సామాజిక సారథి, జహీరాబాద్: ప్రజలు కోవిడ్ బారిన పడకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని, విధిగా వ్యాక్సినేషన్ తీసుకోవాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా కోరారు. సోమవారం జహీరాబాద్ మండలపరిధిలోని షేఖాపూర్ గ్రామ పంచాయతీ లో వాక్సినేషన్ ప్రక్రియ ను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలో డోర్ టు డోర్ వాక్సినేషన్ కార్యక్రమములో పాల్గొని మాట్లాడుతూ అందరూ వాక్సిన్ తీసుకోవాలన్నారు. కొవిడ్ క్రొత్త రకం ఒమిక్రాన్ కేసులు దేశములో పెరుగుతున్నాయనీ తెలిపారు. జిల్లాలో డిసెంబర్ 31 వరకు […]
సామాజిక సారథి, జహీరాబాద్: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ శంకర్ రాజు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం జహీరాబాద్, మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామం ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైబర్ అంబాసిడర్ కార్యక్రమంలో మాట్లాడారు. ఆన్ లైన్ లో సైబర్ సెక్యూరిటీ, ఆన్ లైన్ నేరాలు, మాట్రిమోనియల్ ఫ్రాడ్స్, ఫిష్ క్యాచింగ్, లాటరీ స్కాం వంటి అంశాలపై 6 నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ రూరల్ ఎస్సై […]
సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేటకు చెందిన రంగరి పండరినాథ్ మృతి విషయంలో జహీరాబాద్ మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, మాజీ ఎంపీపీ సంజీవరెడ్డి తనపై చేసిన ఆరోపణలు సరికాదని ఎంపీపీ జంగం శ్రీనివాస్ హితవు పలికారు. బుధవారం పెద్దశంకరంపేటలోని తన నివాసంలో టీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పండరినాథ్ మృతి కేసు కోర్టు ఎప్పుడో కొట్టివేసిందని, అవసరమైతే పైకోర్టుల్లో అప్పీలు చేసుకోవచ్చన్నారు. చట్టాలు ఎవరికీ చుట్టం కాదని పేర్కొన్నారు. కేసు విషయంలో పూర్తివివరాలు తెలుసుకొని […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్ రాజ్ అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలోని మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ ఆశయ సాధనకు నిరంతరం కృషిచేస్తామని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అనేక రంగాల్లో ముందుకెళ్తుందన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పై బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. వారి వెంట బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంజయ్ యాదవ్, […]