సారథి, మానవపాడు: ధరణి సేవలను ప్రజలకు అందుబాటులో పారదర్శకంగా అందించాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఈడీఎం ఫారూఖ్ సూచించారు. గురువారం మానవపాడు మండల కేంద్రంలోని మీసేవ సెంటర్లను ఆయన పరిశీలించారు. మీసేవ ద్వారా అందించే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు రైతులకు అందించే సేవలకు అధిక రేట్లు తీసుకోకుండా ప్రభుత్వం సేవలు అందించాలని సూచించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కూడా పారదర్శకత పాటించాలని ఆదేశించారు. అనంతరం మానపాడు తహసీల్దార్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ రైతులకు […]
సారథి, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని జల్లాపురం స్టేజీ వద్ద నకిలీ పత్తి విత్తనాలను సంబంధిత అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. అక్కడే ఉన్న మహాలక్ష్మీ హోటల్ లో 46 ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలను నిల్వచేసినట్లు తెలియడంతో వ్యవసాయాధికారి శ్వేత తనిఖీచేశారు. వాటిని సీజ్‌చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శేఖర్ అనే వ్యక్తి ఈ హోటల్ ను అడ్డాగా చేసుకుని సీడ్స్ అమ్ముతున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని ఎస్సై ఎం.సంతోష్ కుమార్ దర్యాప్తు […]
అట్టహాసంగా పల్లెప్రగతి ప్రారంభం అభివృద్ధికి అన్ని గ్రామాలు పోటీపడాలి జడ్పీ చైర్పర్సన్సరిత తిరుపతయ్య కలిసికట్టుగా గ్రామాల అభివృద్ధి: ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం సారథి, మానవపాడు: మన ఊరు మనందరి బాధ్యత అనుకుని ప్రతిఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య అన్నారు. గురువారం మానవపాడు మండలం కలుకుంట్ల గ్రామంలో నాలుగోవ విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహంతో కలిసి ఆమె ప్రారంభించారు. రైతు వేదిక […]
ఫొటోలకు ఫోజులు వద్దు.. పనులు చేయండి ప్రజలను భాగస్వాములు చేయండి జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య సారథి, మానవపాడు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న 4వ విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య కోరారు. బుధవారం మానవపాడు ఎంపీడీవో సమావేశ మందిరంలో ఎంపీపీ కోట్ల అశోక్ రెడ్డి అధ్యక్షతన ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్పర్సన్, జిల్లా అదనపు కలెక్టర్ […]
సారథి, మానవపాడు: పుష్కరాల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలో భాగంగా అలంపూర్ నియోజకవర్గానికి వంద పడకల ఆస్పత్రిని మంజూరుచేస్తే స్థానిక నాయకులు కొందరు రచ్చరచ్చ చేసి ప్రజలకు ఉపయోగకరంగా ఉండే చోటును కాదని అడ్డుపడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు ఆత్మలింగారెడ్డి ఆక్షేపించారు. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని అతిథిగృహంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సెంటర్ పాయింట్ […]
సారథి, అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఏపీ, తెలంగాణ బోర్డర్ పుల్లూరు టోల్ ప్లాజా వద్ద రాకపోకలను ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ సంపత్ కుమార్ బుధవారం పరిశీలించారు. అలంపూర్ ప్రాంతానికి కర్నూలు పట్టణం చేరువలో ఉండటంతో ప్రతి చిన్న పనికి అక్కడికి వెళ్లి రావాల్సి వస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. ఈ విషయమై అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అక్కడికి వచ్చి పరిస్థితులను సమీక్షించి జోగుళాంబ […]
సారథి, మానవపాడు: కరోనా మహమ్మారి నుంచి విముక్తి కల్పించాలని, అందరూ సుఖశాంతులతో జీవనం కొనసాగించాలని ముస్లింలు గురువారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని జామియా మసీదు ముతవల్లి మహబూబ్ పాషా కోరారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రతిఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించి.. సామాజిక దూరం పాటిస్తూ ఇళ్లలోనే రంజాన్ చేసుకోవాలని కోరారు.
సారథి, మానవపాడు: పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాలు చేస్తూ అందరి శ్రేయస్సు కోసం కులమతాలకు అతీతంగా ప్రార్థనలు చేయడం సంతోషంగా ఉందని డాక్టర్ మెడికల్ హుస్సేన్ అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో ఉపవాసాలు చేస్తూ సాయంత్రం వేళల్లో యువకులు ఆహ్లాదం కోసం కాసేపు క్రికెట్ ఆడటం సంతోషమన్నారు. క్రీడాకారులను దృష్టిలో ఉంచుకుని ఆయన రూ.ఆరువేల క్రికెట్ కిట్టును మానవపాడులోని జామియా మసీదు ఆవరణలో అందజేశారు. అలాగే వీఆర్వో హుస్సేన్ రూ.వెయ్యి నగదు, షాకీర్ […]