సామాజికసారథి, బిజినేపల్లి: తెలంగాణ డెంటల్డాక్టర్స్ అసోసియేషన్రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు, యువనేత డాక్టర్ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి మంగళవారం యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకున్నారు. ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉందని ఆయన కొనియాడారు. సకాలంలో వర్షాలు కురిసి.. పాడిపంటలు కలగాలని.. కరోనా పీడ పూర్తిగా తొలగాలని.. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన స్వామివారిని వేడుకున్నట్లు చెప్పారు. రాజేశ్‌రెడ్డి వెంట పలువురు కుటుంబసభ్యులు, సన్నిహితులు ఉన్నారు.
భువనగిరి కలెక్టరేట్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం వారించిన సిబ్బంది సామాజికసారథి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. బాధితుడి కథనం.. బుడిగే మహేశ్ తండ్రి ఉప్పలయ్య ఆలేరు మండలం కొలనుపాకలో 20ఏళ్ల క్రితం నాలుగు ఎకరాల భూమిని రూ.ఆరువేలకు కొన్నాడు. ఇప్పటి వరకు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వకపోవడంతో లోన్లు, ఇతర సౌకర్యాలు రావడం లేదు. దీంతో మహేశ్ మనస్తాపం చెందాడు. […]
సామాజిక సారథి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి ప్రధాన ఆలయ విమాన గోపురానికి స్వర్ణం తాపడం కోసం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రెండు కిలోల బంగారాన్ని విరాళంగా అందజేశారు. సీఎం కేసీఆర్ సమక్షంలోనే ఆయన గతంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ హామీ మేరకు బంగారాన్ని ఆలయానికి అప్పగించారు. శుక్రవారం కుటుంబసమేతంగా లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం పలికారు. అంతకుముందు ఆలయ మర్యాదలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం […]
సామాజిక సారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ విమాన గోపురం స్వర్ణం తాపడానికి నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి రెండు కేజీల బంగారాన్ని శుక్రవారం ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు. తెలంగాణ కళావైభవం చాటేలా, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గతంలో ఆయన సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ముందుకొచ్చి.. తాజాగా రెండు కేజీల బంగారాన్ని అందజేశారు. నారసింహుడి ఆలయాన్ని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి కుటుంబసమేతంగా […]
ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి అభివృద్ధి అత్యంత సుందరంగా ఉండేలా ఆలయ నిర్మాణపనులు పనుల కోసం మూడు వారాల్లో రూ.75 కోట్లు విడుదల యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న సీఎం కె.చంద్రశేఖర్‌రావు సారథి న్యూస్, యాదాద్రి భువనగిరి: ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. రాబోయే కాలంలో అనేక ఏళ్లపాటు నిలవాల్సిన గొప్ప నిర్మాణం కావునా ఎక్కడా తొందరపాటు లేకుండా సంప్రదాయాలు, ఆగమశాస్త్ర నియమాలు పాటిస్తూ నిర్మాణం జరగాలని […]
సారథి న్యూస్, యాదాద్రి: యాదాద్రి ఆంజనేయ, నరసింహ అరణ్యం అర్బన్ ఫారెస్ట్ పార్కులను దేవాదాయశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, రాజ్యసభ్య సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ శుక్రవారం ప్రారంభించారు. అరణ్యంలో కాలినడకన తిరుగుతూ సందర్శకుల కోసం ఏర్పాటుచేసిన సౌకర్యాలను పరిశీలించారు. అటవీశాఖ ప్రాంతాన్ని వ్యూ పాయింట్ నుంచి తిలకించారు. హరితహారం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు అడవులను కాపాడుకునేందుకు అత్యంత కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని వెల్లడించారు. సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆలోచనలకు అనుకూలంగా హైదరాబాద్ నలువైపులా ఇతర పట్టణాలకు […]
సారథి న్యూస్, యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా యాదగిరిపల్లి శివారులో ఏర్పాటుచేస్తున్న ప్రెసిడెన్షియల్ సూట్ లోని ఒక భవనం వద్ద స్లాబ్ బుధవారం కూలింది. ఈ ప్రమాదంలో కూలీలు అప్పన్న (శ్రీకాకుళం), చెన్నయ్య (మహబూబ్‌నగర్), వెంకటస్వామి (మహబూబ్‌నగర్), రాములు(తాండూర్) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. విల్లా-6 స్లాబ్ నిర్మాణం చేస్తుండగా నాణ్యత లోపించి స్లాబ్ సుమారు 20అడుగు లోతు మేర కూలింది.