సారథి న్యూస్, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానానికి అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మంగళవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన వెంట విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు.
ఫ్లోరైడ్ బాధితులను ఎవరూ పట్టించుకోలేదు ఇంటింటికీ నీళ్లిచ్చి వారి బాధలు తీర్చినం గోదావరి నీటితో జిల్లారైతుల కాళ్లు కడుగుతం బీజేపీ వారు సంస్కారం నేర్చుకోవాలి సహనానికి కూడా హద్దు ఉంటది.. టైం వస్తే తొక్కిపడేస్తం ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగ ధన్యవాదసభలో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, నల్లగొండ: అనాదిగా నల్లగొండ జిల్లా నష్టాలు, కష్టాలకు గురైందని, ఎవరూ పట్టించుకోలేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యపాలకులు చిన్నచూపు చూశారని ధ్వజమెత్తారు. నాగార్జునసాగర్ డ్యాం ఏలేశ్వరం […]
సీఎం కేసీఆర్‌ను కలిసిన ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు పలు అభివృద్ధి పనుల మంజూరుకు ముఖ్యమంత్రి హామీ సారథి న్యూస్, హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ పనులు, పలు సమస్యలను పరిష్కరించాలని జిల్లా ప్రజాప్రతినిధులు శుక్రవారం సీఎం కె.చంద్రశేఖర్‌రావును కలిసి విన్నవించారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, శానంపూడి సైదిరెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నకిరేకల్ […]
లారీ ఢీకొని మహిళల దుర్మరణం పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద దుర్ఘటన తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన సీఎం కె.చంద్రశేఖర్‌రావు సారథి న్యూస్, నల్లగొండ: రెక్కాడితే గానీ డొక్కాడని పేదింటి బతుకులు.. కూలీ పనులకు వెళ్లినవారంతా తిరిగిరాని లోకాలకు వెళ్లారు. లారీ ఢీకొనడంతో ఏడుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అప్పటిదాకా వరినాట్లు వేసి అలసిసొలసి ముచ్చట్లు, నవ్వులతో ఇంటిదారి పడుతున్నవారంతా ఒక్కసారిగా విగతజీవులుగా మారారు. క్షణాల్లో మాంసపు ముద్దలుగా చెల్లాచెదురయ్యారు. ఈ ఘోరరోడ్డు ప్రమాదం […]
సారథి న్యూస్, నల్లగొండ: అనారోగ్యంతో ఇటీవల కన్నుమూసిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు సంతాప సభను ఆదివారం నల్లగొండ జిల్లా హాలియాలో నిర్వహించారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్, గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి, శాసనమండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపురెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, […]
సారథిన్యూస్, రామాయంపేట / చేవెళ్ల: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఆదర్శమహిళ అని పలువురు వక్తలు కొనియాడారు. ఆమె పోరాట పటిమను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఐలమ్మ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల ఆమెకు నివాళి అర్పించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో రజక సంఘం అధ్యక్షులు సంగుస్వామి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నిర్వహించారు. మరోవైపు చేవెళ్ల మండల కేంద్రంలో రజకసంఘం, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఐలమ్మ […]
సారథి న్యూస్, చౌటుప్పల్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్కి ఆవు అడ్డుగా రావడంతో డ్రైవర్లు సడన్ బ్రేక్ వేశారు. దీంతో కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొన్నాయి. చంద్రబాబు ప్రయాణిస్తున్న బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని పక్కకు తప్పించడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ […]
సారథి న్యూస్, హైదరాబాద్: నల్లగొండలోని నవ్య హాస్పటల్ ను సీజ్ చేయడం, డాక్టర్ చెరుకు సుహాస్ ను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని తెలంగాణ ప్రజల పార్టీ తీవ్రంగా ఖండించింది. వారి కుటుంబంపై కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్ గుప్తా, వర్కింగ్ ప్రసిడెంట్ శ్యాంసుందర్, వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్, జనరల్ సెక్రటరీ ఇంద్రసేనా, జాయింట్ సెక్రటరీ కోట్ల వాసుదేవ్ ప్రభుత్వానికి సూచించారు. అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలతో […]