సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో శుక్రవారం సర్పంచ్ బక్కశెట్టి నర్సయ్య కరోనా బాధిత ఆరు కుటుంబాలకు వారానికి సరిపడా నిత్యవసరాలు, కూరగాయలు, బియ్యం, కోడిగుడ్లు పంపిణీ చేసి ఉదారత చాటుకున్నాడు. ఎవరు భయపడకుండా డాక్టర్లు సూచించిన మందులు వాడాలని ఆయన సూచించారు. మెడిసిన్ వాడుతూనే పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు. గోపాల్ రావుపేట ఏఎంసీ వైస్ చైర్మన్ తడగొండ అజయ్, పంచాయతీ కార్యదర్శి శిరీష్, టీఆర్ఎస్ నాయకులు తడగొండ నర్సింబాబు, ఆశావర్కర్లు, గ్రామపంచాయతీ […]
సారథి న్యూస్, నర్సాపూర్:కరోనా వ్యాధికి కులం, మతం, రంగు, పేద అనే తేడా లేకుండా ఎవరికైనా సోకవచ్చని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సోమవారం కౌడిపల్లి లక్ష్మీ నరసింహగార్డెన్ లో 420 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి పాల్గొని మాట్లాడారు. లాక్ డౌన్ వేళ ప్రభుత్వ సూచనలను పాటించాలని సూచించారు.ఆటో డ్రైవర్లు లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు […]
సారథి న్యూస్, రంగారెడ్డి: లాక్ డౌన్ సమయంలో పేదలకు ఆకలి తీర్చడంలోనే అసలైన సంతోషం ఉంటుందని శ్రీగాబ్రీయేల్ స్కూలు, న్యూటన్ గ్రీన్ ప్లే స్కూల్ విద్యాసంస్థల చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి అన్నారు. సోమవారం టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్ జెండాను ఎగరవేశారు. అనంతరం హయత్ నగర్, మన్సురాబాద్ డివిజన్ లో ప్రింట్, అండ్ ఎలక్ర్టానిక్ మీడియా విలేకరులకు బియ్యం, నిత్యావసర సరుకులను […]
సారథి న్యూస్, నర్సాపూర్: కౌడిపల్లి మండలం వెంకటాపూర్(ఆర్) గ్రామంలో సీవీఆర్ యువసేన నాయకుడు విక్రమ్ రెడ్డి 30 నిరుపేద కుటుంబాలకు సోమవారం సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా, ఉపసర్పంచ్ మహేష్ ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ చేశారు. విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ వేళ.. పేదలు ఇబ్బంది పడకూడదని సరుకులు పంపిణీ చేశారు. అలాగే వెంకటాపూర్ గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి కుమారులు హరీశ్‌రెడ్డి, సతీశ్ రెడ్డి నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. […]
సారథి న్యూస్, మహబూబ్‌నగర్: కరోనా సమయంలో పేదలను ఆదుకునేందుకు వివిధ సంస్థలు, వ్యక్తులు, ఉద్యోగులు ముందుకు రావడం అభినందనీయమని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. ఆదివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సుబ్రమణ్య కాలనీ, పాలకొండతండా ప్రాంతాల్లో సరుకులు పంపిణీ చేశారు. కష్టకాలంలో వలస కూలీలను ఆదుకోవాలనే సంకల్పంతోనే వారికి బియ్యం, కూరగాయలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పట్టణంలోని మెట్టుగడ్డ వద్ద ఉన్న ఆర్వీఎం భవనం ఎదుట బహుజన తరగతుల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పేదలకు […]