20 మందికి మాత్రమే నిర్ధారణ పరీక్షలు నిరాశతో వెనుదిరుగుతున్న జనం తాజాగా కొవిడ్‌తో వృద్ధుడు మృతి, అవసరమైన వారే టెస్టులు చేయించుకోండి: డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్ రావు సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ఓ వ్యక్తి(52) కరోనాతో బాధపడుతూ బుధవారం చనిపోయాడు. అతని పరిస్థితి విషమించడంతో స్థానిక ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రానికి ఆటోలో తీసుకొచ్చారు. ఆటోలోనే అతనికి వైద్యపరీక్షలు చేశారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో మెదక్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడికి చేరుకునేలోపే […]
సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో బుధవారం 43 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ముగ్గురికి పాజిటివ్ వచ్చిందని డాక్టర్ ఎలిజిబెత్ రాణి తెలిపారు. గ్రామాల్లో ప్రజలు మాస్కులు కట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని, రోగనిరోధకశక్తిని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, కరోనా పాజిటివ్వచ్చినవారు అధైర్యపడొద్దని సూచించారు. మెడికల్ టెస్టులు నిర్వహించిన వారిలో ఏఎన్ఎం రేణుక, ఆశావర్కర్లు సంతోష, రేఖ, పుష్ప, మమత […]
సారథి న్యూస్, హైదారాబాద్: సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియా ఆస్పత్రుల్లో కోవిడ్ 19 వైద్యసేవల కోసం ఇప్పటివరకు రూ.8కోట్ల విలువైన మందులు, కిట్లు, సూట్లు పరికరాలను సిద్ధంగా ఉంచామని, మరో 21మంది డాక్టర్లను వైద్యసేవల కోసం తాత్కాలికంగా నియమించామని సంస్థ చైర్మన్, ఎండీ ఎం.శ్రీధర్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం సింగరేణి ఆస్పత్రిల్లో కరోనాకు కేటాయించిన 643 బెడ్లకు అదనంగా మరో 600 బెడ్లను సిద్ధం చేసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. […]