టాలీవుడ్ ప్రఖ్యాత కామెడీ నటుడైన అలీ కొద్దిరోజులుగా ఫేస్బుక్, ట్విట్టర్లో తాను పెట్టని కమెంట్ల గురించి ఆశ్చర్యంలో ఉన్నారు. అందరూ ఆ ట్విట్టర్ అలీదే అనుకున్నారట కూడా. వాటి వల్ల తను ఇబ్బందులకు గురవుతున్నాడట. ‘వ్యక్తిత్వంలో నిన్ను ఓడించలేనప్పుడు నీ కులం, గుణం, వర్ణం గురించి మాట్లాడతారు.. ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా చెదరని నీ నవ్వు నీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు..’ అని అలీ పేరుతో ఓ ట్వీట్ రాగా.. దానికి ప్రతిగా పవన్ […]
‘కరోనా కట్టడికి మాస్క్ తప్పనిసరిగా ధరించండి.. మిమ్మల్ని మీరు కాపాడుకోండి.. మీ కుటుంబాన్ని.. దేశాన్ని కూడా కాపాడండి.. ప్లీజ్..’ అంటూ ట్విటర్లో ఒక వీడియో ట్వీట్ చేస్తూ మెగాస్టార్ సందేశాన్నిచ్చారు. చిరునవ్వు ముఖానికి అందం..కానీ ఆ చిరునవ్వు కలకాలం నిలవాలంటే.. మాస్క్ ధరించాలంటూ యువ హీరోయిన్ ఈషారెబ్బతో కలిసి చేసిన చిరు సందేశం అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇలాంటిదే ‘ఆర్ఎక్స్100’ హీరో కార్తికేయతో కలిసి మరో వీడియో సందేశాన్ని కూడా అందించారు. ‘మీసం మెలేయడం వీరత్వం అనేది ఒకప్పుడు.. […]
సారథిన్యూస్, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి లాక్‌డౌన్ విధించాలనుకోవడం సరైన నిర్ణయం కాదని మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ పెట్టాలని యోచిస్తున్నదని తెలుస్తున్నది. కానీ ఇది సరైన నిర్ణయం కాదు. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్ విధించడం చారిత్రాత్మక తప్పిదం’ అని ఆయన ట్వీట్ చేశారు. లాక్‌డౌన్‌తో ఎందరో ఉపాధి కోల్పోతారు. ఇది ఏ మాత్రం సరైన నిర్ణయం కాదని వ్యాఖ్యానించారు.
తానూ ఐదేండ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నానంటూ ఊసరవెళ్లి’ చిత్రం ఫేమ్ పాయల్ ఘోష్ ఓ ట్వీట్ పెట్టింది. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తాను డిప్రెషన్‌కు గురైనప్పుడల్లా తన కుటుంబ సభ్యులు, స్నేహితులు అండగా నిలబడుతున్నారని పాయల్ చెప్పుకొచ్చింది. మరోవైపు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాధ కలిగించిందని ట్వీట్లో పేర్కొంది. 2009లో ‘ప్రయాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది పాయల్. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. తర్వాత ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ సినిమాలో […]
ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టినరోజు మే 28.. ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ గురువారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తాతకు నివాళులర్పించాడు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తన భావాలను షేర్ చేసుకున్నాడు. ‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది, పెద్ద మనసుతో ఈ […]
మొదటిసారి జారీ చేసిన ట్విట్టర్ వాషింగ్టన్: ఎన్నికల్లో మెయిల్ ఇన్ బ్యాలెట్ వాడడం వల్ల మోసం జరిగే అవకాశం ఉందని ఆరోపిస్తూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్లకు ట్విట్టర్ ‘ఫ్యాక్ట్ చెక్’ వార్నింగ్ ఇచ్చింది. ఎలక్షన్స్‌కు సంబంధించి ఆయన చేసిన రెండు ట్వీట్లు నిజమో కాదో తెలుసుకోవాలని నెటిజన్లకు ట్విట్టర్ సూచించింది. ట్రంప్ ట్విట్లకు‘ఫ్యాక్ట్ చెక్’ వార్నింగ్‌ను ఇవ్వడం ఇదే మొదటిసారి. ట్విట్టర్ వాడకంలో ట్రంప్ తన పరిమితులను దాటి ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని ఈ […]