సారథి, అచ్చంపేట: అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు విజ్ఞప్తి మేరకు స్థానిక సివిల్ ఆస్పత్రికి నాలుగు ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు స్పోటన్ లాజిస్టిక్ సంస్థ వారు, అడిషనల్ కలెక్టర్ మనుచౌదరి, డీఎంహెచ్ వో డాక్టర్ కె.సుధాకర్ లాల్ చేతులమీదుగా మంగళవారం అందజేశారు. ఈ ప్రాంతంలోని ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యసేవలు అందించగలమని డీఎంహెచ్ వో అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, స్పోటన్ లాజిస్టిక్స్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ […]
సారథి, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని బల్మూ ర్, కొండనాగుల, రామాజిపల్లి గ్రామాల్లోని సీడ్ డీలర్ షాపులను మండల వ్యవసాయాధికారి మహేష్ కుమార్, ఇన్ చార్జ్ సబ్ ఇన్ స్పెక్టర్ కృష్ణయ్య మంగళవారం తనిఖీచేశారు. డీలర్లు ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీ విత్తనాలను మాత్రమే అమ్మాలని, లూజ్ సీడ్స్ ను అమ్మకూడదని, కొనుగోలు చేసే రైతుకు రసీదు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. షాపు బయట ధరలపట్టిక, స్టాక్ బోర్డు ఉంచాలని ఆదేశించారు. నకిలీ సీడ్ […]
సారథి, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ హైస్కూలులో కరోనా సూపర్ స్ప్రెడర్ల కోసం ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ సెంటర్ ను జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.సుధాకర్ లాల్ శుక్రవారం సందర్శించారు. నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి, వారి అవసరాలు తీర్చే రేషన్ డీలర్లు, జర్నలిస్టులు, గ్యాస్, పెట్రోల్ బంక్ కార్మికులు, ఎరువుల దుకాణదారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ తదితరులకు ప్రధాన వాహకులుగా భావించి వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ […]
సారథి, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం కాంసానిపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ యువకుడు కరోనాతో మృతిచెందాడు. యువకుడి మృతితో గ్రామస్తులంతా భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో మొదటి కరోనా మరణం జరగడంతో గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. శవాన్ని పూడ్చి పెట్టడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో సర్పంచ్ కర్నె లక్ష్మీనారాయణ పీపీఈ కిట్టు ధరించి అంత్యక్రియలు చేయడానికి ముందుకొచ్చారు. అక్కడే ఉన్న పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ తో పాటు మరో నలుగురు యువకులు సర్పంచ్ […]
సారథి న్యూస్, అచ్చంపేట: తెలంగాణ 7వ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ కోసం జిల్లాస్థాయి సెలక్షన్లు బుధవారం అచ్చంపేట సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీలను ఎస్సై ప్రదీప్ కుమార్ ప్రారంభించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఉత్తమ క్రీడా నైపుణ్యాలు ప్రదర్శించి రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి దాదాపు 300 మంది బాల, బాలికలు పాల్గొన్నారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు జనవరి […]
సారథి న్యూస్, అచ్చంపేట: తరాల భూముల తగవులకు ముగింపు పలికేలా, కొత్త తరాలకు ఏ చిన్న ఇబ్బంది లేకుండా కొత్త చట్టం ఉందని, తెలంగాణ రైతుల కష్టాలు తీర్చడమే ధ్యేయంగా సీఎం రెవెన్యూలో భారీ సంస్కరణలకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు శ్రీకారం చుట్టారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కొనియాడారు. నూతన రెవెన్యూ చట్టం అమలు సందర్భంగా.. సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు సంఘీభావం తెలియజేస్తూ శుక్రవారం ఉదయం అచ్చంపేటలో నియోజకవర్గ రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా వ్యవసాయశాఖ మంత్రి […]
సారథి న్యూస్, అచ్చంపేట: సమాచార హక్కు రక్షణ చట్టం (2005) అచ్చంపేట మండల కమిటీ మీడియా కన్వీనర్ గా రేసోజు సాయిబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు గురువారం ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భోగరాజు ప్రశాంత్, జిల్లా అధ్యక్షుడు కృష్ణప్రసాద్, మండలాధ్యక్షుడు పోల స్వామి నియామక పత్రం అందజేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మీడియా కన్వీనర్ గా […]
సారథి న్యూస్, అచ్చంపేట: భారీవర్షాలకు నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట సమీపంలోని డిండి వాగు ఉధృతిలో చిక్కుకుపోయిన భార్యాభార్తలు సురక్షితంగా బయటపడ్డారు. అచ్చంపేట మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన సభావత్ వెంకట్రాములు, విజయ దంపతులు వ్యవసాయ పొలం పనులకు వెళ్లారు. వాగు ఉధృతి పెరగడంతో బుధవారం సాయంత్రం నీటిలో కొట్టుకుపోయి.. చెట్లను పట్టుకుని ఒడ్డుకు చేరారు. విషయం తెలుసుకున్న అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్గువ్వల బాలరాజు సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్‌కుమార్‌తో మాట్లాడి హెలిక్యాప్టర్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించాలని […]