సారథి, వేములవాడ: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని సినీనేపథ్య గాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ గురువారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు సాదరస్వాగతం పలికారు. శాలువతో సన్మానం చేసి స్వామి వారి అభిషేకం లడ్డూప్రసాదంతో పాటు స్వామివారి ప్రతిమలను అందజేశారు. అంతకుముందు పట్టణంలోని సాయిబాబా ఆలయాన్ని ఏనుగు మనోహర్ రెడ్డి దర్శించుకున్నారు.
సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన తిరుపతి, శ్రీనివాస్ అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా ప్యాకెట్ అమ్ముతున్నట్లు తెలుసుకున్న పట్టణ ఇన్ స్పెక్టర్ వెంకటేష్ వారి నుంచి రూ.5,050 విలువైన గుట్కా ప్యాకెట్ లను పట్టుకున్నారు. ఎవరైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తే కఠిన చట్టలు తీసుకుంటామని హెచ్చరించారు. అమ్మే వారి సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తిప్పాపూర్ రాజరాజేశ్వర స్వామి వారి గోశాలను ఆదివారం ఆలయ ఏఈవో సంకేపల్లి హరికిషన్ సందర్శించారు. వర్షాకాలం వచ్చినందున గోశాలలోని కోడెలకు గిట్టల చీల్పు, నోటి బొబ్బలు, పొదుగు వాపు, పిడుదులు, గోమార్లు సోకకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రతి కోడెకు వర్షాకాలంలో విధిగా టెస్టులు చేయించాలని సూచించారు. డీ వార్మింగ్ చేయించాలని, ఇతర వ్యాధుల బారిన పడకుండా తప్పనిసరిగా టీకాలు వేయించాలని గోశాల ఇన్ చార్జ్ శంకర్ కు సూచించారు. […]
సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈనెల 10వ తేదీ వరకు దస్తావేజు సేవలను స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నామని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగులరాజు తెలిపారు. భూ విక్రయ కొనుగోలుదారులు, ప్రజలు సహకరించగలరని కోరారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు.
సారథి న్యూస్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల మాదిరిగానే వేములవాడ నియోజవర్గాన్ని అదే తరహాలో అభివృద్ధి చేస్తానని, ఈ రెండు నియోజకవర్గాలను తనకు రెండు కళ్లుగా భావిస్తానని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. మిడ్ మానేరు ప్రాజెక్టు యువతకు మినీ డెయిరీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అందించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. సోమవారం రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతనగర్ లో సకల వసతులతో ప్రారంభించిన జడ్పీ హైస్కూలు ఆయన ప్రారంభించారు. పదవులు రాజకీయాలు ఎన్నికల […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రజారోగ్య సేవలపై ప్రత్యేకశ్రద్ధ చూపాలని మంత్రి కె.తారక రామారావు జిల్లా యంత్రాంగానికి సూచించారు. దీంతో పాటు సిరిసిల్ల పట్టణాన్ని అదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులపైన కూడా మంత్రి సమీక్షించారు. సిరిసిల్లలో జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగంగా పరుగులెత్తించాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం జిల్లా అధికారులతో హైదరాబాద్లోని ప్రగతిభవన్లో పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వానాకాలంలో […]
సారథి న్యూస్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల ప్రగతి స్ఫూర్తిదాయకమని మంత్రి కె.తారక రామారావు అన్నారు. సిరిసిల్లలో రూ.5.15 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునికత రైతు బజార్ ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తిచేయడం సీఎం పనితీరుకు అద్దంపడుతుందన్నారు.