వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై.. కమలా హారిస్ నిప్పులు చెరిగారు. డెమొక్రాటిక్ తరఫున కమల ఉపాధ్యక్ష పదవికి పోటీచేస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ విషయంలో ట్రంప్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఒక వేళ ఆయన చెప్పిన తేదీకి వ్యాక్సిన్ వచ్చినా.. దాని సేఫ్టీ విషయాన్ని నమ్మలేమన్నారు. మరోవైపు కరోనా కట్టడిలో ట్రంప్ ఘోరంగా ఫెయిల్ అయ్యారని డెమోక్రాట్లు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమలా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నవంబర్ 1నాటికి వ్యాక్సిన్ […]
ముంబై: బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు ఉపిరితిత్తుల క్యాన్సర్ వచ్చినట్టు డాక్టర్లు నిర్ధారించారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యానికి గురికావడంతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించగా క్యాన్సర్ వచ్చినట్టు నిర్ధారణ అయ్యింది. కాగా సంజయ్ మెరుగైన వైద్యం కోసం అమెరికాకు వెళ్లనున్నట్టు సమచారం. ఆయన ప్రస్తుతం కేజీఎఫ్ 2, శమ్‌షేరా తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. సంజయ్ నటించిన కొన్ని వెబ్‌సీరిస్‌లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
వాషింగ్టన్: కరోనా మహమ్మారిని యూఎస్ బాగా కట్టడి చేసిందని, ఇండియా మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘మనం చాలా బాగా చేస్తున్నామని అనుకుంటున్నాను. ఏ దేశం చేయని విధంగా మనం పనిచేశామని అనుకుంటున్నాను. మీరు పరిశీలిస్తే ఇప్పుడు ఏ దేశాల గురించి మాట్లాడుకుంటున్నారో తెలుస్తోంది. మనది చైనా, ఇండియా మినహా మిగతా దేశాల కంటే పెద్ద దేశం. చైనా ప్రస్తుతం భారీ మంటలను ఎదుర్కొంటోంది. ఇండియా విపరీతమైన సమస్యను ఎదుర్కొంటోంది. భారతదేశానికి […]
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వంపై మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాను కట్టడి చేయడంలో అమెరికా ప్రభుత్వం విఫలమైందన్నారు. ‘అమెరికాలో టెస్టులు చేసిన 24 గంటలకు ఫలితాలు వస్తున్నాయి. ఇది ఒక పనికిమాలిన విధానం. దీనివల్ల ఎటువంటి ఫలితం ఉండదు. టెస్టులు చేయించుకున్న కరోనా అనుమానితులు ఇష్టమున్నట్టు ప్రజల్లో తిరిగి కరోనాను వ్యాపింపచేస్తారు. దీంతో కరోనా మరింత పెరుగుతుంది. టెస్టులు చేసిన కొన్ని నిమిషాల్లోనే ఫలితాలు రావాలి. కరోనా పేషేంట్లందరనీ క్వారంటైన్ చేయాలి అప్పడే వ్యాధిని […]
వాషింగ్టన్: అమెరికాలోనూ త్వరలో టిక్‌టాక్‌పై నిషేధం విధించనున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు వైట్‌హౌస్ ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు. కాగా తాజాగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలో టిక్‌టాక్‌పై నిషేధం విధించాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే తాను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేయబోతున్నట్టు ప్రకటించారు. టిక్‌టాక్, మైక్రోసాఫ్ట్ ఒప్పందానికి తాను వ్యతిరేకమని ఆయన ప్రకటించారు.
వాషింగ్టన్: అమెరికాకు చెందని పౌరహక్కుల నేత, కాంగ్రెస్ సభ్యుడు జాన్ లూయిస్(80) ప్రాణాలు కోల్పోయారు. గత కొంతకాలంగా ఆయన ప్యాంక్రియాటిక్ కేన్సర్‌తో బాధపడుతున్నారు. జాన్ అమెరికాలో ఎన్నో పౌరహక్కుల ఉద్యమాలు చేశారు. యూఎస్ ప్రతినిధుల సభలోనూ సభ్యుడికి వ్యవహరించారు. 1965లో ఆయనను అమెరికన్ పోలీసులు దారుణంగా కొట్టారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అప్పుడు ప్రాణాలతో బయటపడ్డ జాన్ పౌరహక్కుల ఉద్యమనేతగా ఎదిగారు. ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఆయన మృతికి అమెరికా మాజీ ప్రెసిడెంట్ […]
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి మాస్క్ ధరించి ప్రత్యక్షమయ్యాడు. తాజాగా వాషింగ్టన్ సమీపంలోని వాల్టర్‌రీడ్ మిలటరీ దవాఖానను సందర్శించిన ఆయన మాస్కును ధరించాడు. అమెరికాలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ ట్రంప్ మాస్క్ ధరించలేదు. మాస్క్ ఎందుకు పెట్టుకోరంటూ మీడియా ప్రశ్నించిన ప్రతిసారి.. ఎదురు దాడికి దిగేవారు. ఈ క్రమంలో తొలిసారిగా మాస్క్ ధరించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అమెరికాలో త్వరలో ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులు మాస్క్ అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. […]
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా విదేశీ విద్యార్థులకు షాక్ ఇచ్చింది. వివిధ కాలేజీల్లో చదువుతున్న ఫారెన్ స్టూడెంట్స్ పూర్తి ఆన్‌లైన్ క్లాసులకు అటెండ్ అయ్యేలా ఉంటే తమ దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చాలా కాలేజీలు ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా.. కొత్తగా అడ్మిషన్ తీసుకునే వారు కూడా ఆన్‌లైన్ క్లాసులను ఆప్ట్ చేసుకుంటే వారికి వీసాలు జారీ చేసేది లేదని యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్ […]