సారథి, రామడుగు: గతంలో మ్యుటేషన్ కోసం నెలల నుంచి ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ధరణి కార్యక్రమంతో రాష్ట్రంలోని అన్ని భూములను డిజిటలైజేషన్ చేయడం శుభపరిణామమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. కరీంనగర్జిల్లా రామడుగు మండల తహసీల్దార్ ఆఫీసులో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన రైతులకు విశ్రాంతి గది, రక్షిత తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్, ఆఫీస్ రెనవేషన్ రూములను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ కు […]
సారథి, చొప్పదండి: టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమానికి శుక్రవారం బయలుదేరిన చొప్పదండి కాంగ్రెస్ కార్యకర్తలను స్థానిక పోలీసులు అంబేద్కర్ చౌరస్తా వద్ద అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించాలని నినాదాలు చేసారు. అనంతరం డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏడేళ్లలో పెరిగిన పెట్రోడీజిల్ ధరల వల్ల పేద, మధ్యతరగతి ప్రజలపై రూ.36 లక్షల కోట్ల […]
సారథి, చొప్పదండి: చొప్పదండి మున్సిపల్ ఆఫీసులో చైర్ పర్సన్ గుర్రం నీరజారెడ్డి అధ్యక్షతన కమిషనర్ అంజయ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బందికి బ్లాంకెట్స్, బల్బ్స్, ఆఫ్రాన్స్, హెల్మెట్స్, గమ్ బూట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ.. కార్మికులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ ఇప్పనపెళ్లి విజయలక్ష్మి, కౌన్సిలర్లు మాడూరి శ్రీనివాస్, […]
సారథి, చొప్పదండి: కాంగ్రెస్ పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ను దూషించే స్థాయి పాడి కౌశిక్ రెడ్డిది కాదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తొత్తుగా మారి మానుకోటలో తెలంగాణ ఉద్యమకారులను […]
సారథి, చొప్పదండి: అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చొప్పదండి తహసీల్దార్ ఆఫీసు ఎదుట తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ.. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి […]
సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు రూ.8,02,500 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను సోమవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. గతంలో ముఖ్యమంత్రి సహాయనిధి అంటే ఎవరికీ తెలిసేది కాదన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న […]
సారథి, చొప్పదండి: సర్కారు భూముల అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 15న జరిగే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం చొప్పదండి మండలం రుక్మపూర్ గ్రామంలో సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూములను వేలం వేసి అమ్మడానికి నిర్ణయించడం దుర్మార్గమని, ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టి, వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పెట్టుబడిదారీవర్గాలకు, పార్టీ నాయకులకు అప్పనంగా […]
సారథి, చొప్పదండి: చొప్పదండి పట్టణ కేంద్రంలోని 6వ వార్డులో ఉన్న గ్రంథాలయాన్ని ఆధునికరించడానికి తక్షణమే నిధులు మంజూరుచేసి, సరైన వసతులు కల్పించాలని స్థానిక 6వ వార్డు కౌన్సిలర్ వడ్లూరి గంగరాజు శుక్రవారం ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డిని కలసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఉన్న గ్రంథాలయానికి మరమ్మతులు చేయించి కనీస వసతులు ఏర్పాటుచేసి ప్రశాంతమైన వాతావరణం కల్పించాలన్నారు. పోటీ పరీక్షల బుక్స్ ను లైబ్రరీకి అందివ్వాలని, పేద, మధ్యతరగతి […]