సారథి న్యూస్, కర్నూలు: నగరంలోని స్థానిక కూరగాయల మార్కెట్ యార్డు ఆవరణను కర్నూలు ఎమ్మెల్యే హఫిజ్ ఖాన్ సందర్శించారు. విక్రయదారుల బాధలుసాదకాలు తెలుసుకున్నారు. ప్రస్తుత సమయంలో ఎక్కువ ధరలకు అమ్మకుండా సామాన్యులకు అందుబాటులో రేట్లు ఉండేలా అమ్మాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో వరుసగా షాకులు తగులుతున్నాయి. ఏపీలో పత్రికలకు ప్రకటనలు ఇవ్వడంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, పక్షపాత వైఖరిపై సామాజిక కార్యకర్త నాగశ్రవణ్ వేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. అధికార పార్టీకి చెందిన పత్రికకు 52 శాతం ప్రకటనలు ఇస్తున్నారని నాగశ్రవణ్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. అయితే టీడీపీ నేతలే పిటిషన్ వేయించారని, పిల్‌ను తిరస్కరించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై పిటిషనర్ తరఫున న్యాయవాది దమ్మాలపాటి […]
సారథి న్యూస్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి బుధవారం కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, విజయ మనోహరి దంపతులు తన నివాసంలో పూలాభిషేకం చేశారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాలాభిషేకం చేస్తే పాల కొరత వస్తుందని, పూలతో అభిషేకం నిర్వహించడంతో స్థానికులు ఎస్వీ దంపతులను అభినందించారు. వైఎస్సార్ పేదవాడి గుండెచప్పుడు తెలిసిన ప్రజానాయకుడని కొనియాడారు. అనంతరం కర్నూలు ఎస్టీబీసీ కాలేజీలో నిర్వహించిన వైఎస్సార్ […]
సారథి న్యూస్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి వేడుకలు కర్నూలు నగరంలో బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ మేరకు పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. నగరంలోని బుధవారపేట 15 వార్డులో సమన్వయకర్త మాదారపు కేదార్ నాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని పార్టీ నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జ్ బి.వై. రామయ్య ప్రారంభించారు. వైఎస్సార్ సంక్షేమ పథకాలు జనహృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని ఆయన అన్నారు. లక్షలాది మంది […]
సారథి న్యూస్, కర్నూలు: పాత కార్మికులను తొలగించి వారి స్థానంలో డబ్బు వసూలు చేసి కొత్త వారిని నియమించారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆరోపణలు చేసే వారు దమ్ముంటే నిరూపించాలని నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ సవాల్ విసిరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొందరు తమ పార్టీ నాయకులే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం కార్మికుల జీవితాలతో ఆటలాడడం సరికాదన్నారు. ప్రతి కార్మికుడికి అండగా ఉండి సేవచేస్తానని, వీలైనంత సాయం చేస్తానే […]
సారథి న్యూస్, కర్నూలు: వచ్చే ఎన్నికల్లో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని వైఎస్సార్ సీపీ నగర సమన్వయకర్త మాదారపు కేదార్ నాథ్ అన్నారు. సోమవారం బాపట్ల ఎంపీ నందిగామ సురేష్, వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలు పాత బస్టాండ్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. […]
సారథి న్యూస్, కర్నూలు: దళితుల అభ్యున్నతికి అడుగడుగునా అడ్డుపడే మాజీ సీఎం చంద్రబాబు.. ఉన్నట్టుండి దళితులపై ప్రేమ ఎందుకు ఒలకబోస్తున్నారని లీడర్స్ యూత్ సొసైటీ అధ్యక్షు మాదారపు కేదార్నాథ్ప్రశ్నించారు. తన హయాంలో దళితులపై దాడులు చేయించడంతోపాటు అవమానపరిచేలా మాట్లాడిన వ్యక్తి.. ప్రతిపక్షంలో ఉన్నందుకు వారిపై కపటప్రేమ చూపుతున్నారని విమర్శించారు. శుక్రవారం ఆయన వైఎస్సార్సీపీ ఆఫీసులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇళ్లస్థలాలు ఇస్తుంటే.. ఓర్వలేకే చంద్రబాబు అడ్డుపడ్డారని గుర్తుచేశారు. ఇలాగే చేస్తే ఆయనకు […]
సారథి న్యూస్, కర్నూలు: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భారీ విగ్రహాల ప్రతిష్టాపనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ప్రజలు ఇళ్ల వద్దనే చిన్న చిన్న మట్టి విగ్రహాలను ఏర్పాటుచేసుకుని పూజిస్తున్నారు. నగరంలోని బుధవారపేట 15వ వార్డులో వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేదార్నాథ్ఇంటివద్దే మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించారు. రెండొందల బిందెల నీళ్లు తమ భక్తిని నాటుకున్నారు. మట్టి గణపయ్య విశిష్టతను తెలియజేసేలా ఈ వినాయకుడిని నిలబెట్టినట్లు తెలిపారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారని తెలిపారు.