Breaking News

నాగర్ కర్నూల్

2023లో అంతా మంచి జరగాలి

2023లో అంతా మంచి జరగాలి

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​ బ్యూరో: 2023లో రాష్ట్ర ప్రజలతో పాటు నాగర్​ కర్నూల్​ నియోజకవర్గ ప్రజలకు అంతా మంచి జరగాలని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​ రెడ్డి తనయుడు, డెంటల్​ డాక్టర్స్​ అసోసియేషన్​ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ కూచకుళ్ల రాజేశ్​ రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆయన జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రతి ఒక్కరికి కలిసి రావాలని కోరారు. రైతులకు పాడిపంటలు కలగాలని ఆకాంక్షించారు. […]

Read More
చెరువుల కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి

చెరువుల కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి

సామాజికసారథి, బిజినేపల్లి: సాకలివాని,చెరువు ఈదుల్ చెరువు, మొద్దుల కుంటలను ఆక్రమించుకుని అన్యాక్రాంతం చేస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని మత్స్య సహకార సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రెవెన్యూ ఇరిగేషన్ అధికారులను పలుమార్లు కలిసి వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదన్నారు. సర్వేచేసి ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్లను ఫిక్స్​ చేయాలని మండల జనరల్ బాడీ మీటింగ్ లో వినతిపత్రాలు ఇచ్చామని గుర్తుచేశారు. ఎంపీపీ, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లను కూడా కలిశామన్నారు. బిజినేపల్లి చెరువు కుంటలను ఆక్రమిస్తున్న నాయకులకు సహకరిస్తున్న […]

Read More
మహేంద్రనాథే నాకు స్ఫూర్తి

మహేంద్రనాథే నాకు స్ఫూర్తి

సామాజిసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: తనకు దిగవంత మంత్రి పుట్టపాగ మహేంద్రనాథే తనకు స్ఫూర్తి అని ఎమ్మెల్సీ కూచు కుళ్ల దామోదర్ రెడ్డి అన్నారు. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఇంత మందికి సేవ చేస్తున్నప్పుడు.. స్థితిమంతమైన కుటుంబంలో పుట్టిన నేనేందుకు చేయకూడదో అనే భావనతోనే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన తన రాజకీయ అరంగేట్రను గుర్తుచేసుకున్నారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, చివరిదాకా వారితోనే ఉంటానని ప్రకటించారు. తన వారసుడిగా తన కుమారుడుకు వచ్చే […]

Read More
నాడు ‘కూచకుళ్ల’ చొరవ.. ఎంతోమందికి కంటిచూపు

నాడు ‘కూచకుళ్ల’ చొరవ.. ఎంతోమందికి కంటిచూపు

పేదల సేవలో తూడుకుర్తి ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి 10 ఎకరాల భూదానం ఆస్పత్రిని ఏర్పాటుచేసి 24 వసంతాలు పూర్తి సామాజికసారథి, నాగర్​కర్నూల్​ప్రతినిధి: సర్వేంద్రియానం నయనం ప్రధానం! అంటారు. అన్ని అవయవాల్లో కన్నా కళ్లు ముఖ్యమైనవి అని అర్థం. చూపు లేనిది ప్రపంచమే అంధకారం. అలాంటి కళ్లకు ఏమైనా జబ్బు చేస్తే వెంటనే మనం ఆసుపత్రికి వెళ్తాం. కానీ చికిత్స చేసే ఆసుపత్రులు పల్లెటూర్లలో చిన్న చిన్న పట్టణాలలో కనిపించవు. కన్నుకు ఏమైనా […]

Read More
బిజినేపల్లి ఎస్సైకి జడ్పీ చైర్ పర్సన్​సారీ చెప్పాలి

బిజినేపల్లి ఎస్సైకి జడ్పీ చైర్ పర్సన్​ సారీ చెప్పాలి

అధికారంలో ఉన్నామని విర్రవీగొద్దు కొడుకుపై దాడి జరిగితే ఎమ్మెల్యేతో కాంప్రమైజ్​ దళిత సంఘాలను ఆమె భర్త ఏనాడూ పట్టించుకోలేదు ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కరిగిల్ల దశరథం సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జడ్పీ చైర్ పర్సన్ ​కుమారుడు గణేశ్​దే ముమ్మాటికీ తప్పని తేలిందని ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కరిగిల్ల దశరథం అన్నారు. చట్టం అందరికీ సమానమేనని జడ్పీ చైర్ ​పర్సన్​ పద్మావతి కుమారుడు వ్యవహరించిన తీరుపై తాము కూడా విచారణ చేశామని వాస్తవ విషయాలు తెలుసుకున్నామని తెలిపారు. […]

Read More
నినదించిన చైతన్యం... నిస్తేజం!

నినదించిన చైతన్యం.. నిస్తేజం!

మొన్న ఒకరు.. నిన్న మరొకరు.. నేడు ఇంకొకరు చిన్న చిన్న కారణాలకే పోలీసుల చేతుల్లోదళిత యువకులకు చావు దెబ్బలు ప్రశ్నించేవారు లేరు.. అడిగే దిక్కులేదు బాధితుల ఆక్రందనను పట్టించుకునేదెవరు? చర్చనీయాంశంగా నాగర్​ కర్నూల్​ లో వరుస ఘటనలు సామాజికసారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: నాగర్‌కర్నూల్​ గడ్డ చైతన్యానికి పెట్టిందిపేరు అని చెప్పుకుంటారు. దివంగత మాజీమంత్రి పుట్టపాగ మహేంద్రనాథ్ స్ఫూర్తితో ఎన్నో ప్రజాఉద్యమాలు పురుడు పోసుకున్నాయి. ఆయన శిష్యరికంలో ఎందరో నాయకులు రాటుదేలారు. ఇక్కడ సారా వ్యతిరేక ఉద్యమం, కరువు […]

Read More
పంతానికి పోతే బిడ్డ ప్రాణం పోయింది

పంతానికి పోతే బిడ్డ ప్రాణం పోయింది

సామాజికసారథి, బిజినేపల్లి: ఓ తండ్రి పంతం, పట్టింపు నైజం.. పోలీసుల పట్టించుకోని తనం.. వెరసి ఓ చిన్నారి ప్రాణం గాల్లో కలిసింది. ఆపరేషన్​ పత్రాలపై సకాలంలో సంతకం చేయకపోవడంతో ఆ బిడ్డ కన్నుమూసింది. ఈ విషాదకర సంఘటన ఆదివారం వెలుగుచూసింది. నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి మండలం గుడ్లనర్వ గ్రామానికి చెందిన మహేశ్వరి, రేవెల్లి గ్రామానికి చెందిన టపా మహేష్ కు మూడేళ్ల క్రితం వివాహమైంది. అన్యోన్యంగా ఉన్న ఆ దంపతులకు కూతురు పుట్టింది. ఆ చిన్నారికి ఇప్పుడు […]

Read More
కిస్తీలు కట్టలేక.. అప్పులు తీర్చలేక

కిస్తీలు కట్టలేక.. అప్పులు తీర్చలేక

వీఆర్ఏ కుటుంబం ఆత్మహత్యాయత్నం పురుగు మందు తాగిన భార్య నాగర్​ కర్నూల్​ జిల్లా పాలెంలో విషాదకర ఘటన సామాజికసారథి, బిజినేపల్లి: జీతం రాక.. చేతిలో చిల్లిగవ్వలేక.. అప్పులు తీర్చలేక ఓ వీఆర్ఏ కుటుంబం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన మంగళవారం బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు.. వేపూరి రాజేశ్ పాలెం వీఆర్ఏగా పనిచేస్తున్నాడు. గతంలో కుటుంబ అవసరాల కోసం ఏడాదిన్నర క్రితం […]

Read More