టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటికి అధికారులు నోటీసులు జారీచేశారు. ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలో చంద్రబాబు అద్దె ఇంట్లో ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కృష్ణానదికి వరద భారీగా వస్తుండటంతో చంద్రబాబు ఈ ఇంటిని వెంటనే ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీచేశారు. కొంతకాలంగా ఏపీలో వర్షాలు జోరుగా కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాల దాటికి వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 16.2 అడుగులకు […]
అమరావతి: వరుస ఎదురుదెబ్బలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చంద్రబాబు, యువనేత లోకేశ్ మీద నమ్మకం లేక పలువురు కీలకనేతలు ఆ పార్టీని వీడుతున్నారు. మరికొందరు పార్టీలోనే ఉన్నా అధికారిక కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. ఈ క్రమంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో సీఎం జగన్మోహన్రెడ్డి రమేష్‌బాబుకు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ […]
ఢిల్లీ: విపక్షాల ఆరోపణలు, కోర్టు వ్యతిరేక తీర్పులు, అమరావతి ఉద్యమం ఇవేవీ ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ప్రజలకు ఉన్న ఆదరణను ఏమాత్రం తగ్గించలేకపోయాయి. భారీమెజార్టీతో అధికారం చేపట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో సంక్షేమపథకాలను ప్రారంభించారు. అయినప్పటికీ ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. అనేక జీవోలను కోర్టు రద్దుచేసింది కూడా. అయినప్పటికీ ప్రజల్లో జగన్‌పై ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. అందుకు నిదర్శనమే తాజాగా ఇండియా టుడే చేసిన సర్వే. ఈ సర్వేలో […]
ఆంధ్రప్రదేశ్ సారథి న్యూస్, అమరావతి: లాక్ డౌన్ కారణంగా గుజరాత్లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుజరాత్ సీఎం విజయ్ రూపానీని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఫోన్ లో మాట్లాడారు. వసతి, భోజన సదుపాయాల విషయంలో అసౌకర్యాలు లేకుండా చూడాలని కోరారు. సానుకూలంగా స్పందించిన గుజరాత్ సీఎం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.