సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు నీటి ఉధృతి పెరుగుతోంది. గతవారం 27 గేట్లను ఎత్తగా, అదేస్థాయిలో మంగళవారం సాయంత్రం కూడా 27 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గంటగంటకూ వరద పెరుగుతుండడంతో నదీతీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేస్తున్నారు. ప్రస్తుతం 2.27లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జిల్లాలోని అలంపూర్నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి నుంచి కురిసిన భారీవర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. అంతర్రాష్ట్ర రహదారి రాయిచూర్ మార్గంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు వెళ్లలేక 40 నుంచి 60 కి.మీ. దూరం మేర గద్వాల మీదుగా ప్రయాణిస్తున్నారు. అలాగే మానవపాడు మండల కేంద్రంలో అమరవాయి వాగు ఉప్పొంగడంతో ఏడు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మండలంలోని పత్తి పంటలు నీట మునిగాయి. మానవపాడు […]
స్తంభించిన వాహనాల రాకపోకలు చిన్నపాటి వర్షమొస్తే ఇదే పరిస్థితి సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక ఎప్పటిలాగే జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెళ్లి మండలం బొంకూర్ వద్ద ఉన్న అంతర్రాష్ట్ర రాయిచూర్రహదారి కోతకు గురైంది. అర్ధరాత్రి నుంచి రాకపోకలు స్తంభించిపోయాయి. రాయిచూర్కు వెళ్లాలంటే వయా కలకుంట్ల మీదుగా హైవే నం.44, అలంపూర్ చౌరస్తా వరకు 25 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోంది. మూడేళ్లుగా ఈ పెద్ద వాగుపై బ్రిడ్జిని […]
సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): చివరి ఆయకట్టు దాకా సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అలంపూర్ఎమ్మెల్యే వీఎం అబ్రహం అన్నారు. శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలో లిఫ్ట్ మోటార్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అలంపూర్మండలానికి మూడు లిఫ్టులను ఏర్పాటు చేశామన్నారు. అందరం కలిసికట్టుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. మత్స్యకారుల అభ్యున్నతికి కృషిరాష్ట్రంలో మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అలంపూర్ ఎమ్మెల్యే వీఎం అబ్రహం […]
సారథి న్యూస్, మానవపాడు: తెలంగాణ ప్రైవేట్టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో జోగుళాంబ గద్వాల జిల్లా డీఈవో ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. ఆరునెలల పెండింగ్జీతాలు చెల్లించాలని డిమాండ్చేశారు. కష్టకాలంలో తాము ఎలా బతకాలని ప్రశ్నించారు. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలతో ప్రభుత్వం మాట్లాడి తమకు వేతనాలు ఇప్పించాలని కోరారు. జీతాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నామని వాపోయారు.
సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు జూరాలకు నిలకడగా వరద కొనసాగుతోంది. ప్రస్తుతం నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలలో ప్రస్తుతం 9.657 టీఎంసీల నీటిమట్టం ఉంది. ప్రస్తుతం జూరాలకు 63,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఇలా ప్రాజెక్టు నుంచి మొత్తం 60,856 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. నాలుగుగేట్ల ద్వారా 22,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తికి 35,974 క్యూసెక్కుల […]
నేటికీ పూర్తికాని గ్రంథాలయ భవనం రూ.25లక్షల పైనే నిధులు మంజూరు సారథి న్యూస్, మానవపాడు (జోగుళాంబగద్వాల): అందరికీ ఉపయోగపడే గ్రంథాలయ భవనం అది.. రెండు దశాబ్దాలుగా నిర్మాణంలోనే ఉంది. నిధులు మంజూరైనప్పటికీ పూర్తికావడం లేదు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో 2002లో అలంపూర్ నియోజకవర్గ అప్పటి ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సీతాదయాకర్ రెడ్డి భవన నిర్మాణానికి భూమి పూజచేసి అప్పట్లోనే రూ.8లక్షలు మంజూరు చేశారు. అయితే […]
బొంకూర్ గ్రామంలో తప్పిన పెనుప్రమాదం ముగ్గురు పిల్లలతో బయటపడ్డ కుటుంబం సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ఇల్లు.. కుటుంబమంతా గాఢనిద్రలో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఉండవెల్లి మండలం బొంకూర్ గ్రామానికి చెందిన పరమేశ్గౌడ్, మంజుల దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి సోమవారం నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి సమయంలో నిద్రలో ఉండగా, ఒక్కసారిగా మట్టిమిద్దె పైకప్పు కూలి నిద్రిస్తున్నవారిపై పడింది. కాళ్ల వైపున ఇళ్లు కూలడంతో పిల్లలను చంకలో పెట్టుకుని ప్రాణభయంతో […]