Breaking News

జోగుళాంబ గద్వాల

వైభవంగా రాములోరి కల్యాణం

వైభవంగా రాములోరి కల్యాణం

సారథి, మానవపాడు/రామడుగు: జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం, పుల్లూరు గ్రామంలో సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలు కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో జరిగాయి. కరోనా చీకట్లు తొలగిపోయి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేలా రైతులకు సకాలంలో వర్షాలు పడుతూ అన్నివర్గాల ప్రజలు, వ్యాపారులు అభివృద్ధి చెంది నిండునూరేళ్లు అష్టఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ఆ స్వామి వారిని పుల్లూరు గ్రామ ప్రజలు పూజించారు. – కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో సీతారాముల కల్యాణానికి భద్రాచలం […]

Read More
45ఏళ్లు పైబడినవారు వ్యాక్సిన్​ తీసుకోవాలి

45ఏళ్లు పైబడినవారు వ్యాక్సిన్​ తీసుకోవాలి

సారథి, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు హెల్త్​సెంటర్​ను డీఎంహెచ్​వో డాక్టర్​చందునాయక్ సందర్శించి ఇక్కడ అందుతున్న వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. 45ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలని సూచించారు. కరోనా సెకండ్​వేవ్​ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని కోరారు. వైద్యులు, డాక్టర్లు సమయపాలన పాటించాలని కోరారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అమరవాయి గ్రామంలో ఉన్న హెల్త్​సబ్ సెంటర్ ను పరిశీలించి అక్కడ ఉన్న వైద్యసిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో […]

Read More
నడిగడ్డలో కాషాయం జెండా ఎగరడం కాయం

నడిగడ్డలో కాషాయం జెండా ఎగరడం కాయం

సారథి, మానవపాడు: నడిగడ్డలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. బీజేపీ మానవపాడు మండలాధ్యక్షుడిగా గొల్ల విజయ్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆయనకు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. త్వరలోనే భారీఎత్తున జిల్లాలో చేరికలు ఉంటాయని ధీమా వ్యక్తంచేశారు. పార్టీ బలోపేతానికి పూర్తిస్థాయిలో కృషిచేస్తానని విజయ్​ […]

Read More
తైబజార్​ దళారులు మా కడుపు కొడుతున్నరు

తైబజార్​ దళారులు మా కడుపు కొడుతున్నరు

సారథి, అయిజ(మానవపాడు): అయిజ మున్సిపాలిటీ పరిధిలో తైబజార్ నిర్వహించే వ్యాపారులు అధికార బలంతో చిరువ్యాపారులపై దౌర్జన్యం చేస్తూ అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూరగాయల తై బజార్ లో రేట్లను అడ్డగోలుగా పెంచి తమ పొట్టగొడుతున్నారని రైతులు చిరు వ్యాపారులతో కలిసి రాస్తారోకో, ఆందోళన నిర్వహించారు. గంప కూరగాయలు తీసుకొస్తే రూ.30 వస్తే.. అందులో దళారులు, తైబజార్ నిర్వాహకులకు రూ.25 పోతే వచ్చే రూ.ఐదుతో కనీసం రవాణా చార్జీలు కూడా వెళ్లక నానాఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. […]

Read More
కళాకారుడు చిన్నయ్యకు నాటక అకాడమీ అవార్డు

కళాకారుడు చిన్నయ్యకు నాటక అకాడమీ అవార్డు

సారథి, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ జగ్గుల చిన్నయ్యకు తెలంగాణ సాంస్కృతిక నాటక అకాడమీ ఉత్తమ అవార్డు దక్కింది. ఈ అవార్డును రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతులమీదుగా ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా జెగ్గుల చిన్నయ్య మాట్లాడుతూ.. 40 ఏళ్ల నుంచి కళాకారుడుగా శ్రీకృష్ణరాయబారం, చింతామణి హరిశ్చంద్ర నాటకాల్లో పలు పాత్రలను పోషించి కళాభిమానుల ఆదరణ పొందినందుకు గుర్తింపుగా తనకు అవార్డు రావడం సంతోషంగా […]

Read More
7 నిమిషాల్లో రిజిస్ట్రేషన్.. హ్యాపీ

7 నిమిషాల్లో రిజిస్ట్రేషన్.. హ్యాపీ

సారథి, మానవపాడు: కేవలం ఏడు నిమిషాల్లోనే భూమి రిజిస్ట్రేషన్​ కావడంపై వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు తహసీల్దార్ కార్యాలయానికి ఓ సాధారణ వ్యక్తిలా వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ధరణి రైతులకు ఒక వరమని, మధ్యవర్తులు, బ్రోకర్ల ప్రమేయం లేకుండా మీ సేవకు వెళ్లి ధరణి పోర్టల్ లో ఆన్​లైన్​చేసుకుంటే ఈజీగా రిజిస్ట్రేషన్​అయిందని గుర్తుచేశారు. ధరణి సేవలను తెలుసుకునేందుకే సాధారణ వ్యక్తిలా వచ్చానని తెలిపారు.

Read More
ఓటు వేసిన ప్రముఖులు

ఓటు వేసిన ప్రముఖులు

సారథి న్యూస్, అలంపూర్​: ఇటిక్యాల మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన పోలింగ్​కేంద్రంలో అలంపూర్​ఎమ్మెల్యే డాక్టర్​వీఎం అబ్రహం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఇక్కడే మాజీ ఎంపీ మందా జగన్నాథం ఓటు వేశారు. మానవపాడు మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ లో జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్​పర్సన్​ సరిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మానవపాడు పోలింగ్ కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పరిశీలించారు.

Read More
ఉత్సాహంగా వరాహమూర్తుల పోటీలు

ఉత్సాహంగా వరాహమూర్తుల పోటీలు

సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లాలో తిక్కవీరేశ్వర స్వామి జాతర సందర్భంగా వరాహమూర్తుల పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. అలాగే కుక్కల పోటీలు జరిగాయి. ఇదిలాఉండగా, ఏటా ఎడ్లబండ్ల లాగుడు పోటీలు నిర్వహిస్తారు. ఈ ఏడాది ఈ పోటీలతో పాటు రెండేళ్లుగా కుక్కల పరుగు పోటీలు, పందుల కొట్లాట పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి ఔత్సాహికులు తరలివచ్చారు.

Read More