సారథి న్యూస్, కడప: దివంగత మాజీ ముఖ‍్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం వైఎస్సార్ 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అంజలి ఘటించారు. కార్యక్రమంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి రెడ్డి, వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ […]
సారథి న్యూస్, అనంతపురం: దివంగత మహానేత వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ రాసిన ‘‘నాలో.. నాతో… వైఎస్సార్’ పుస్తకాన్ని మహానేత 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. తన మాతృమూర్తి రాసిన ఈ పుస్తకాన్ని మహానేత తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. డాక్టర్ వైఎస్సార్ సహధర్మచారిణిగా వైఎస్ విజయమ్మ 37ఏళ్ల జీవితసారమే ఈ పుస్తకం. 2009 సెప్టెంబర్ 2న అనూహ్యంగా వైఎస్సార్ మరణించిన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారం ఈ పుస్తకం. […]
ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు అభివృద్ధికి అడ్డుగా మారిన వైరస్ తాజాగా ఇళ్ల పట్టాల పంపిణీకి చెక్ సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు పెరగడంలో పలు జిల్లాలు పోటీపడుతున్నాయి. భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు కట్టుకోకపోవడంతో కేసులు పెరుగుతున్నాయి. మార్చి 25 నుంచి మే 30వ తేదీ వరకు లాక్ డౌన్ విధించినప్పుడు నియంత్రణలో ఉన్న కరోనా వైరస్ లాక్ ఓపెన్ చేసిన తర్వాత పంజా విసిరింది. […]
సారథి న్యూస్, అనంతపురం: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి(జులై 8)ని రైతు దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఏడాది వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించాలని వ్యవసాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. రైతుల కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి అనేక సంక్షేమ చర్యలు చేపట్టారని, ఆయన సంస్మరణార్థం రైతు దినోత్సవం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయంపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
సారథి న్యూస్, అనంతపురం: ఫాదర్స్ డే సందర్భంగా ఆదివారం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘నాన్నే నా బలం, ఆదర్శం. జీవితంలోని ప్రతి కీలకఘట్టంలో నాన్నే నాకు స్ఫూర్తి. ప్రతీ తండ్రి పిల్లల గెలుపు కోసం ప్రయత్నిస్తాడు. పిల్లలకు ప్రేమను.. స్ఫూర్తిని పంచుతారు. కష్టకాలంలో అండగా ఉంటారు, ప్రేమిస్తారు. నాన్నే మనకు తొలి స్నేహితుడు, గురువు, […]