ సెక్టార్ లో ఉన్న ఏ ఫార్మా ఫార్ములేషన్ కంపెనీకి ఇంత వరకు ఈ సర్టిఫికేషన్ రాలేదని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్యాంసుందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సర్టిఫికెట్ ఆధారంగా తమ సంస్థ ఆస్ట్రేలియాతోపాటు 50కి పైగా […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఆరోగ్యసేతు యాప్ ను తక్షణమే డౌన్‌లోడ్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర జాయింట్ సెక్రటరీ జి.జయంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఔట్ సోర్సింగ్ స్టాఫ్ కూడా యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. వారివారి కార్యాలయాలకు హాజరయ్యే ముందు స్టేటస్ గమనించాలని కోరింది. యాప్‌లో సేఫ్, లేదా లో రిస్క్ అని వస్తేనే ఆఫీసుకు బయలుదేరాలని, యాప్ స్టేటస్ కనుక మోడరేట్ లేదా హై రిస్క్ అని చూపిస్తే […]
సారథి న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రానికి తెలంగాణ జల వైతాళికుడు ఆర్.విద్యాసాగర్ రావు సేవలు ఎప్పటికీ మరువలేనివని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు గుర్తుచేశారు. బుధవారం విద్యాసాగర్ రావు మూడవ వర్ధంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య పాలనలో సాగునీటి రంగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటిన మహనీయుడని కొనియాడారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ కోల్పోయిన ప్రతి నీటిబొట్టును లెక్కగట్టిన గొప్ప జలనిపుణుడని, చివరి శ్వాసవరకు తెలంగాణ సాగు నీటి రంగానికి […]
సారథి న్యూస్, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం చర్ల ఇటిక్యాల గ్రామ శివారులో పేకాట శిబిరంపై నాగర్ కర్నూల్ సీఐ గాంధీనాయక్ ఆధ్వర్యంలో బుధవారం తాడూరు ఎస్సై నరేందర్, నాగర్ కర్నూల్ ఎస్సై మాధవరెడ్డి దాడులు నిర్వహించారు. ఎనిమిది మంది అరెస్ట్ కాగా, ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.67,800 నగదుతో పాటు పది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సారథి న్యూస్, నాగర్ కర్నూల్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు, కూలీలు సామాజిక దూరం పాటించాలని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మనుచౌదరి ఆదేశించారు. బుధవారం బిజినేపల్లి మండలంలోని లింగసానిపల్లి, కారుకొండ గ్రామాల్లో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. లింగసానిపల్లిలో 6,440 బస్తాలు, కారుకొండలో 1,807 బస్తాల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశారని చెప్పారు. జిల్లావ్యాప్తంగా 211 కొనుగోలు కేంద్రాల్లో 43,264 మెట్రిక్ టన్నుల […]
సారథి న్యూస్, నాగర్ కర్నూల్: దగ్గు, జ్వరం, జలుబు లక్షణాలకు మెడికల్ షాపుల్లో మందులు కొనేవారిపై దృష్టిపెట్టాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ ఈ.శ్రీధర్ సూచించారు. ఈ లక్షణాలతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టర్ క్యాంపు ఆఫీసులో డాక్టర్లతో సమీక్షించారు. ఫీవర్ టెస్ట్ లను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో ఇద్దరు కరోనా పాజిటివ్ వ్యక్తులను జిల్లా ఆస్పత్రి నుంచి ఇంటికి పంపించినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మనుచౌదరి, […]