వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కోరోనా బారినపడ్డారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారినపడి విషయం తెలిసిందే. వారంతా కార్పొరేట్ దవాఖానల్లో చికిత్సపొంది కోలుకున్నారు.
ముంబై: కరోనాతో లక్షణాలతో కోవిడ్ సెంటర్లో చేరిన ఓ మహిళపై యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ హేయమైన ఘటన ముంబైలో చోటుచేసుకున్నది. కరోనా లక్షణాలతో ఓ మహిళ(40) నేవీ ముంబైలోని కోవిడ్ సెంటర్లో చేరింది. మహిళ రెండోఅంతస్థులో ఉండగా.. డాక్టర్‌గా పరిచయం చేసుకున్న ఓ యువకుడు ఆమెపై లైంగికదాడి చేశాడు. సదరు యువకుడు కూడా అదే కోవిడ్ సెంటర్లో ఐదోఅంతస్థులో చికిత్సపొందుతున్నట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచదేశాలన్నింటిని వణికిస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కేసులతో సర్వత్రా ఆందోళన నెలకొన్నది. తాజాగా ఢిల్లీ సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఓ మానసిక వికలాంగుల ఆశ్రమంలో 8 మంది పిల్లలతోపాటు 23 మందికి కరోనా సోకింది. ఈ ఆశ్రమంలో 960 మంది మానసిక వికలాంగులు ఉంటున్నారు. ఈ నెల 5నుంచి 20వతేదీ వరకు మానసిక వికలాంగుల ఆశ్రమంలో కరోనా పరీక్షలు చేయగా 23 కరోనా పాజిటివ్ అని తేలింది. ఇందులో ముగ్గురు […]
బిజినేపల్లి , సారథి న్యూస్: ఆర్ఎంపీ వైద్యం వికటించి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆగ్రహించిన బాధితుడి కుటుంబసభ్యులు ఆర్ఎంపీ దవాఖాన ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి ఆర్ఎంపీని అదుపులోకి తీసుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మంగనూర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి(35) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు అదే గ్రామంలోని వేంకటేశ్వర ప్రాథమిక చికిత్స కేంద్రం లో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. అతడికి పెరాలసిస్ వచ్చినట్టు నిర్దారించుకొన్న వైద్యుడు అతడికి మందులు, […]