లక్ష తులసి దళాలతో అర్చన జ్యోతివాస్తు విద్యాపీఠం పుష్కర పూజలు సారథి న్యూస్, మానవపాడు: తుంగభద్ర నది పుష్కర మహోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పుల్లూరు గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయ ఆవరణలో పీఠాధిపతి జ్యోతి వాస్తు విద్యాపీఠం సిద్ధాంత భాస్కర మహేశ్వరశర్మ ఆధ్వర్యంలో బాసర సరస్వతి అమ్మవారికి లక్ష తులసి దళాల అర్చన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మొదట పుష్కర ఘాట్ లో సరస్వతి దేవి విగ్రహానికి అభిషేకం నిర్వహించారు. మహిళలు ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం చెన్నకేశవ స్వామి […]
సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఉమ్మడి మండలంలోని పుల్లూరు గ్రామంలో ఏర్పాటుచేసిన పుష్కర ఘాట్ లో బుధవారం ఏకాదశి రోజున ప్రభాత సంకీర్తనం, అమ్మవారి పుష్కరస్నానం కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని సర్పంచ్ నారాయణమ్మ, గ్రామస్తులు గిరిధర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, గజేందర్ రెడ్డి, ఏకాంత్, నీలప్ప తెలిపారు. జ్యోతిర్వాస్తు పీఠాధిపతి మహేశ్వర సిద్ధాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. రెండొందల మంది బ్రాహ్మణులతో ప్రత్యేకపూజలు, అమ్మవారికి పుష్కరస్నానం ఉంటుందని పేర్కొన్నారు. […]
సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల జిల్లా: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు అమరవాయి గ్రామంలో మాజీ ఎంపీపీ జయమ్మ ప్రకాష్ గౌడ్ నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయలేదని మండిపడ్డారు. ఈరోజు తెలంగాణ నీళ్లను ఆంధ్రప్రదేశ్ ఎత్తుకుపోతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తుంగభద్ర నదికి […]
సారథి న్యూస్, కర్నూలు: నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు జరిగే తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి ప్రణాళిక రూపొందించాలని జేసీ–2(అభివృద్ధి) రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్లో డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసులు, హౌసింగ్ పీడీ, ఎన్‌ఐసీ జిల్లా ఇన్‌చార్జ్ అరుణతో పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలు, ఏర్పాట్లకు సంబంధించి త్వరగా నివేదిక సమర్పించామన్నారు. జిల్లాలోని మంత్రాయం, కౌతాళం, కోడుమూరు, కర్నూలు తదితర ప్రాంతాల్లో ఏర్పాటుచేసే […]
నవంబర్ 20 నుంచి ‘తుంగభద్ర’ పుష్కరాలు కోవిడ్–19 నిబంధనలు తప్పనిసరి పాటించాల్సిందే పుష్కర ఘాట్ల పనులను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ సారథి న్యూస్, కర్నూలు, మంత్రాలయం: ఈ ఏడాది నవంబర్20 నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు నిర్వహించే తుంగభద్ర నది పుష్కరాలకు ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ జి.వీరపాండియన్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని కౌతాళం మండలం మేలిగనూరు పుష్కర్‌ఘాట్–1, మంత్రాయంలోని కాచాపురం పుష్కర ఘాట్–2, రామలింగేశ్వర స్వామి దేవాయం రాంపురం పుష్కర […]
అన్నీ కోల్పోయిన కృష్ణా, తుంగభద్ర నదీతీర వాసులు ఎవరిని పలకరించినా కన్నీళ్లే నేటికీ ఇండ్లు కట్టలే.. స్థలాలు ఇవ్వలే మద్దూర్ లో నేటికీ అడుగుపెట్టని జిల్లా కలెక్టర్, మంత్రులు సారథిన్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లా తుంగభద్ర, కృష్ణానది తీర గ్రామాల ప్రజల్లో నాటి వరద భయం ఇంకా వీడడం లేదు. చిన్నపాటి వర్షం వచ్చిన నదులు పొంగుతాయని, వరద వస్తుందేమోననే గుబులు వెంటాడుతోంది. 11 ఏళ్ల క్రితం..2009 అక్టోబర్ 2న సంభవించిన ఆ రెండు […]
సారథి న్యూస్, కర్నూలు: నగరంలోని స్థానిక జమ్మిచెట్టు సమీపంలో ఉన్న హంద్రీ నది వద్ద అమృత్ పథకం నిధులతో మురుగు నీటి శుద్ధికి రూ.47.93కోట్లతో పనులను ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్, మున్సిపల్కా ర్పొరేషన్కమిషనర్ డీకే బాలాజీ ఆదివారం ప్రారంభించారు. హంద్రీ, తుంగభద్ర నుంచి వచ్చే మురుగు నీరు డైరెక్ట్‌గా వెళ్లిపోవడం ద్వారా తాగినవారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. తుంగభద్ర హంద్రీ నీటిలో ఒక్క చుక్క వృథా కాకుండా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ […]
ఏర్పాట్లకు పూర్తిస్థాయిలో సహకరిస్తాం ఎమ్మెల్యేకు హామీ ఇచ్చిన జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనిల్‌యాదవ్ సారథి న్యూస్, కర్నూలు: పన్నెండేళ్లకోసారి వచ్చే తుంగభద్ర పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని, అందుకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌కు హామీ ఇచ్చారు. శుక్రవారం అమరావతిలో నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా […]